Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

తెలివైన పెట్టుబడిదారుగా ఉండడానికి 10 చిట్కాలు

మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి రాకెట్ సైన్స్ కాదు; ఇది తెలివైన నిర్ణయాలను తీసుకోవడం. ఒక తెలివైన పెట్టుబడిదారుగా మీరు పెట్టుబడి పెట్టడానికి ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్, స్కీమ్‌లకు మాత్రమే పరిమితం కాదు; ఏ వ్యూహం మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది మరియు సంపద సృష్టికి అవకాశాన్ని అందిస్తుంది అనే దానిని మీరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి కోసం మీ సమగ్ర విధానం అనేది, మీరు తెలివైన పెట్టుబడిదారులా కాదా అనే దానిని నిర్ణయిస్తుంది. ఇది ఒక్కసారిగా తీసుకునే నిర్ణయం కాదు; మీరు మీ జీవితమంతా ఆచరించాల్సిన మీ పెట్టుబడి అలవాట్లు.

మీరు తెలివైన పెట్టుబడిదారులా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ 10 చిట్కాలు ఉన్నాయి-

త్వరగా ప్రారంభించండి

మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేవి చక్రవడ్డీ కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటాయి, ఇవి మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, సాపేక్షంగా మీరు ఆశించే మెరుగైన రిటర్న్స్‌ను పొందవచ్చని సూచిస్తాయి. అందువల్ల, తొందరగా పెట్టుబడిని ప్రారంభించడం మంచిది.

లాంగ్-టర్మ్ కోసం ఆలోచించండి

లాంగ్-టర్మ్ కోసం ఆలోచించడం మంచిది. ఇక్కడ సత్వరమార్గాలు లేవు. కాలక్రమేణా మీ పెట్టుబడులను విస్తరించండి మరియు క్రమపద్ధతిలో ప్లాన్ చేయండి.

మీ లక్ష్యాలను సెట్ చేయండి

మీరు దేని కోసం పెట్టుబడి పెడుతున్నారు? ఎల్లప్పుడూ మీ లక్ష్యాలను మీ పెట్టుబడులకు మరియు మీరు పెట్టుబడి పెట్టే స్కీమ్ రకానికి సమలేఖనం చేయండి.

రిస్క్ తీసుకునే సామర్థ్యంను గుర్తించండి

మీ రిస్క్ తీసుకునే సామర్ధ్యాన్ని మీ లక్ష్యాలతో ముడి వేసుకోండి. మీ లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యంతో సరిపోలితే మాత్రమే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి.

మీ అసెట్స్‌ను కేటాయించండి

చివరికి మీ లక్ష్యాలను గమ్యానికి చేరవేసే అసెట్ కేటాయింపుపై నిర్ణయం తీసుకోండి. మీ లక్ష్యాలకు మరిన్ని ఈక్విటీ స్కీమ్‌లు అవసరమా? అవును అయితే, అది మీ రిస్క్ తీసుకునే సామర్థ్యంతో సరిపోలుతుందా? ఏ అసెట్ క్లాస్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలనే దానిపై స్పష్టంగా ఉండండి. మీరు ఈక్విటీ, డెట్ మొదలైన అసెట్‌ల స్థిరమైన కలయికను కూడా ఉంచవచ్చు.

అత్యవసర నిధిని సృష్టించండి

ఊహించని పరిస్థితుల కోసం ఎల్లప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించండి మరియు లిక్విడిటీని సరిగ్గా ఉంచుకోండి. ఒక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ మీకు లిక్విడిటీ మరియు రిటర్న్స్ యొక్క మంచి బ్యాలెన్స్ మరియు ఆకస్మిక పరిస్థితుల కోసం అవసరమైన కుషన్ కూడా అందించవచ్చు. తక్కువకి కొనండి, ఎక్కువకి అమ్మండి

తొందరపాటు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. మీ ఫండ్ తాత్కాలికంగా నష్టాలకు గురి అయితే అందులో పెట్టుబడిని కొనసాగిస్తూ పరిస్థితులు ఎలా మారుతాయో చూడటం మంచిది. అటువంటి సమయంలో మీరు రీడీమ్ చేయాలని నిర్ణయించుకుంటే, మీరు నష్టపోవచ్చు.

పన్నులను ప్లాన్ చేయండి

మీ ఆర్థిక లక్ష్యాలలో పన్ను ప్రణాళికను చేర్చండి, దాని కోసం పెట్టుబడి మాధ్యమాన్ని గుర్తించండి. ప్రతి సంవత్సరం పన్ను ప్రణాళికను చివరి నిమిషంలో చేయకపోవడం మంచిది.

ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టండి

ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టడం మీ పెట్టుబడికి క్రమశిక్షణ అందిస్తుంది మరియు ఒక వ్యవధిలో మీ రిస్కులు మరియు ఖర్చులను విస్తరించడానికి కూడా మీకు సహాయపడుతుంది.

సలహా కోరండి

ఏదైనా సందేహం వచ్చినప్పుడు, మీ ఆర్థిక సలహాదారు/మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నుండి సలహా పొందండి, ఎందుకనగా ఒక తప్పుడు నిర్ణయం మీ మొత్తం ఆర్థిక ప్లాన్‌ను అడ్డుకుంటుంది. నిపుణులతో మాట్లాడండి, పరిశోధన చేయండి, తదనుగుణంగా పెట్టుబడి పెట్టండి.

పెట్టుబడి పెట్టడానికి మీ విధానంలో ఏమి మార్చాలో తెలుసుకోవడానికి పై పాయింటర్‌లు మీకు సహాయపడతాయి.

"పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, అది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే తెలియజేస్తాయి మరియు పాఠకుని కోసం ఎటువంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు లేదా ఏదైనా చర్య కొరకు ఉద్దేశించినది కాదు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది, పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి


Get the app