<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి

మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్స్ అనేది పెట్టుబడిదారులకు యూనిట్లను జారీ చేయడం ద్వారా వనరులను సమీకరించి ఆ నిధులను ఆఫర్ డాక్యుమెంట్లో పేర్కొన్న లక్ష్యాల ప్రకారం సెక్యూరిటీలలో పెట్టుబడి చేసే సాధనం.

సెక్యూరిటీలలో పెట్టుబడులు అనేవి పరిశ్రమలు మరియు రంగాల వ్యాప్తంగా ఉంటుంది మరియు అందువలన రిస్క్ తగ్గుతుంది. డైవర్సిఫికేషన్ రిస్కును తగ్గిస్తుంది, ఎందుకంటే అన్ని స్టాక్స్ ఒకే సమయంలో ఒకే దామాషాలో ఒకే దిశలో ప్రయాణించవు. పెట్టుబడిదారులు పెట్టిన డబ్బు మొత్తానికి తగినట్లుగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను జారీ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ యొక్క పెట్టుబడిదారులను యూనిట్ హోల్డర్లుగా పేర్కొంటారు.

పెట్టుబడిదారులు తాము చేసిన పెట్టుబడులకు అనుగుణంగా లాభాలు లేదా నష్టాలను పంచుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఎప్పటికప్పుడు ప్రారంభించబడే మరియు వివిధ పెట్టుబడి లక్ష్యాలు కలిగిన అనేక పథకాలను ప్రవేశ పెడతాయి. ప్రజల నుండి ఫండ్స్ సేకరించడానికి ముందు సెక్యూరిటీస్ మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద మ్యూచువల్ ఫండ్ రిజిస్టర్ చేసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక పదాలు ఇక్కడ అందించబడ్డాయి:

మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్లు

స్కీం యొక్క ఆస్తులలో పెట్టుబడిదారు షేర్ యొక్క పరిమాణాన్ని యూనిట్లు సూచిస్తాయి.

ఎన్ఎవి లేదా నెట్ అసెట్ వాల్యూ

ఓపెన్-ఎండెడ్ ఫండ్/స్కీం

క్లోజ్-ఎండెడ్ ఫండ్/స్కీం

క్లుప్తంగా
మ్యూచువల్ ఫండ్ అనేది ఒక పెట్టుబడి సాధనం, ఇందులో పెట్టుబడిదారులు యూనిట్ల కేటాయింపు కోసం నిధులను సమీకరిస్తారు మరియు ఆ నిధులను పెట్టుబడి లక్ష్యానికి అనుగుణంగా వివిధ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు