ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్- ఎంచుకోవడానికి ముందు వివరాలు తెలుసుకోండి
సారాంశం: మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీ ఫండ్స్‌ని వినియోగించడంలో మ్యూచువల్ ఫండ్లు గొప్ప పెట్టుబడి సాధనాలు. ఇది ఒకే రకమైన ఆలోచనా విధానం కలిగిన కొందరు వ్యక్తులు సమిష్టిగా సమకూర్చిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మరియు ఇది అనేక రకాల ఫండ్ స్కీమ్‌లను అందిస్తుంది. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ లిక్విడిటీ సౌలభ్యాన్ని అందిస్తుంది మరియు పెట్టుబడిదారులలో బాగా ప్రసిద్ధి చెందింది. కానీ, మీ
మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఎంచుకునే ముందు పాలసీ/స్కీమ్ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోండి
మనలో అందరకీ తెలిసినట్లుగానే, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒకే రకమైన ఆర్థిక లక్ష్యాలను కలిగిన అనేక పెట్టుబడిదారుల సమిష్టి మూలధనం. ఇక్కడ పెట్టుబడిదారులు అంటే ఏదైనా సంస్థ, వ్యక్తులు, కంపెనీలు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అవ్వచ్చు. ఈ సమిష్టి ఫండ్ సేకరించబడిన తరువాత వైవిధ్యమైన రీతిలో పెట్టుబడి చేయబడుతుంది. ఈ ఫండ్లను నిర్వహించడానికి ఫండ్ మేనేజర్లు ఉంటారు, వీరు స్టాక్స్, ఈక్విటీ బాండ్లు మొదలైన వాటిలో పెట్టుబడులు చేస్తారు. వివిధ రకాల మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడులు చేయడం వలన రిస్క్ తగ్గుతుంది. అందువలన, ఒక పెట్టుబడి సరైన పనితీరు ప్రదర్శించకపోతే, మరొకటి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది మరియు ఇది మీ రిటర్న్స్‌లో సమతౌల్యాన్ని నిర్వహిస్తుంది. ఆ విధంగా, సంపాదించబడిన రిటర్న్స్ వారి ప్రారంభ పెట్టుబడి వంతు ఆధారంగా పెట్టుబడిదారులకు పంపిణీ చేయబడుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ వర్గీకరణ అనేక ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది, అవి పెట్టుబడి స్వభావం, పొంచివున్న రిస్కు, పేఅవుట్ యొక్క పిరియాడిసిటీ లేదా ముగింపు సమయంగా చెప్పవచ్చు. క్లోజర్ సమయం ప్రకారం ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ మరియు క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ అనే 2 రకాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది ఫండ్ యూనిట్ల అమ్మకం మరియు కొనుగోలు సౌలభ్యం పై ఆధారపడి ఉంటుంది. కావున, ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిదారులు తమ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా యూనిట్లను జారీ చేయవచ్చు లేదా రీడీమ్ చేసుకోవచ్చు, క్లోజ్డ్ ఎండ్స్‌లో యూనిట్ యొక్క క్యాపిటల్ స్థిరంగా ఉంటుంది మరియు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే అమ్మకం అనుమతించబడుతుంది.
ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోని సౌలభ్యం కారణంగా, యూనిట్ యొక్క క్యాపిటల్ మారుతూ ఉంటుంది మరియు ఫండ్ పరిమాణంలో విస్తరణకు దోహదపడుతుంది. అయితే ఒకవేళ మేనేజ్మెంట్ పెద్ద మొత్తంలో ఫండ్స్‌ను నిర్వహించలేకపోతే మరియు ఆప్టిమైజ్ చేయలేకపోతే, అది సులభంగా సబ్స్క్రిప్షన్లను నిలిపివేయగలదు. క్లోజ్డ్ ఎండ్ ఫండ్‌లో కొనుగోలు మరియు అమ్మకాలు స్కీమ్స్ యూనిట్లు జాబితా చేయబడిన గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా జరుగుతాయి. కానీ పెట్టుబడిదారులకు నిష్క్రమించే అవకాశం ఇవ్వడానికి, ఫండ్ తమ క్లోజ్డ్ ఎండ్ స్కీమ్‌ను స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ చేయవచ్చు.
ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్లలో లిక్విడిటీ అందుబాటులో ఉంటుంది మరియు పెట్టుబడిదారులు నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఎవి) వద్ద యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మరోవైపు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లలో సబ్స్క్రిప్షన్ ఒక నిర్దిష్ట వ్యవధి వరకు మాత్రమే తెరవబడుతుంది మరియు నిష్క్రమణ మార్గాలు కూడా పరిమితంగా ఉంటాయి, సాధారణ ప్రాతిపాదికన ఈ ఫండ్లలో ఆకస్మిక రిడెంప్షన్లు ఉండవు. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లు సమగ్రంగా ఉన్నందున ఫండ్ మేనేజర్లు కూడా ఆందోళన లేకుండా ఉంటారు, అందుకే మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేసిన ప్రతిసారీ స్కీమ్ డాక్యుమెంట్‌ని స్పష్టంగా చదవండి. ఒక వేళ మీకు ఏ స్కీమ్ ఎంచుకోవాలో స్పష్టమైన అవగాహన లేకపోతే, ఒక పెట్టుబడి సలహాదారు నుండి సహాకారం తీసుకోండి
డిస్క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ పేర్కొనబడిన అంశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి మరియు వీటిని మార్గనిర్దేశకాలు, సిఫారసులు లేదా పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించి నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సంబంధిత సమాచారం (చారిత్రక మరియు అంచనా వేయబడినవి) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది మరియు ఇవి నమ్మదగినవిగా పరిగణించబడతాయి. అలాంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను లేదా అలాంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా వాటి కోసం వేయబడిన అంచనాల సహేతుకతను ఆర్ఎన్ఎఎం స్వతంత్రంగా ధృవీకరించదని గమనించాలి; అలాంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు సంబంధించి ఆర్ఎన్ఎఎం ఏ విధంగా హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్‌లో ఉన్న కొన్ని వాక్యాలు మరియు స్టేట్మెంట్లు ఆర్ఎన్ఎఎం యొక్క ఉద్దేశ్యాలను లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, అవి అలాంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.