<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

ఎస్ఐపి అంటే ఏమిటి?

ఎస్ఐపి సదుపాయంతో (ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) క్రమం తప్పకుండా ఆదా చేయడానికి/పెట్టుబడి చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ మీకు సహాయపడతాయి. ఎస్ఐపి లో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీంలో నియమిత కాలంలో (ప్రతి వారం, నెల, త్రైమాసికం) నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి చేయాలి. ఈక్విటీ పెట్టుబడిలో ఎస్ఐపి చాలా ఉపయోగకరం. ఈక్విటీ మార్కెట్లు ప్రతి రోజూ ఊగిసలాటకి గురి అవుతాయి (దీనిని వొలటాలిటీ అని పేర్కొంటారు). ఈక్విటీ పెట్టుబడిలో మీరు ఎస్ఐపి సదుపాయాన్ని ఉపయోగించినప్పుడు, మీ పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవడానికి మీరు ఈ వొలటాలిటీ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు.