మ్యూచువల్ ఫండ్‌లో ప్రామాణిక మళ్ళింపును అర్థం చేసుకోవడం - ఫార్ములా మరియు రిటర్నులు
జీవితంలో, మీరు చేసే ప్రతీదానిలో కొంత రిస్క్ ఉంటుంది. ఉదాహరణకు, మీరు బంగీ-జంపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, మిగిలిన వారితో పోలిస్తే మీకు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉందని సూచిస్తుంది. రిస్క్ తీసుకోవడానికి మీరు చూపే సంసిద్ధత అంటే తీవ్రమైన పరిస్థితులు మరియు అవి ఎంత తరచుగా జరుగుతాయి అన్న విషయాలు పట్టించుకోరు అని కాదు. మీరు సురక్షితమైన పరిస్థితులలో ఉన్నారు అని నిర్ధారించడానికి, ఏవైనా ప్రమాదాలు జరిగాయా లేదా మరియు ఎన్ని జంపింగ్ ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి అన్న విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే, అధిక రిస్క్ తీసుకునే వ్యక్తి అయినప్పటికీ, మీరు ఏ స్థాయిలో రిస్క్ తీసుకుంటున్నారో తెలియాలి. ఆర్థిక పెట్టుబడులలో, రిస్క్ స్థాయి లేదా రాబడులలో హెచ్చుతగ్గులు అనేవి ఒక నిర్దిష్ట పెట్టుబడి సాధనంలో పెట్టుబడి చేయాలా వద్దా అన్న విషయాన్ని నిర్ధారిస్తుంది. మరియు రిటర్న్స్‌లో ఈ హెచ్చుతగ్గులను స్టాండర్డ్ డివియేషన్ (ఎస్‌డి) ద్వారా లెక్కించబడుతుంది.
ఎస్‌డి అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీం లేదా ఏదైనా ఇతర రకమైన పెట్టుబడికి సంబంధించిన సంఖ్య, ఇది మీ రాబడులు మరియు మీ స్కీం యొక్క సగటు రాబడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతుంది.
స్టాండర్డ్ డివియేషన్ గురించిన వివరాలు
పెట్టుబడి నిర్ణయాల్లో మ్యూచువల్ ఫండ్ స్కీం ద్వారా పొందిన వార్షిక రాబడులు కీలక పాత్ర పోషిస్తాయి, అయితే మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఈ రాబడులు స్థిరంగా ఉండవు. వీటిలో ఉన్న రిస్క్ స్థాయి తెలుసుకోవడానికి ఎస్‌డి మీకు సహాయపడుతుంది; ఇంకో విధంగా చెప్పాలంటే సగటు కంటే రాబడులు ఎంత ఎక్కువగా మరియు తక్కువగా ఉన్నాయి అన్నది తెలుస్తుంది.
ఒక ఉదాహరణను చూద్దాం. మీరు 6 నెలల పాటు ప్రతి నెలా కిలో ఉల్లిపాయ ధరలను ట్రాక్ చేస్తున్నారు అని అనుకోండి, రికార్డులు ఇలా ఉన్నాయి-
పైన పేర్కొన్న పట్టిక ప్రకారం కిలో ఉల్లి సగటు ధర ₹ 33.8571 గా ఉంది. పేర్కొన్న నెలలో సగటు ధర నుండి ఎంత వరకు ధర హెచ్చుతగ్గులకు గురి అయిందో చూద్దాం-
సగటు ధర నుండి సగటు మార్పు ₹ 6.266 కు సమానంగా ఉంది. దీని అర్థం ఏమిటంటే, అనేక సార్లు, ధర ₹33.8571 కంటే ₹ 6.266 ఎక్కువగా పెరగదు లేదా తరగదు, ఈ విలువ 6.266 ని స్టాండర్డ్ డివియేషన్ అని అంటారు మరియు దీనిని రాబడులు పై కూడా అప్లై చేయవచ్చు.
ఒక పెట్టుబడిదారుగా, ఒక డెట్ స్కీంతో పోల్చినప్పుడు ఈక్విటీ స్కీం ఎక్కువ రిస్కును కలిగి ఉంటుంది అని మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎంత హెచ్చుతగ్గుల వరకు మీకు సౌకర్యవంతంగా ఉంటుంది? ఈక్విటీ స్కీం యొక్క సగటు వార్షిక రాబడులు 15% ఉంటే మరియు స్టాండర్డ్ డివియేషన్ 12 అయితే, మీ రాబడులు 3% లేదా 27% కంటే ఎక్కువగా ఉండవచ్చు.
పైన పేర్కొన్న వివరాలు అర్థం చేసుకోవడానికి మాత్రమే, అవి నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యొక్క ఏ స్కీం యొక్క ప్రదర్శనకు నేరుగా లేదా పరోక్షంగా సంబంధించినది కాదు
మనస్సులో ఉంచుకోవాల్సినవి-
- డెట్ స్కీముల వంటి తక్కువ-రిస్క్ మ్యూచువల్ ఫండ్ స్కీములు, ఈక్విటీ స్కీములతో పోలిస్తే తక్కువ ఎస్‌డి కలిగి ఉంటాయి
- ఒకే కేటగిరీకి చెందిన రెండు మ్యూచువల్ ఫండ్ స్కీంలను పోల్చడానికి ఉపయోగించకపోతే తక్కువ లేదా ఎక్కువ ఎస్‌డి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణకు, వాటిలో ఒక దానిని నిర్ణయించడానికి మీరు రెండు లార్జ్-క్యాప్ ఈక్విటీ స్కీంల ఎస్‌డి ని సరిపోల్చి చూడవచ్చు, కానీ మీరు ఒక డెట్ స్కీం యొక్క ఎస్‌డి ని ఒక లార్జ్ క్యాప్ ఈక్విటీ స్కీం యొక్క ఎస్‌డి తో పోల్చకూడదు.
- కేటగిరీ కూడా అధిక హెచ్చుతగ్గులకు లోనవుతే మరియు దాని కారణంగా అధిక ఎస్‌డి ఉంటే - దీని అర్థం స్కీం అస్థిరమైనది మరియు నివారించదగినది అని కాదు. అదేవిధంగా, ఒక డెట్ స్కీం యొక్క ఎస్‌డి తక్కువగా ఉంటే అది మంచి ఎంపిక అని కూడా కాదు.
- పెట్టుబడి అవధి ఎక్కువగా ఉంటే, ఎస్‌డి తక్కువగా ఉంటుంది ఎందుకంటే సుదీర్ఘ అవధి వలన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి ఉన్న అస్థిరత తక్కువగా ఉంటుంది.
చివరగా-
మ్యూచువల్ ఫండ్ స్కీం యొక్క ఎస్‌డి ఆ స్కీం యొక్క రిస్క్‌ను కొలవడానికి మీకు సహాయపడవచ్చు, కానీ అది ఒక్కటే సరిపోదు, అంటే దానిని విడిగా దాని ఒక్కదానికే ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. ఇది ఒక సాపేక్ష కొలమానం మరియు ఇతర స్కీంలతో పోల్చి పరిగణించాలి. మరిన్ని వివరాలకు మీరు మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదించవచ్చు.
ఇక్కడ వ్యక్తం చేయబడిన అంశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు పాఠకుడు అనుసరించదగిన ఏదైనా చర్య, ఏలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి లేవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు.