మ్యూచువల్ ఫండ్‌లో పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో అంటే ఏమిటి?
పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేషియో ఒక సంవత్సరంలో మార్చబడిన/కొనుగోలు చేయబడిన/విక్రయించబడిన/టర్న్ ఓవర్ చేయబడిన పోర్ట్‌ఫోలియో హోల్డింగ్‌ల శాతమును ప్రతిబింబిస్తుంది. ఒక ఫండ్ గనక 25% పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేేేషియోను కలిగి ఉంటే, అంటే దాని సెక్యూరిటీలలో 25% గత సంవత్సరంలో విక్రయించబడిందని/కొనుగోలు చేయబడిందని అర్థం. అందువల్ల, ఒక అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేషియో అనేది, ఫండ్ మేనేజర్ హోల్డింగ్‌లను అధిక రేటుతో మరియు అటుదిటుగా మార్చుకుంటున్నారని సూచిస్తుంది.
ఉదాహరణకు, మీ మ్యూచువల్ ఫండ్ స్కీం ₹ 1000 కోట్ల విలువగల సెక్యూరిటీలను కొనుగోలు చేస్తే మరియు ఒక సంవత్సరంలో ₹ 800 కోట్ల విలువగల సెక్యూరిటీలను విక్రయిస్తే; అప్పుడు, దాని సగటు AUM ₹ 1200 కోట్లు అని అనుకుంటే,
పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి= 800 కోట్లు/1200 కోట్లు %= 66.667%
పైన పేర్కొన్న ఉదాహరణ కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకతల కోసం మాత్రమే.
పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేేేేేేషియో గురించి మరింత తెలుసుకోండి-
- చురుకుగా/దూకుడుగా నిర్వహించబడిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము, అన్ని అవకాశాలలో, స్తబ్దంగా నిర్వహించబడిన ఒక ఫండ్ కంటే అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోను కలిగి ఉంటుంది.
- 100% పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి అంటే ఫండ్‌లోని అన్ని సెక్యూరిటీలు కొనుగోలు చేయబడ్డాయి/విక్రయించబడ్డాయి అని అర్థం కాదు; బదులుగా, ఇది ఏదైనా సంవత్సరంలో మార్చబడిన హోల్డింగ్స్ యొక్క % ను మాత్రమే సూచిస్తుంది.
- ఒక అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో, ఫండ్ చే భరించబడే మరిన్ని ట్రేడింగ్ ఖర్చులను సూచిస్తుంది, తద్వారా ఎక్స్‌పెన్స్ రేషియోను పెంచుతూ మరియు రాబడుల్ని ప్రభావితం చేస్తుంది.
- పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోను, సమంజసంగా, అదే జంట విభాగాల్లో మరియు ఇతర మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ సాధనాలతో పాటుగా ఏవైనా రెండు నిధులను పోల్చడానికి ఉపయోగించాలి.
- ఒక తక్కువ పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో తరచుగా కొనుగోలు మరియు నిలుపుదల వ్యూహానికి సరిపోతుంది.
అధికం వర్సెస్ స్వల్పం
పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో మీ మదుపు నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోతో ఉన్న ఒక స్కీమును ఎల్లప్పుడూ నివారించాలి అని అనుకోకూడదు. మొదటగా, అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో ఫలితంగా కలిగిన రిస్క్-రిటర్న్ రివార్డును చూడాలని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అది సాపేక్షంగా అధిక రిస్క్-సర్దుబాటు చేయబడే రాబడిని ఫలితంగా ఇస్తే, అప్పుడు మీరు ఆ స్కీములో మదుపు చేయాలని అనుకోవచ్చు. రెండవదిగా, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పనితీరును కొలవడానికి ఉపయోగించే ఇతర సాధనాలతో పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియోను చూడవలసి ఉంటుంది మరియు దానితో కలిపి పోల్చుకోవాల్సి ఉంటుంది, అది తీసుకున్న రిస్క్ యొక్క ప్రతి యూనిట్‌కు ఒక ఫండ్ యొక్క రాబడిని-ఉత్పత్తి చేసే సామర్థ్యం యొక్క కొలమానంగా ఉంటుంది.
ఒక ఉదాహరణను తీసుకోండి-
ఉదాహరణకి, కేటగిరీ షార్ప్ రేషియో సగటు 0.78 వద్ద ఉన్నప్పుడు ఒక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి 120% మరియు 0.65 యొక్క షార్ప్ నిష్పత్తిని కలిగి ఉందని అనుకోండి.
ఒక అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తి అంటే సెక్యూరిటీలు తరచుగా మారుతున్నాయని అర్థం, కానీ ఫండ్ ద్వారా ప్రతి యూనిట్‌కు జనరేట్ చేయబడిన రిటర్న్ ఇప్పటికీ కేటగిరీ సగటు కంటే తక్కువగా ఉంది. అందువల్ల, ఈ స్కీం కోసం అధిక ఎక్స్‌పెన్స్ రేషియోని చెల్లించిన తరువాత కూడా, అది కేటగిరీ యొక్క పూర్తి రిటర్న్ సామర్థ్యాన్ని ఉపయోగించకపోవచ్చు. అందువల్ల, ఈ ఫండ్‌లో పెట్టుబడి చేయాలన్న మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. ఒకవేళ స్కీమ్ యొక్క షార్ప్ రేషియో 1.05 అయితే, ఒక యూనిట్ రిస్క్ కోసం మీరు అందుకునే రిటర్న్ చాలా ఎక్కువగా ఉంటుంది అని దీని అర్థం మరియు మీరు చెల్లించే అధిక ఎక్స్‌పెన్స్ రేషియోతో విలువకి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు.
ముగింపుకు వస్తే, భారీ ఆర్థికపరమైన పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలు, మార్కెట్లో ఒడిదుడుకులు మొదలైనటువంటి అనేక అంశాలు ఉండవచ్చు, అవి సెక్యూరిటీల అధిక రాబడులకై ఒక ఫండ్ మేనేజర్ యొక్క నిర్ణయానికి దారితీయవచ్చు. అందువల్ల, ఒక ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో ఒక్కదాని ఆధారంగా మాత్రమే ఫండ్‌ను నిర్ణయించడం అనేది మంచిది కాకపోవచ్చు; దానికి బదులుగా మీరు మదుపు చేయాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ పథకాలను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఒక సాధనంగా దీనిని ఉపయోగించుకోవచ్చు.