సైన్ ఇన్ అవ్వండి

పిఇ రేషియో అంటే ఏమిటి? అర్థం, వ్యాఖ్యానం మరియు పిఇ రేషియో ప్రాముఖ్యత​

ఒక సాధారణ ఉదాహరణతో P/E నిష్పత్తి యొక్క భావనను తెలుసుకుందాం. ఊహాత్మకంగా, మీరు కిరాణా షాపింగ్ కోసం బయటకు వెళ్లారని, మామిడి పళ్లను వేటాడుతున్నారని భావించినట్లయితే మీరు ఈ కింది ఎంపికలను పొందుతారు-

షాప్ B: రూ 550 ప్రతి కేజీకి, చాలా జ్యూసీ మరియు తాజాగ ఉంటుంది

P/E నిష్పత్తితో అదే విషయం. వివరంగా తెలుసుకుందాం.

P/E నిష్పత్తి అంటే ఏమిటి?

డైరెక్ట్ షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువగా వర్తింపజేయబడుతుంది, P/E నిష్పత్తి అనేది షేర్ సంపాదనలో 1 రూని సేకరించడానికి పెట్టుబడిదారు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న డబ్బు మొత్తాన్ని నిర్వచిస్తుంది.

ఇపిఎస్ ఎలా లెక్కించబడుతుందో మరియు దాని ముఖ్యత ఏంటి అని తెలుసుకుందాం. ఆర్థిక సంఖ్యలతో కంపెనీ Aని పరిగణించండి-

పైన పేర్కొన్న ఉదాహరణకు, EPS రూ 5,60,000/28,000= రూ 20. అంటే ఈ సంస్థ కోసం, ప్రతి షేర్ ₹ 20 సంపాదిస్తోంది.

ఇప్పుడు, ఈ కంపెనీ షేర్ యొక్క మార్కెట్ ధర ఒక్కో షేరుకు రూ. 800 అని అనుకుందాం.

అందువల్ల, P/E నిష్పత్తి రూ 800/ రూ 20 = 40 అవుతుంది.

మరోలా చెప్పాలంటే, ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారుడు ప్రతి షేరు సంపాదిస్తున్న దానికంటే 40 రెట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంటాడు, లేదా కంపెనీ సంపాదనలో రూ. 1 సంపాదించడానికి, పెట్టుబడిదారుడు రూ. 40 చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు.

మేము P/E నిష్పత్తిని ఎలా అర్థం చేసుకోగలము?

40 యొక్క P/E నిష్పత్తి అంటే ఏమిటి అని చూద్దాం. ఇది మంచిదా, లేదా చెడ్డదా? ఐసోలేషన్‌లో, P/E నిష్పత్తి, మామిడిపండ్ల ఉదాహరణల లాగానే, అర్ధవంతంగా ఉండదు. ఎందుకంటే మామిడి పండ్లతో పాటు అందించబడే విలువ, 40 విలువ మనకు మంచిదా కాదా అనేది మనకు తెలియదు. బహుశా ఒక పోటీదారు కంపెనీ B లేదా పరిశ్రమ యొక్క మరొక P/E నిష్పత్తికి సంబంధించి మాత్రమే మేము దీనిని గుర్తించగలము.

అదే ఉదాహరణను పరిగణించడం-

ఇప్పుడు, P/E నిష్పత్తిని అర్థం చేసుకోవడానికి ప్రారంభమవుతోంది. కంపెనీ యొక్క P/E నిష్పత్తి కంపెనీ B మరియు పరిశ్రమ యొక్క P/E నిష్పత్తి కంటే ఎక్కువగా ఉందని మరియు, కంపెనీ B యొక్క P/E నిష్పత్తి పరిశ్రమ P/E కంటే తక్కువగా ఉందని మేము చూస్తున్నాము. గుర్తుంచుకోండి, కంపెనీ A అనేది ఒక దుస్తులు-తయారీ కంపెనీ అయితే, పోలిక కోసం కంపెనీ B కూడా అదే డొమైన్‌లో ఉండాలి; లేకపోతే, పోలిక అనేది ఉండకూడదు.

అంటే కంపెనీ B కంపెనీ A కంటే చిన్నదని మరియు దానిలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుందా? కావచ్చు, కాకపోవచ్చు. ఒక పెట్టుబడిదారు కంపెనీ A యొక్క షేర్లకు ఎక్కువ చెల్లించి అలాగే కంపెనీ B యొక్క షేర్లకు తక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, అది ఏదైనా ఒకటి లేదా రెండు లేదా క్రింద పేర్కొన్న అన్ని కారణాల వల్ల ఉండవచ్చు.

అందువల్ల, మీరు ఏ కంపెనీ షేరును కొనుగోలు చేయాలనేది P/E నిష్పత్తి మాత్రమే అయితే, స్పష్టంగా, కంపెనీ A కంటే కంపెనీ B షేర్ తక్కువగా ఉంటుంది. కానీ అది కాదు. ఏ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలో నిర్ణయించేటప్పుడు అనేక రకాల అంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి మరియు P/E నిష్పత్తి పరిగణించబడే అంశాలలో ఒకటి మాత్రమే. అటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి P/E నిష్పత్తి యొక్క ముఖ్యత ఏమిటి?

ఇంతకు ముందు చెప్పినట్లుగా, డైరెక్ట్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టేటప్పుడు P/E నిష్పత్తులు మరింత ప్రభావవంతంగా ఉంటాయి, కానీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు P/Eకి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఈక్విటీ స్కీం అనేది షేర్ల సమాహారం, అందువల్ల, స్కీమ్ యొక్క P/E అనేది స్కీంలోని షేర్ల కేటాయింపుకు అనులోమానుపాతంలో పరిగణించబడే స్కీంలోని షేర్ల యొక్క P/E యొక్క వెయిటెడ్ సగటు.

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీం యొక్క అధిక P/E అంటే ఫండ్ మేనేజర్ మరింత వృద్ధి-ఆధారిత విధానాన్ని కలిగి ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో అధిక P/E నిష్పత్తి ఓవర్ వాల్యుయేషన్‌ని కూడా సూచిస్తుంది. ఒక తక్కువ P/E అనేది ఒక విలువ-ఆధారిత విధానాన్ని సూచిస్తుంది. ఎక్కువ పెట్టుబడి కాలాలు మరియు విలువపై అవగాహన ఉన్న పెట్టుబడిదారులకు తక్కువ P/E స్కీంలు అనుకూలంగా ఉండవచ్చు.

కానీ మళ్ళీ, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించేటప్పుడు ఏదైనా స్కీం యొక్క P/E నిష్పత్తిని ఒంటరిగా లేదా స్వతంత్రంగా పరిగణించకూడదని సూచించబడింది. మీరు మామిడి పండ్లతో ఇంటికి వెళ్లాలని అనుకోరు, ఇది ప్రారంభంలో చౌకగా కనిపించేది కాదు కానీ ఎక్కువగా తినగలిగేది కాదు! P/E నిష్పత్తితో అటాచ్ చేయబడిన విలువ, అదేవిధంగా, చాలా వరకు సాపేక్షంగా ఉంటుంది మరియు అలాగే పరిగణించబడాలని సూచించబడింది.

​​
డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి