వారం యొక్క ఫైనాన్షియల్ టర్మ్ - అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఎయుఎం)
మ్యూచువల్ ఫండ్స్‌లో అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఎయుఎం) అనేది ఒక నిర్దిష్ట స్కీంలో ఉండే అన్ని అసెట్స్/క్యాపిటల్ యొక్క పూర్తి మొత్తం. ఇతర పదాలలో, ఫండ్ మేనేజర్ యొక్క పెట్టుబడి వ్యూహాల కారణంగా పెట్టుబడిదారుల ద్వారా పెట్టుబడి పెట్టిన డబ్బు మరియు పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయాన్ని ఇది కలిగి ఉంటుంది.
అందువల్ల, మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలో 100 పెట్టుబడిదారులు ₹ 1000 పెట్టుబడి పెట్టినట్లయితే, అప్పుడు స్కీమ్ యొక్క ఎయుఎం ₹ 1,00,000 (100x1000) ఉంటుంది.
ఎయుఎం ఎలా మారుతుంది?
స్కీమ్ యొక్క ఎయుఎం పెరుగుదలకు కారణాలు ఇలా ఉండవచ్చు-
- కొత్త పెట్టుబడిదారులు ఫండ్‌లో పెట్టుబడులు పెట్టారు
- ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు ఫండ్‌లో అదనపు పెట్టుబడులను పెడతారు
- ఫండ్ మేనేజర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కారణంగా ఎయుఎం పెరుగుతుంది
దీనికి విరుద్ధమైనది కూడా నిజం. ఒకవేళ ఫండ్ యొక్క ఎయుఎం పెరుగుతుంటే అది తగ్గడానికి కూడా అవకాశం ఉంది.
మ్యూచ్యువల్ ఫండ్స్ ఎంచుకోవడంలో ఎయుఎం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
వివిధ పెట్టుబడి వ్యూహాలతో రెండు మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎయుఎం ను పోల్చడం అనేది ఆపిల్లను ఆరెంజ్‌లతో పోల్చడం లాంటిది. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కన్నా ఎక్కువగా పెట్టుబడి పెట్టబడినందున అది మంచి స్కీమ్ అని కాదు. మీ రిస్క్ అప్పిటైట్ లేదా జీవిత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఇది మీ పోర్ట్‌ఫోలియోకు అది ఒక మంచి స్కీమ్ కాకపోవచ్చు, లేదా అది అద్భుతమైన పనితీరు ట్రాక్ రికార్డ్ కలిగి ఉండకపోవచ్చు. ఫండ్ యొక్క సైజుని దాని పనితీరుకు నేరుగా జోడించగల ఎటువంటి సిద్ధాంతం ఇప్పటివరకు ఏ పరిశోధన కూడా నిరూపించలేదు. ఒక పెట్టుబడిదారుగా, ఒక ఫండ్ సైజు ₹ 10,000 కోట్లా లేదా ₹ 1000 కోట్లా అన్నది మీ ఆర్థిక ప్రణాళికకు సరిపోయేంత వరకు పట్టింపు లేదు.
ఫండ్ యొక్క సైజుకు ఎటువంటి ప్రాముఖ్యత లేదని దీని అర్థమా? కాదు. ఇది వివిధ ఆస్తి తరగతుల కోసం వివిధ విషయాలను సూచిస్తుంది-
ఈక్విటీ మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలకు (స్మాల్-క్యాప్ మినహాయింపు)
ఒక ఆదర్శవంతమైన ఈక్విటీ స్కీంని ఎంచుకునేటప్పుడు మీరు ఎయుఎంను ప్రాథమిక అంశాలలో ఒకటిగా పరిగణించకూడదు. అధిక ఎయుఎం అంటే ఈ స్కీమ్ ప్రజాదరణ పొందినది అని మరియు కొంత కాలం నుండి ఉంది అని అర్థం; అయితే, మీకు నమ్మకం కుదరడానికి దీని పనితీరు సరిపోతుంది.
(గతంలోని పనితీరు భవిష్యత్తులో నిలకడగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు ఇతర పెట్టుబడితో పోల్చడానికి అది ఆధారం కాకపోవచ్చు.)
స్మాల్-క్యాప్ ఈక్విటీ మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలకు
స్మాల్-క్యాప్ స్కీంలకు ఈ సైజు కొన్నిసార్లు రెండంచులుగల కత్తిగా పనిచేయవచ్చు, ఇది పరిమితం చేయబడిన ఇన్‌ఫ్లోలకు దారితీయవచ్చు. స్థానాలకు సంబంధించి వేగవంతమైన నిర్ణయాలు అత్యవసరం కావచ్చు కాబట్టి పెట్టుబడి యొక్క లిక్విడిటీ అనేది స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ నిధుల మేనేజర్‌కు ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. ఇన్‌ఫ్లో పరిమితికి దారితీసే ఫండ్ స్టేక్ యొక్క స్థిరత్వాన్ని నివారించేందుకు సాధారణంగా స్మాల్-క్యాప్ కంపెనీలలో భారీ వాటాలను కొనుగోలు చేయడం నివారించబడుతుంది. అందువల్ల, స్మాల్-క్యాప్ స్కీమ్ కోసం, మీరు ఎస్ఐపి*ని పెట్టుబడి పద్ధతిగా పరిగణించవచ్చు, ఎందుకంటే ఇది కొంత కాల వ్యవధిలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతించి ఫండ్ సైజుపై అటువంటి పరిమితిని తగ్గించడంలో సహాయపడడంతో పాటు మీ దీర్ఘకాల వీక్షణను కొనసాగించడంలో కూడా సహాయపడుతుంది.
*ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దీనిలో మీరు నియమిత కాల వ్యవధిలో నిర్ధిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెట్టవచ్చు మరియు కాంపౌండింగ్ పవర్ ద్వారా కొంత కాలానికి మెరుగైన లాభాలను పొందవచ్చు.
డెట్ మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలకు
కనీస ఎయుఎం డెట్ స్కీంలను మరియు పెద్ద ఎయుఎం లను నివారించడం మంచిది. పెద్ద డెట్ స్కీంలు డెట్ ఇష్యూర్లతో మెరుగైన రేట్లను చర్చించగలవు, కానీ అవి భారీ రిడెంప్షన్ అభ్యర్థనలను ఎదుర్కొంటే, అది ఒక సమస్యకు దారి తీయచ్చు. మరొకవైపు, అతి తక్కువ ఎయుఎం డెట్ స్కీంలు అధిక ఎక్స్పెన్స్ రేషియోని కలిగి ఉండవచ్చు.
ఇంకా చెప్పాలంటే, మీ పెట్టుబడి అనుకూలతకు ఫండ్ యొక్క సైజుకు సంబంధించిన ఒక ట్రెండ్‌ను గుర్తించడానికి భారతీయ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ అనేది కాస్త చిన్నది కావచ్చు. ఏ సమయంలోనైనా, మీరు ఫండ్ సైజు కంటే దాని పనితీరుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకోవచ్చు. అంతేకాకుండా, పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యం మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కూడా పరిగణించాలి.
(గత పనితీరు భవిష్యత్తులో ఉండచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు ఇతర పెట్టుబడితో పోల్చడానికి ఇది తప్పనిసరిగా ఆధారాన్ని అందించదు)
ఏదైనా పెట్టుబడి సూచనల కోసం మీరు మీ మ్యూచ్యువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నుండి సలహా తీసుకోవచ్చు.