అంతర్జాతీయ మార్కెట్లు త్వరలో రికవర్ అవుతాయా? 2008 ఆర్థిక మాంద్యం నుండి పెట్టుబడిదారులకు కీలకమైన పాఠాలు.
అంతర్జాతీయ మార్కెట్ పతనం గురించి భారతదేశానికి మరియు ప్రపంచానికి తెలియనిది కాదు. ఇది ఇంతకు ముందు జరిగింది మరియు 2008 ఆర్థిక మాంద్యం దీనికి ఒక ఉదాహరణ. అప్పటి కారణాలు మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న వాటికి భిన్నంగా ఉన్నప్పటికీ, ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా ఏమీ లేదు.
కోవిడ్-19 మహమ్మారి పర్యవసానంగా అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం గురించి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) అంచనా వేసినప్పటి నుండి, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంతర్జాతీయ ఆర్థిక తిరుగోమనం ఎప్పుడు ముగుస్తుందో ప్రపంచం తెలుసుకోవాలనుకుంటుంది.
అయితే, అంతర్జాతీయ మార్కెట్ రికవరీని అర్థం చేసుకోవడానికి, కొన్ని అంశాలను అర్థం చేసుకుని అంచనా వేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
జూన్ 2020 తేదీ నాటి ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ ప్రకారం, 2020 లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4.5% తగ్గుతుంది అని అంచనా వేసింది. దీనికి కారణం, ఇంతక ముందు ఎన్నడూ లేని విధంగా అన్ని ఆర్థిక కార్యకలాపాలు కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయాయి.
ఈ ప్రస్తుత పరిస్థితితో, దేశం కొంత కాలం పాటు ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చు అన్ని అంచనా వేయబడుతుంది.
ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఏమి జరుగుతుంది?
ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు, ఆర్థిక వృద్ధి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ఇది జిడిపి తగ్గుదలకి, సగటు ఆదాయం తగ్గుదలకి మరియు నిరుద్యోగం పెరుగుదలకి కారణం అవుతుంది.
భారతదేశం ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటుందా?
ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, భారతదేశం ఎన్నడూ ఆర్థిక కార్యకలాపాలలో దీర్ఘకాలం పాటు క్షీణతను ఎదుర్కొనలేదు. ఇప్పుడు, దేశం మొదటిసారిగా ఆర్థిక మాంద్యం పరిస్థితని ఎదుర్కొనే అవకాశం ఉంది.(జాతీయ హెరాల్డ్ ఇండియాలో ప్రచురించబడిన అభిప్రాయం, తేదీ 21st జూన్ 2020)
అయితే, 2008 సంక్షోభం కూడా దేశానికి మొట్టమొదటిది మరియు భారతదేశం ఇబ్బంది పడకుండా దీనిని అధిగమించింది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం మెరుగైన స్థితిలో నిలిచింది.
2008 ఆర్థిక మాంద్యం నుండి భారతదేశం యొక్క రికవరీ ఆశ కలిగిస్తున్నప్పటికీ, కోవిడ్-19 ప్రభావం నుండి కొలుకోవడానికి దేశం ఇంకా వేచి ఉంది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నుండి మనం ఎప్పుడు బయట పడతాము? దాని గురించి తెలుసుకుందాం.
ఈ ఆర్థిక మాంద్యం ఎంతకాలం ఉంటుంది?
మనము గత 14 మాంద్యం పరిస్థితులను పరిశీలించినట్లయితే, అవి సగటున 1.1 సంవత్సరాల పాటు కొనసాగాయి. ఎక్కువ కాలం ఉన్న మాంద్యం 3.5 సంవత్సరాలు (1929 నాటి గ్రేట్ డిప్రెషన్) మరియు అతి తక్కువ కాలం ఉన్నది ఆరు నెలలు (1980 ఆర్థిక మాంద్యం).
అంతర్జాతీయ మార్కెట్లు ఎప్పుడు రికవర్ అవుతాయి?
ఈ ప్రశ్నకు సమాధానం క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఒక విషయం మాత్రం స్పష్టం, ఆర్థిక స్థితి పునరుద్ధరణ రాత్రికి రాత్రి జరగదు.
సాధారణంగా ఆర్థిక మాంద్యం తరువాత ఆర్థిక వృద్ధి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వృద్ధి కాలం గడచిన సంవత్సరాలలో వివిధ రకాలుగా ఉంది, 1980 ఆర్థిక మాంద్యం తరువాత ఇది సుమారుగా ఒక సంవత్సరం పాటు ఉంది మరియు 1991 ఆర్థిక మాంద్యం తరువాత సుమారుగా పది సంవత్సరాల పాటు ఉంది. సగటున వృద్ధి కాలం అనేది దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు ఉంటుంది. అంచనాలు వేయడానికి గత ఉదంతాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, రాబోయే కాలం కోసం అవి ఎల్లప్పుడూ ఖచ్ఛితమైనవిగా పరిగణించకూడదు.
అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నుండి కొలుకువడానికి పట్టే సమయం రికవరీ పాటర్న్ ప్రకారం ఉంటుంది
రికవరీ రకాలు
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకునే విధానం ప్రకారం ఆర్థిక మాంద్యం నుండి రికవరీ నిర్దిష్ట పాటర్న్‌ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఇది ఈ క్రింద ఇవ్వబడిన గ్రోత్ కర్వ్‌లను అనుసరిస్తుంది:
-
వి-ఆకారం:ఇది వేగవంతమైనది మరియు తీక్షణమైనది. ఈ దృష్టాంతంలో, ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన తగ్గుదల ఉంటుంది, దీని తర్వాత రికవరీ కూడా అంతే వేగంగా ఉంటుంది.
-
యు-ఆకారం:ఇందులో, ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనం అవుతుంది కానీ రికవరీ చాలా నెమ్మదిగా ఉంటుంది.
-
డబ్ల్యు-ఆకారం:ఇటువంటి సందర్భంలో, ఆర్థిక వ్యవస్థ వి-ఆకరపు రికవరీలో ఉన్నట్లుగా ఉంటుంది, కానీ పూర్తిగా రికవర్ అయ్యే ముందు మరొకసారి చిన్న స్థాయిలో పతనం అవుతుంది.
-
ఎల్-ఆకారం:ఇందులో వృద్ధి పతనం అవుతుంది, దీని తరువాత సాధారణ స్థాయికి చాలా నెమ్మదిగా చేరుకుంటుంది.
-
స్వూష్-ఆకారం:ఇందులో పతనం ఏటవాలుగా ఉంటుంది, ఆ తరువాత ప్రారంభంలో నెమ్మదిగా ఆ పై క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటుంది.
పెట్టుబడిదారులకు 2008 ఆర్థిక మాంద్యం యొక్క అధ్యయనం ఎందుకు ముఖ్యం?
2008 ఆర్థిక సంక్షోభం స్టాక్ మార్కెట్లలో తీవ్ర నష్టాలకు కారణం అవ్వడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కూడా తీవ్రంగా ఉంటూ, దాని ముగింపు కూడా కానరాని పరిస్థితిలో, ప్రపంచం మొత్తం మరొక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే, 2007-2008 సంక్షోభం నుండి మనం నేర్చుకున్న పాఠాలు ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మనకి సహాయపడవచ్చు.
2008 ఆర్థిక సంక్షోభం కారణంగా ఎదురైన కఠిన పరిస్థితులలో మనం నేర్చుకున్న ఐదు పాఠాలు ఇక్కడ అందించబడ్డాయి.
పాఠం 1: వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోని కలిగి ఉండడం
వివిధ పరిశ్రమలు మరియు రంగాలలోని స్టాక్స్ కొనుగోలు చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యంగా మారిస్తే రిస్క్ తగ్గించడానికి సహాయపడుతుంది. తమ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మార్చడానికి మ్యూచువల్ ఫండ్స్‌ని ఒక పెట్టుబడి ఎంపికగా పరిగణించవచ్చు.
పాఠం 2: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ద్వారా పెట్టుబడి చేయడం
పెట్టుబడి నష్టాలను కనిష్ట స్థాయిలో ఉంచడానికి సిస్టమాటిక్ పెట్టుబడులు ఎంత మెరుగ్గా ఉపయోగపడ్డాయో 2008 ఆర్థిక సంక్షోభం మనకి నేర్పింది. దీనికి కారణం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) రూపీ కాస్ట్ యావరేజింగ్ సూత్రం స్టాక్ మార్కెట్ పతనం వలన పెట్టుబడుల పై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
పాఠం 3: ఓపికగా ఉండటం
2008 ఆర్థిక సంక్షోభం ఫలితంగా స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో అమ్మకాలు జరిగాయి. దీని వలన పెద్ద సంఖ్యలో పెట్టుబదుదారులు భారీ నష్టాలను చవి చూశారు. అందుకే, ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో, ఓపికగా ఉంది తమ పెట్టుబడులను అమ్మకూడదు. భవిష్యత్తులో పెట్టుబడుల విలువ పెరిగే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది.
పాఠం 4: ఈక్విటీ మార్కెట్ కాకుండా ఇతర వాటిని పరిగణించడం
అనేక రకాల వర్గాలకు చెందిన అసెట్లు కలిగి ఉన్న ఒక పెట్టుబడి పోర్ట్‌ఫోలియో ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పెట్టుబడుల పై ఈక్విటీలు మంచి రాబడిని అందించినప్పటికీ, ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఒకరు బాండ్లు, డెట్ సాధనాలు, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు బంగారం ఎంచుకోవచ్చు.
పాఠం 5: సిద్ధంగా ఉండడం
2007-2008 సమయంలో, అనేక మంది చిన్న స్థాయి పెట్టుబడిదారులు తగిన మొత్తంలో ఆధారపడదగిన అత్యవసర నిధిని కలిగి లేకుండా భారీ మూల్యాన్ని చెల్లించారు. ఇంకా, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, భారతదేశంలో ప్రస్తుత ఉపాధి రేటు పై ప్రభావం పడుతుంది. అత్యవసర నిధి అనేది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటునటువంటి క్లిష్ట సమయాలను అధిగమించడానికి పెట్టుబడిదారులకు సహాయపడుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లు మళ్ళీ ఎప్పుడు లాభాల బాటలో పయనిస్తాయో చెప్పడం కష్టం. అలాగే, ఆర్థిక స్థితి పై కోవిడ్-19 వలన ప్రతికూల ప్రభావం పడకుండా ఉండడం సాధ్యం కాదు. 2007-2008 ఆర్థిక మాంద్యం పాఠాలతో రేపటి కోసం సిద్ధం అవ్వడం ఇప్పుడు మనం చేయగలిగిన ఉత్తమమైన పని.
రిఫరెన్సులు :
https://www.imf.org/en/Publications/WEO/Issues/2020/01/20/weo-update-january2020
https://timesofindia.indiatimes.com/business/india-business/gdp-growth-falls-to-5-8-in-january-march-quarter-slowest-in-five-years/articleshow/69598816.cms
https://www.forbes.com/sites/mikepatton/2020/04/30/what-the-past-90-years-has-taught-us-about-recessions-and-stock-behavior/#10328ed92ddf
https://www.nationalheraldindia.com/opinion/economists-now-say-future-bleaker-than-ever
https://economictimes.indiatimes.com/opinion/et-commentary/2008-crisis-a-wake-up-call-for-india/articleshow/6000712.cms
https://www.ig.com/au/trading-strategies/what-is-an-economic-recovery-and-what-are-the-types-200612#types-of-recession-and-economic-recovery
https://www.imf.org/en/Publications/WEO/Issues/2020/06/24/WEOUpdateJune2020
https://www.thehindu.com/business/Economy/imf-projects-sharp-contraction-of-45-in-indian-economy-in-2020/article31907715.ece
ఇక్కడ పేర్కొనబడిన అభిప్రాయాలను ఏదైనా పెట్టుబడిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి లేదా అందుకు సంబంధించిన వాటి కోసం ఒక సలహా లేదా సిఫారసుగా పరిగణించకూడదు. డైవర్సిఫికేషన్ అనేది పెట్టుబడులకు హామీగా పరిగణించకూడదు మరియు ఇది నష్టం ఏర్పడే రిస్కును తొలగించదు. ఇవి వ్రాసే సమయంలో అవి విశ్వసనీయమైన వాటిగా పరిగణించబడింది, అయితే పూర్తి సమాచారం ఉండవలసిన అవసరం లేదు మరియు ఖచ్చితత్వం పై ఎటువంటి హామీ లేదు. మీకు ఎటువంటి సూచన లేదా సమాచారం లేకుండా అవి మార్చబడవచ్చు. పెట్టుబడుల విలువ మరియు వాటి నుండి వచ్చే ఆదాయం మార్కెట్ పరిస్థితులు మరియు పన్ను ఒప్పందాల ప్రకారం మారవచ్చు మరియు పెట్టుబడిదారులు పూర్తి పెట్టుబడి మొత్తాన్ని పెట్టుబడిదారులు వెనక్కి పొందే అవకాశం ఉండకపోవచ్చు. గత కాలపు ప్రదర్శన భవిష్యత్తులో కొనసాగకపోవచ్చు. ఈ అభిప్రాయలు మరియు వ్యూహాలు పెట్టుబడిదారులు అందరికీ సరిపోకపోవచ్చు. ఇంకా, పెట్టుబడి ఉత్పత్తి(లు) యొక్క ఉద్దేశం పెట్టుబడి లక్ష్యాన్ని సాధించడం అయినప్పటికీ, ఈ లక్ష్యాలు నెరవేరతాయి అని ఎటువంటి పూచీ ఉండదు. రిస్కు తీసుకునే సామర్థ్యం గురించి తమ పెట్టుబడి సలహాదారులను మరియు ఏదైనా పెట్టుబడి నిర్ణయం కోసం తమ పన్ను సలహాదారులను సంప్రదించవాలసిందిగా పెట్టుబడిదారులకు సలహా ఇవ్వబడుతుంది. మార్కెట్ ట్రెండ్లను వివరించడానికి డేటా/గణాంకాలు/ కామెంట్లు అందించబడ్డాయి, వీటిని ఏదైనా రీసెర్చ్ నివేదిక/రీసెర్చ్ సిఫారసుగా అన్వయించుకోకూడదు.