ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ రేటులో వేసి చూసుకున్న తర్వాత మీ ప్రస్తుత ఇన్వెస్ట్‌మెంట్‌లు లాభదాయకంగా ఉన్నాయా అనేదానిని మీరు ఎలా సరిచూసుకుంటారు?
భవిష్యత్తులో ₹ 100 యొక్క విలువ తగ్గుతుందని మీకు తెలిసి ఉండిందా?? దాన్ని వేరుగా ఉంచుతూ, ఈ రోజున రూ. 100 భవిష్యత్ తేదీ నాటి రూ. 100 కంటే ఎక్కువ కొనుగోలు శక్తిని కలిగి ఉంది. సమయం గడిచే కొద్దీ డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది మరియు ఈ పోకడనే ద్రవ్యోల్బణం అని అంటారు. భవిష్యత్తులో రూపాయితో కొనడానికి మీకు వీలయ్యే దాని కంటే ఎక్కువ వస్తువులు మరియు సేవలను ఈ రోజున దానితో కొనుగోలు చేయగలిగేలా, వస్తువులు మరియు సేవల ధరల్లో క్రమబద్ధమైన పెరుగుదలగా ద్రవ్యోల్బణాన్ని నిర్వచించవచ్చు.
నిజమే, కచ్చితంగా మీరు దానినే విన్నారు. చేయడానికి చక్కనైన పని ఏమిటంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను ప్లాన్ చేస్తున్నప్పుడు ద్రవ్యోల్బణంతో పోల్చి చూసుకోవడం. అందువల్ల, ద్రవ్యోల్బణం రేటును అధిగమించే రిటర్న్ రేటును మీ ఇన్వెస్ట్‌మెంట్ సంపాదించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు మీ ద్రవ్యోల్బణ-సర్దుబాటు చేయబడిన రాబడులను గరిష్టం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సులువైన నియమం ఏంటంటే మీ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఒక నిర్దిష్ట ఇన్వెస్ట్‌మెంట్ వ్యవధి కోసం ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువ రిటర్న్ రేటును ఉత్పన్నం చేయాలి.
ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ రేటులో వేసి చూసుకున్న తర్వాత మీ ప్రస్తుత ఇన్వెస్ట్‌మెంట్‌లు లాభదాయకంగా ఉన్నాయా అనేదానిని మీరు ఎలా సరిచూసుకుంటారు?
ఒక ఫ్యూచర్ వాల్యూ ఇన్‌ఫ్లేషన్ క్యాలిక్యులేటర్, ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ల యొక్క భవిష్యత్ విలువను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఒక ఊహాత్మకమైన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉదాహరణతో ఆ భావనను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఈ క్రింది పట్టికలను చూడండి.
పెట్టుబడి తేదీ |
ఇన్వెస్ట్‌మెంట్ వ్యవధి |
అసలు అమౌంట్ |
ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేయబడిన అసలు మొత్తం (ద్రవ్యోల్బణ రేటు = 5.52%)
|
మే 6, 2021 |
2 సంవత్సరాలు |
1,00,000 |
₹ 1,11,345 |
కాబట్టి, ప్రాథమికంగా మీ మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్ విలువ ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేయబడిన అసలు మొత్తం రూ. 1,11,345 కంటే ఎక్కువగా ఉండాలి మరియు మీ అసలు మొత్తం రూ. 1,00,000 కాదు. ఒక ఫ్యూచర్ వాల్యూ ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేటర్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ యొక్క నిజమైన సంపాదన సంభావ్యత లేదా వాస్తవమైన రాబడులను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ద్రవ్యోల్బణం మీ లాభాలను తగ్గిస్తుంది మరియు నష్టాల పరిమాణాన్ని పెంచుతుంది కాబట్టి, మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను రూపొందించడానికి ఫ్యూచర్ వాల్యూ ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేటర్ చాలా ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంది. ఇది రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం కూడా ఒక అద్భుతమైన సాధనం.