సైన్ ఇన్ అవ్వండి

 కంటెంట్ ఎడిటర్

మ్యూచువల్ ఫండ్స్‌పై త్వరిత అవలోకనం

సారాంశం: పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక పెట్టుబడిదారు ఎక్కువగా అందుబాటులో ఉన్న ఎంపికలను కనుగొని వాటి నుండి ఎంచుకోవాలి. మీ పెట్టుబడుల కోసం మీరు ఎలాంటి ఆప్షన్‌ని ఎంచుకున్నా, ప్రతి దానికీ లాభాలు, నష్టాలు ఉంటాయి, కానీ వాటిలో అనుకూలమైనవి ముఖ్యం. కావున మీ డబ్బును పెట్టుబడి చేసే ముందు, మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవడం మంచిది. ప్రయోజనాలు, నష్టాలను అంచనా వేయడం చాలా ముఖ్యం.

​​

పెట్టుబడి గురించి ఆలోచించినప్పుడు, పెట్టుబడిదారుడు అందుబాటులో ఉన్న అనేక ఆప్షన్‌లను కనుగొని వాటిలో ఎంచుకోవాలి. కావున, ఎవరైనా తప్పనిసరిగా స్టాక్స్, బాండ్‌లు, మనీ మార్కెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లు మొదలైన వాటిలో డబ్బును పెట్టుబడి చేయడం ద్వారా సాంప్రదాయ మార్గంలో వెళ్లాలి లేదా వాటిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మిశ్రమాలను ఎంచుకోవాలి. మీ పెట్టుబడుల కోసం మీరు ఎలాంటి ఆప్షన్‌ను ఎంచుకున్నా, ప్రతి దానికీ లాభాలు, నష్టాలు ఉంటాయి, కానీ వాటిలో అనుకూలమైనవి ముఖ్యం. అదేవిధంగా, ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఆప్షన్‌గా ఉన్నప్పుడు, మొదటి ప్రశ్న నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? దానికి సమాధానం ఈ క్రింది వాటిని తెలుసుకోవడంలో ఉంది:

  • మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?
  • నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఎవి) అంటే ఏమిటి?
  • వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఏమిటి?
  • మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
  • ఇందులో ఉన్న రిస్కులు ఏంటి?

కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక సాధారణ ఆర్ధిక లక్ష్యాన్ని సాధించడానికి వివిధ పెట్టుబడిదారులు సెక్యూరిటీల డైవర్సిఫైడ్ ఎంపికగా చేసిన పెట్టుబడిని ప్రొఫెషనల్‌గా నిర్వహించే పూల్. మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు డైవర్సిఫైడ్ చేయబడడం వల్ల రిస్కులకు దూరంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్‌లకు మార్కెట్‌పై నిరంతర నిఘా, వివిధ సెక్యూరిటీల పనితీరు అవసరం కాబట్టి, దీనిని ఫండ్ మేనేజర్లు అని పిలిచే నిపుణులు నిర్వహిస్తారు.

ఒకసారి మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో అంటే ఏమిటో మరియు దాని నిర్వచనం గురించి స్పష్టత వచ్చిన తరువాత, నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఎవి) గురించి తెలుసుకోవాలి.

యూనిట్‌ల నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఎవి) అనేది ప్రతిరోజూ లేదా నిబంధనల ద్వారా నిర్దేశించిన విధంగా నిర్ణయించబడుతుంది. ఎన్ఎవి కింది ఫార్ములా, లేదా ఎస్ఇబిఐ ద్వారా ఎప్పటికప్పుడు సూచించబడే ఇతర ఫార్ములా ప్రకారం లెక్కించబడుతుంది.

ఎన్ఎవి = [మార్కెట్ /స్కీమ్ యొక్క పెట్టుబడుల సరసమైన విలువ + రిసీవబుల్స్ + సంపాదించిన ఆదాయం + ఇతర అసెట్స్ - ఖర్చులు - పేయబుల్స్ - ఇతర లయబిలిటీలు] / అవుట్‌స్టాండింగ్ యూనిట్‌ల సంఖ్య

ఎన్ఎవి నాలుగు దశాంశ స్థానాల వరకు లెక్కించబడుతుంది.

స్కీమ్ రిటర్న్స్ అనేవి ఎన్ఎవి పనితీరును సూచిస్తాయి. అందువల్ల, పెట్టుబడిదారులు వివిధ సెక్యూరిటీలు, ఫండ్స్ పనితీరును అంచనా వేయడానికి తాజా ఎన్ఎవిని ట్రాక్ చేయాలి.

దీని తరువాత సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ రకాలు గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు దీనిని మెచ్యూరిటీ రకం, లక్ష్యం రకం ఆధారంగా వేరు చేయవచ్చు. ముందు దానితో ప్రారంభిస్తే, మూడు రకాల ఫండ్స్ ఉన్నాయి: ఓపెన్-ఎండెడ్ ఫండ్స్, క్లోజ్డ్ ఎండెడ్ మరియు ఇంటర్వెల్ ఫండ్స్. అలాగే పెట్టుబడి లక్ష్యాల ఆధారంగా ఉండేవి: ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌​, లిక్విడ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్‌, మరియు సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అవి వివిధ రంగాలలో మరియు పరిశ్రమలలో ఫండ్స్ డైవర్సిఫికేషన్, ఒక నిపుణుడి ద్వారా మీ ఫండ్స్ నిర్వహణ, మీ ఫండ్స్ లిక్విడ్‌గా ఉంటాయి, లాక్-ఇన్ వ్యవధి లేనట్లయితే మీకు ఎప్పుడైనా అందుబాటులో నిధులు ఉంటాయి. ఆర్థిక పరిమాణాల కారణంగా లావాదేవీ ఖర్చు తక్కువగా ఉంటుంది. నిధుల పనితీరుపై అప్‌డేటెడ్ సమాచారం పారదర్శకంగా ఉంటుంది. అన్ని ఫండ్స్ సెబీలో నమోదు చేయబడ్డాయి కాబట్టి, అన్ని మ్యూచువల్ ఫండ్‌లు నియంత్రించబడతాయని మరియు పర్యవేక్షించబడతాయని హామీ ఇవ్వడమైనది.

అనేక ప్రయోజనాలతో పాటు ఇందులో రిస్కులు కూడా ఉన్నాయి మరియు ఆర్థిక పరిస్థితిలో మార్పుల కారణంగా ఒక నిర్దిష్ట వ్యవధిలో వివిధ సెక్యూరిటీలు, స్కీమ్‌లు ప్రభావితం కావచ్చు. ఇవి మ్యూచువల్ ఫండ్స్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. అలాగే, పెట్టుబడిదారులు నియంత్రణ కలిగి ఉండకపోవచ్చు ఎందుకనగా వారు ఇచ్చిన సమయంలో ఫండ్ పోర్ట్‌ఫోలియో యొక్క ఖచ్చితమైన కూర్పును ఎప్పటికీ గుర్తించలేరు, అలాగే, ఏ సెక్యూరిటీలను కొనుగోలు చేయాలనే విషయంలో ఫండ్ మేనేజర్‌ని కూడా ప్రభావితం చేయలేరు.

రిస్క్ కారకాలు:

స్టాండర్డ్ రిస్క్ కారకాలు - మ్యూచువల్ ఫండ్స్ మరియు సెక్యూరిటీల పెట్టుబడులు ట్రేడింగ్ వాల్యూమ్‌లు, సెటిల్‌మెంట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ మరియు డిఫాల్ట్ రిస్క్ వంటి పెట్టుబడి నష్టాలకు లోబడి ఉంటాయి మరియు ప్రిన్సిపల్‌ మొత్తాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, స్కీమ్ యొక్క లక్ష్యాలు నెరవేరుతాయని ఎటువంటి హామీ లేదు.

స్కీమ్ నిర్దిష్ట రిస్క్ కారకాలు - ఈక్విటీలు, బాండ్లు, విదేశీ సెక్యూరిటీలు, సెక్యూరిటీల రుణాలు, విదేశీ పెట్టుబడులు, వ్యాల్యుయేషన్ రిస్క్, మార్క్ టూ మార్కెట్ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, సూచించిన అస్థిరత, వడ్డీ రేట్ రిస్క్, కౌంటర్‌పార్టీ రిస్క్ డిఫాల్ట్ రిస్క్), సిస్టమ్ రిస్క్, డెరివేటివ్స్ వాడకంతో జతచేయబడిన రిస్క్. ఇంకా ఇతర స్కీమ్ నిర్దిష్ట రిస్క్ కారకాలు, అదనపు రిస్క్ కారకాలు, నిర్దిష్ట రిస్క్ కారకాలు, మొదలైనవి.

కావున, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలా వద్దా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నపుడు, మీరు తప్పనిసరిగా మూల్యాంకనం చేసి, ఆపై మీ డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయాలి.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ పేర్కొనబడిన అంశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి మరియు వీటిని మార్గనిర్దేశకాలు, సిఫారసులు లేదా పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్‌కి సంబంధించి కొన్ని వాస్తవిక మరియు గణాంక సంబంధిత సమాచారం థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడినది మరియు ఇవి నమ్మదగినవిగా పరిగణించబడతాయి. అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికత లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా వాటి కోసం వేయబడిన అంచనాల సహేతుకతను ఆర్ఎన్ఎఎం స్వతంత్రంగా ధృవీకరించనందున; అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు సంబంధించి ఆర్ఎన్ఎఎం ఏ విధంగా హామీ అందించదు అని గమనించాలి. ఈ మెటీరీయల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్లు మరియు వాక్యాలు అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడిన ఆర్‌ఎన్ఎఎం యొక్క అభిప్రాయలు లేదా ఉద్దేశాలను సూచించవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

​​​​​
డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి