సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

కంటెంట్ ఎడిటర్

డెట్ ఫండ్స్ యొక్క ప్రయోజనాలు

When it comes to your money, what makes you sleep peacefully at night? Perhaps, the knowledge that is invested right with relatively fewer risks? Debt mutual funds may help you get that feeling. Ideal for investors with a lower risk appetite, not friends with the stock market volatility, a good entry-point for new investors and yet, aiming to give you relatively better returns than the traditional investment instruments; that is debt fund investment for you! Once you start exploring, you will find that the benefits of debt funds are plenty.

You can read here to know in detail about how debt funds work. Whether you want to invest for a long-term goal or a short-term one, there is a debt fund for everyone. Short term debt funds are, in fact, quite popular, owing to liquidity and other advantages.

Here are a few of the many reasons why debt fund investment should be considered.

అధిక లిక్విడిటీ

రిడీమ్ చేసుకోవడాన్ని నివారించే లాక్ ఇన్ డెట్ ఫండ్స్‌లో సాధారణంగా ఉండదు. స్వల్ప కాలిక డెట్ ఫండ్స్ ప్రజాదరణ పొందడానికి మరొక కారణం డబ్బు అందుబాటులో ఉండడం వలన పెట్టుబడిదారులు నిశ్చింతగా ఉంటారు. డెట్ ఫండ్‌ను రిడీమ్ చేసుకోవడం సులభం మరియు దీనిని కొన్ని క్లిక్‌లతో చేయవచ్చు.

ఇతర వాటితో పోలిస్తే స్థిరమైనవి మరియు సురక్షితమైనవి

డెట్ ఫండ్స్ గురించి మీరు మరిన్ని వివరాలు చదువుతున్నప్పుడు, ఇవి ఎక్కువగా కార్పొరేట్లు/ ప్రభుత్వానికి రుణం అందిస్తాయి అని మీరు గ్రహిస్తారు. ఫండ్ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయన్న విషయంపై మీకు అవగాహన ఉన్నంత వరకు మరియు అది మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి పరిధికి తగినట్లుగా ఉంటే, మీ పెట్టుబడి గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే బాండ్ మార్కెట్లు అస్థిరత తక్కువగా ఉంటుంది, అందువల్ల, అవి స్థిరంగా ఉంటాయి.

పన్ను ఆదా చేసే సామర్థ్యం

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి వలన లభించే అతి పెద్ద ప్రోత్సాహకం పన్ను ప్రయోజనాలు. డెట్ ఫండ్స్ వలన పన్ను ఆదా అయ్యే రిటర్న్స్ ఎలా లభిస్తాయి తెలుసుకోండి

ఎస్‌టిసిజి పన్ను (స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను)- మీ హోల్డింగ్ వ్యవధి 36 నెలల కంటే తక్కువ లేదా సమానంగా ఉంటే, అప్పుడు మీరు మీ పెట్టుబడిని రిడీమ్ చేసుకున్నప్పుడు మీ క్యాపిటల్ గెయిన్/రిటర్న్స్ పై ఎస్‌టిసిజి పన్ను వర్తిస్తుంది. ఈ సందర్భంలో, మీ ఆదాయ పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం మూల ధన పన్ను విధించబడుతుంది.

ఎల్‌టిసిజి పన్ను (దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను)- మీ హోల్డింగ్ వ్యవధి 36 నెలల కంటే ఎక్కువగా ఉంటే, మీరు మీ పెట్టుబడిని రిడీమ్ చేసుకున్నప్పుడు మీ మూలధన లాభం/రాబడుల పై 20% (ఇండెక్సేషన్‌తో) ఎల్‌టిసిజి పన్ను వర్తిస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇండెక్సేషన్ ప్రయోజనం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అసలు కొనుగోలు విలువతో కాకుండా పెట్టుబడి యొక్క ఇండెక్స్డ్ విలువను పరిగణించి మూలధన లాభాన్ని లెక్కించడం ద్వారా ఇది చేయబడుతుంది. కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ (సిఐఐ) ఇండెక్స్డ్ విలువను లెక్కించడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, మీ అసలు పెట్టుబడి మొత్తం ₹100 అని అనుకుందాం, రిడెంప్షన్ సమయంలో ఇది ₹150 అయితే మరియు మీ పెట్టుబడి యొక్క ఇండెక్స్డ్ విలువ ₹125 గా ఉంటే, మూల ధన లాభం ₹25 (150-125) అవుతుంది, ₹50 (150-100) కాదు.

డైవర్సిఫికేషన్ ద్వారా రిస్క్ తగ్గింపు

ఏదైనా పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ భాగం ఎక్కువగా ఉంటే, మీ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేయడం ద్వారా డెట్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో రిస్కులను తగ్గిస్తాయి. అయితే, మీ పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ మరియు మీ ఆర్థిక లక్ష్యాలకు మీ డెట్ ఫండ్ రిటర్న్స్ అనుగుణంగా కూడా ఉండాలి, అందుకే ఇందులో వ్యూహాత్మక పెట్టుబడి అవసరం కానీ డెట్ ఫండ్స్ మరియు ఈక్విటీ ఫండ్స్ మధ్య వ్యత్యాసాలను గమనిస్తే, డెట్ ఫండ్స్ ఎక్కువ స్థిరంగా, ఎక్కువ లిక్విడ్‌గా మరియు తక్కువ రిస్కును కలిగి ఉంటాయి. అయితే, డెట్ ఫండ్స్‌లో పూర్తిగా రిస్క్ లేకుండా ఉండవు అని గమనించాలి. డెట్ ఫండ్స్‌కు సంబంధించిన రిస్కుల గురించి మీరు మరింత చదవవచ్చు, Here

సాంప్రదాయక పెట్టుబడి సాధనాల కంటే మెరుగైన రాబడుల లక్ష్యాన్ని కలిగి ఉండండి

సాంప్రదాయక పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మెరుగైన రాబడులను అందించే సామర్థ్యాన్ని డెట్ ఫండ్స్ కలిగి ఉంటాయి. పడిపోతున్న వడ్డీ రేట్ల నుండి ఫండ్స్ ప్రయోజనం పొందే అవకాశం ఉంది, ఇది మూల ధనం పెరగడానికి సహాయపడుతుంది

ఇప్పుడు మీరు డెట్ ఫండ్స్ ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కాబట్టి, వారు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకుందాం. Here మరియు డెట్ ఫండ్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి అనేది తెలుసుకోండి

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

యాప్‌ని పొందండి