<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఇఎల్ఎస్ఎస్

టాక్స్ సేవింగ్ ఫండ్స్ / ఇఎల్ఎస్ఎస్

ఇఎల్ఎస్ఎస్ అనగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఈ ఇఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లను ఈక్విటీ ఫండ్స్‌గా పిలుస్తారు, ఇవి ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం పై పన్ను మినహాయింపును (సెక్షన్ 80సి) అందిస్తాయి. ఈ పన్ను మినహాయింపు ప్రతి ఆర్థిక సంవత్సరం (1 ఏప్రిల్ నుండి 31 మార్చి) ₹1.5 లక్షల పెట్టుబడి మొత్తానికి అందుబాటులో ఉంటుంది. ఈక్విటీ ఫండ్‌ల మాదిరిగా ఇఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా అదే స్థాయి రిస్క్ మరియు సంభావ్య రిటర్న్స్ కలిగి ఉంటాయి. ఇఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లో పెట్టుబడి అనేది యూనిట్ల కేటాయింపు తేదీ నుండి 3 సంవత్సరాల లాక్ ఇన్ వ్యవధికి లోబడి ఉంటుంది. పన్ను ప్రయోజనాలు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాలు, నియమాలు మరియు అమలులో ఉన్న ఏదైనా ఇతర చట్టం ప్రకారం ఉంటాయి