Sign In

ఇఎస్‌జి (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) ఫండ్స్

ఒక మంచి స్థానంలో నిలవడం అంటే ఏంటో మీకు తెలుసా? అవును ఒక పెట్టుబడిదారుడిగా ఉండటం మరియు పెట్టుబడి పెట్టేటపుడు బాధ్యత వహించడం అనేది ఒక మంచి స్థానాన్ని సూచిస్తుంది. ఇఎస్‌జి మ్యూచువల్ ఫండ్స్ మీకు ఆ అవకాశాన్ని ఇస్తాయి. ఈ ఫండ్స్ పర్యావరణ మరియు సామాజిక బాధ్యత కలిగిన కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి మరియు కార్పొరేట్ పాలనను అనుసరిస్తాయి. అదేవిధంగా, ఫండ్ మేనేజర్ ఆర్థిక అంశాలను చక్కగా విశ్లేషిస్తారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే కంపెనీలను ప్రోత్సహించడం, నైతిక వ్యాపార పద్ధతులను అనుసరించడం, కార్పొరేట్ సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టడం మరియు వారి సామాజిక బాధ్యతలను అర్థం చేసుకోవడం అనేవి ఇక్కడ ఉన్న ప్రధాన ఆలోచనలు. ఇలాంటి ఏదైనా సంస్థను ఇఎస్‌జి కంప్లయింట్ అని పిలుస్తారు.

ఇఎస్‌జి ఎందుకు?

ఇటీవల మనం అనేక సామాజిక మరియు పర్యావరణ మార్పులను చూశాము. అది కాలుష్యమే కావచ్చు, వాతావరణ మార్పు లేదా టెక్నాలజీ యొక్క దుష్ప్రభావాలు వంటివి కూడా అయి ఉండవచ్చు, అయితే, సంస్థలు నేడు మన చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థను రక్షించడంపై దృష్టి పెట్టాలి. సామాజిక అవగాహన కలిగిన కంపెనీలు కూడా ఉద్యోగులకు మరింత చేరువగా మరియు వారి మార్గాల్లో మానవత్వాన్ని చూపించాల్సిందిగా ఆజ్ఞాపించబడ్డాయి. మరియు అలాంటి బాధ్యతాయుతమైన సంస్థల ఉనికి నేడు చాలా అవసరం. ఉదాహరణకు, దుస్తులను తయారు చేసే కంపెనీ, పర్యావరణ అనుకూలమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తుందా? లేదా రసాయనాలను తయారు చేసే ఒక కంపెనీ, దాని వ్యర్థాలను మన మహాసముద్రాలు మరియు నదుల్లోకి వదలడాన్ని ఆపేస్తుందా? ఇలాంటి కొన్ని చర్యలు భవిష్యత్తులో మనలను హానికరమైన వాతావరణం వైపుకు తీసుకెళ్తాయి. ఇఎస్‌జి సంస్థలు తమ ఉత్పత్తి వల్ల ఏర్పడే నష్టం పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉంటాయి, మరియు వారు దానిని నియంత్రించడానికి సిద్ధంగా ఉంటారు. మరియు ఇందులో, పెట్టుబడిదారులు కూడా భారీ పాత్ర పోషించాలి. మీరు మరింత బాధ్యత కలిగిన కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అది ఇతర కంపెనీలను కూడా ఇఎస్‌జి ని అనుసరించేలా బలవంతం చేస్తుంది.

ఒక పెట్టుబడిదారుగా ఇఎస్‌జి ఫండ్స్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి?

- ఇఎస్‌జి లో పెట్టుబడి పెట్టడం అంటే మీరు మీ రాబడులపై రాజీ పడుతున్నారనే అర్థం కాదు. ఇది 'రిటర్న్స్-లేదా-బాధ్యత' అనే దృష్టాంతం కూడా కానే కాదు.
- నిఫ్టీ 100 ఇఎస్‌జి ఇండెక్స్ అనేది ఒక ఇఎస్‌జి బెంచ్‌మార్క్
- ఎంచుకున్న కంపెనీలు తప్పనిసరిగా మూడు ప్రమాణాలను నెరవేర్చాల్సి ఉంటుంది, అవి పర్యావరణం, సామాజిక, పరిపాలన
- కొన్ని రంగాలు ఉన్నాయి, అవి వాటి సేవలు/ఉత్పత్తుల స్వభావం ప్రకారం, ఇఎస్‌జి ఇండెక్స్‌లో చేర్చబడకపోవచ్చు లేదా ఇండెక్స్‌లో పై స్థాయిలో ఉండవచ్చు
- వేరే వాటితో పోలిస్తే ఇది కొత్తది కావడం వలన ఆధారపడటానికి చారిత్రక డేటా ఎక్కువగా లేదు
- ఒక కంపెనీ దాని ప్రాసెస్‌లు ఇఎస్‌జి ఆధారితమైనవని ప్రకటించినంత మాత్రానా అది ఇఎస్‌జి ఫండ్ కోసం అర్హత సాధిస్తుందని అర్థం కాదు, దానిని నిర్ధారించడానికి చేయాల్సిన తగిన తనిఖీలు కూడా ఉన్నాయి.

ఇఎస్‌జి ఫండ్స్‌పై పన్ను ఎలా విధించబడుతుంది?

ఇఎస్‌జి ఫండ్స్ నుండి వచ్చే క్యాపిటల్ గెయిన్స్‌ పై పన్ను ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ వలె విధించబడుతుంది.

షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టిసిజి) టాక్స్ - మీ హోల్డింగ్ వ్యవధి 12 నెలల కంటే ఎక్కువ కాకుండా ఉంటే, క్యాపిటల్ గెయిన్స్‌ను ఎస్‌టిసిజి గా పరిగణిస్తారు, ప్రస్తుతం దీనిపై 15% పన్ను విధించబడుతుంది.

లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టిసిజి) టాక్స్- ఈక్విటీ స్కీమ్స్‌లో 12 నెలల కంటే ఎక్కువగా ఉండే హోల్డింగ్ వ్యవధి కోసం, క్యాపిటల్ గెయిన్స్‌ ఎల్‌టిసిజి గా పరిగణించబడతాయి, ఒకవేళ మీ మూలధన లాభం ₹ 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే దీనిపై ప్రస్తుతం 10% పన్ను విధించబడుతుంది. మరియు ఇది గ్రాండ్‌ఫాదరింగ్ క్లాజ్‌తో వస్తుంది, ఈ క్లాజ్ ప్రథమంగా ఏదైనా పన్ను నుండి 31 జనవరి'18 కు ముందు పొందిన అన్ని లాభాలను మినహాయిస్తుంది.

ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే అందించబడింది. అయితే, సమస్యల రీత్యా వ్యక్తిగత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రతీ పెట్టుబడిదారు పన్ను యొక్క నిర్దిష్ట మొత్తం మరియు స్కీములలో పాల్గొనడం నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు, ఇతర పరిష్కారాలకు సంబంధించిన సమాచారం కోసం తన స్వంత పన్ను సలహాదారులు/అధీకృత డీలర్లను సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి


Get the app