సైన్ ఇన్ అవ్వండి

మ్యూచువల్ ఫండ్‌లో పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో అంటే ఏమిటి?​

పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేషియో ఒక సంవత్సరంలో మార్చబడిన/కొనుగోలు చేయబడిన/విక్రయించబడిన/టర్న్ ఓవర్ చేయబడిన పోర్ట్‌ఫోలియో హోల్డింగ్‌ల శాతమును ప్రతిబింబిస్తుంది. ఒక ఫండ్ గనక 25% పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేేేషియోను కలిగి ఉంటే, అంటే దాని సెక్యూరిటీలలో 25% గత సంవత్సరంలో విక్రయించబడిందని/కొనుగోలు చేయబడిందని అర్థం. అందువల్ల, ఒక అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేషియో అనేది, ఫండ్ మేనేజర్ హోల్డింగ్‌లను అధిక రేటుతో మరియు అటుదిటుగా మార్చుకుంటున్నారని సూచిస్తుంది.

ఉదాహరణకు, మీ మ్యూచువల్ ఫండ్ స్కీం ₹ 1000 కోట్ల విలువగల సెక్యూరిటీలను కొనుగోలు చేస్తే మరియు ఒక సంవత్సరంలో ₹ 800 కోట్ల విలువగల సెక్యూరిటీలను విక్రయిస్తే; అప్పుడు, దాని సగటు AUM ₹ 1200 కోట్లు అని అనుకుంటే,

పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి= 800 కోట్లు/1200 కోట్లు %= 66.667%

పైన పేర్కొన్న ఉదాహరణ కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకతల కోసం మాత్రమే.

పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేషియో గురించి మరింత తెలుసుకోండి-

  1. చురుకుగా/దూకుడుగా నిర్వహించబడిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము, అన్ని అవకాశాలలో, స్తబ్దంగా నిర్వహించబడిన ఒక ఫండ్ కంటే అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోను కలిగి ఉంటుంది.
  2. 100% పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి అంటే ఫండ్‌లోని అన్ని సెక్యూరిటీలు కొనుగోలు చేయబడ్డాయి/విక్రయించబడ్డాయి అని అర్థం కాదు; బదులుగా, ఇది ఏదైనా సంవత్సరంలో మార్చబడిన హోల్డింగ్స్ యొక్క % ను మాత్రమే సూచిస్తుంది.
  3. ఒక అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో, ఫండ్ చే భరించబడే మరిన్ని ట్రేడింగ్ ఖర్చులను సూచిస్తుంది, తద్వారా ఎక్స్‌పెన్స్ రేషియోను పెంచుతూ మరియు రాబడుల్ని ప్రభావితం చేస్తుంది.
  4. పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోను, సమంజసంగా, అదే జంట విభాగాల్లో మరియు ఇతర మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ సాధనాలతో పాటుగా ఏవైనా రెండు నిధులను పోల్చడానికి ఉపయోగించాలి.
  5. ఒక తక్కువ పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో తరచుగా కొనుగోలు మరియు నిలుపుదల వ్యూహానికి సరిపోతుంది.

అధికం వర్సెస్ స్వల్పం

పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో మీ మదుపు నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోతో ఉన్న ఒక స్కీమును ఎల్లప్పుడూ నివారించాలి అని అనుకోకూడదు. మొదటగా, అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో ఫలితంగా కలిగిన రిస్క్-రిటర్న్ రివార్డును చూడాలని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అది సాపేక్షంగా అధిక రిస్క్-సర్దుబాటు చేయబడే రాబడిని ఫలితంగా ఇస్తే, అప్పుడు మీరు ఆ స్కీములో మదుపు చేయాలని అనుకోవచ్చు. రెండవదిగా, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పనితీరును కొలవడానికి ఉపయోగించే ఇతర సాధనాలతో పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోను చూడవలసి ఉంటుంది మరియు దానితో కలిపి పోల్చుకోవాల్సి ఉంటుంది, అది తీసుకున్న రిస్క్ యొక్క ప్రతి యూనిట్‌కు ఒక ఫండ్ యొక్క రాబడిని-ఉత్పత్తి చేసే సామర్థ్యం యొక్క కొలమానంగా ఉంటుంది.

ఒక ఉదాహరణను తీసుకోండి-

ఉదాహరణకి, కేటగిరీ షార్ప్ రేషియో సగటు 0.78 వద్ద ఉన్నప్పుడు ఒక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి 120% మరియు 0.65 యొక్క షార్ప్ నిష్పత్తిని కలిగి ఉందని అనుకోండి.

ఒక అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి అంటే సెక్యూరిటీలు తరచుగా మారుతున్నాయని అర్థం, కానీ ఫండ్ ద్వారా ప్రతి యూనిట్‌కు జనరేట్ చేయబడిన రిటర్న్ ఇప్పటికీ కేటగిరీ సగటు కంటే తక్కువగా ఉంది. అందువల్ల, ఈ స్కీం కోసం అధిక ఎక్స్‌పెన్స్ రేషియోని చెల్లించిన తరువాత కూడా, అది కేటగిరీ యొక్క పూర్తి రిటర్న్ సామర్థ్యాన్ని ఉపయోగించకపోవచ్చు. అందువల్ల, ఈ ఫండ్‌లో పెట్టుబడి చేయాలన్న మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. ఒకవేళ స్కీమ్ యొక్క షార్ప్ రేషియో 1.05 అయితే, ఒక యూనిట్ రిస్క్ కోసం మీరు అందుకునే రిటర్న్ చాలా ఎక్కువగా ఉంటుంది అని దీని అర్థం మరియు మీరు చెల్లించే అధిక ఎక్స్‌పెన్స్ రేషియోతో విలువకి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు.

ముగింపుకు వస్తే, భారీ ఆర్థికపరమైన పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలు, మార్కెట్లో ఒడిదుడుకులు మొదలైనటువంటి అనేక అంశాలు ఉండవచ్చు, అవి సెక్యూరిటీల అధిక రాబడులకై ఒక ఫండ్ మేనేజర్ యొక్క నిర్ణయానికి దారితీయవచ్చు. అందువల్ల, ఒక ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో ఒక్కదాని ఆధారంగా మాత్రమే ఫండ్‌ను నిర్ణయించడం అనేది మంచిది కాకపోవచ్చు; దానికి బదులుగా మీరు మదుపు చేయాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ పథకాలను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఒక సాధనంగా దీనిని ఉపయోగించుకోవచ్చు.


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి