వార్షిక పెంపుతో ఎస్ఐపి
పెట్టుబడి పెట్టబడిన మొత్తం
జీవితంలోని ప్రతి అంశంలో అభివృద్ధి అవసరం - మీ ఆదాయం, మీ సామర్థ్యం, ఆర్థిక స్థితి మరియు మీ పెట్టుబడులలో కూడా. మీ వృత్తిపరమైన స్థానం, మీ వ్యక్తిగత స్థాయి మరియు మీ నెలవారీ ఖర్చులు ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతాయి అనే వాటి ఆధారంగా మీరు చేసే పెట్టుబడి మొత్తం ఆధారపడుతుంది. కానీ, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మరియు లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి మీ పెట్టుబడులలో వృద్ధి అవసరం.
ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) అంటే క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక నిర్ధిష్ట మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం అని అర్థం. మీకు ఇప్పటికే ఒక ఎస్ఐపి ఉంటే, ఇప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి ఇది మంచి సమయం. మీరు సాంప్రదాయక ఎస్ఐపిని ప్రారంభించినప్పుడు, మొత్తం పెట్టుబడి వ్యవధిలో మీరు కాలానుగుణ వాయిదాలను పెంచలేరు. ఈ సమస్యను మీరు ఒక స్టెప్-అప్ ఎస్ఐపితో పరిష్కరించవచ్చు. ఇది పెట్టుబడిదారులకు, వారి ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐపిలలో ఎస్ఐపి మొత్తాన్ని పెంచుకోవడానికి అనుమతిస్తుంది.
మీరు మీ ఎస్ఐపిలో ప్రతి సంవత్సరం పెంచాల్సిన మొత్తాన్ని లెక్కించాలి. దీనిని నిర్ణయించడం మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, ముఖ్యంగా దీర్ఘకాలిక ఎస్ఐపి పెట్టుబడి విషయంలో ఇది ఎదురవుతుంది. మా కాలిక్యులేటర్ - వార్షిక పెంపుతో కూడిన ఎస్ఐపి, మీ కోసం ఈ పనిని సులభతరం చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో మేము వివరిస్తాము.
వార్షిక పెరుగుదల మొత్తంతో పెట్టుబడి పెట్టిన ఎస్ఐపి
ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఆన్‌లైన్ మాదిరిగా, వార్షిక పెంపుతో కూడిన ఎస్ఐపి కాలిక్యులేటర్ అనేది మీ ఎస్ఐపి కోసం మీరు కోరుకునే విధంగా వార్షిక పెంపును నిర్ణయించడానికి మీకు సహాయపడే, సులభంగా అందుబాటులో ఉన్న ఒక సాధనం. దీని కోసం మీరు అందించవలసిన వివరాలు దిగువ ఇవ్వబడ్డాయి:
-
నెలవారీ ఎస్ఐపి ద్వారా మీరు పెట్టుబడి పెట్టగల డబ్బు మొత్తం.
-
మీరు ఎస్ఐపి ని కొనసాగించాలని అనుకుంటున్న వ్యవధి (నెలలు).
- పెట్టుబడి నుండి వచ్చే రాబడి రేటు.
- నెలవారీ ఎస్ఐపి లో వార్షిక పెరుగుదల మొత్తం.
పైన అందించిన వివరాలను బట్టి ఇది ఫలితాన్ని ఈ విధంగా అందిస్తుంది:
-
వార్షిక పెంపు లేకుండా పెట్టుబడి పెట్టబడిన పూర్తి ఎస్ఐపి మొత్తం
- వార్షిక పెంపు లేకుండా మొత్తం వృద్ధి
- వార్షిక పెరుగుదల లేకుండా మొత్తం భవిష్యత్ విలువ
-
వార్షిక పెంపుతో పెట్టుబడి పెట్టబడిన పూర్తి ఎస్ఐపి మొత్తం
- వార్షిక పెరుగుదలతో మొత్తం వృద్ధి
- వార్షిక పెంపుతో మొత్తం భవిష్యత్ విలువ
చివరగా, మీరు అర్థం చేసుకోవడానికి సులభమైన అవధిలో ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టబడిన వార్షిక పెంపు మొత్తంతో ఎస్ఐపి యొక్క సారాంశం పొందుతారు.