Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

మీ మ్యూచువల్ ఫండ్‌లను తెలివిగా మేనేజ్ చేసుకోండి​

మ్యూచువల్ ఫండ్స్, దీనిని సాధారణంగా నిర్వచించినప్పుడు, పెట్టుబడిదారులు తమ డబ్బును ఒక చోట పెట్టుబడి చేసి, ఒక నిర్దిష్ట వ్యవధిలో దానిని వృద్ధి చేసుకోవాలనుకునే నిధుల సమూహం. ఇక్కడ, వారి ఆర్థిక లక్ష్యాలు వేరుగా ఉండవచ్చు మరియు సమయం, రిస్క్ తీసుకునే సామర్థ్యంలో కూడా తేడా ఉండవచ్చు. అందువల్ల, మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాలు మరియు వర్గీకరణలను కలిగి ఉంటాయి. కాబట్టి, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్స్టాక్స్, బాండ్లు మరియు మనీ మార్కెట్ ఫండ్‌లు ఉన్నాయి. అలాగే ఇక్కడ, ఈ విభిన్న రకాల మ్యూచువల్ ఫండ్‌లు వేర్వేరు రిస్క్ మరియు రివార్డ్ రేషియోని కలిగి ఉంటాయి మరియు మీ శైలికి సరిపోయేలా ఉండాలి. అయితే, వారు సాధారణంగా "సంభావ్య రాబడి పెరిగితే, రిస్క్ కూడా పెరుగుతుంది" అని చెబుతున్నారు, ఇది "రిస్క్ లేకపోతే, లాభం లేదు" అని మనందరికీ తెలిసిన ఒక సూక్తికి సమానంగా ఉంటుంది.

ఇప్పుడు, మీరు మ్యూచువల్ ఫండ్‌లను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇక్కడ ఖచ్చితమైన నియమాలు లేదా టిప్స్ వంటివి లేవు, కానీ మీరు మీ ఫండ్స్‌ను జాగ్రత్తగా ఎంచుకొని, వాటి వాస్తవికత, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని తెలుసుకోండి, అలాగే, ​​మీ డబ్బును ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే సమయం, ఫండ్ పనితీరు నుండి మీ ఆర్థిక లక్ష్యాలు మరియు వ్యూహాలను గురించి అంచనా వేయండి. అంతేకాకుండా, మీరు మార్కెట్ పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలి మరియు మీ ఫండ్స్ పనితీరు కోసం మార్కెట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి.

ఇప్పుడు వీటన్నింటినీ కొందరు స్వయంగా నిర్వహించగలుగుతున్నారు, అయితే మిగతావారు ఫండ్ లేదా మనీ మేనేజర్లు అని పిలువబడే అర్హత కలిగిన నిపుణులను సహాయం కోరడం ఉత్తమం. వారు తమ అమితమైన పరిజ్ఞానంతో మీ ఫండ్స్ డైవర్సిఫై చేయడంలో సహాయపడతారు, అదేవిధంగా మీరు మీ డబ్బును ఏ ఒక్క కేటగిరిలో లేదా ఒకే రకంలో పెట్టుబడి చేయకూడదు, ఎందుకంటే అన్ని వర్గాలు ఎల్లప్పుడూ బాగా పని చేయవు. మీరు మీ ఫండ్ మేనేజర్‌లను, వారి ఆర్థిక సలహాల కోసం ఆశ్రయించినపుడు, వారిని విశ్వసించినప్పటికీ, మరో కోణంలో మీరు మార్కెట్ మరియు ఫండ్ పనితీరుని కూడా ట్రాక్ చేయడం మంచిది.

3 విస్తృతమైన మ్యూచువల్ ఫండ్స్ రకాలు, అంటే స్టాక్స్ మరియు ఈక్విటీ ఫండ్స్, అలాగే బాండ్స్, ఇన్‌కమ్ ఫండ్స్‌మరియు మనీ మార్కెట్ ఫండ్స్ ‌లలో మీరు ఎంపిక చేసుకోవడానికి అనేక రకాలు ఉన్నాయి, అవి ఓపెన్-ఎండెడ్, క్లోజ్డ్-ఎండెడ్, సెక్టార్ మరియు టర్మ్ స్పెసిఫిక్ ఫండ్స్, వివిధ క్యాపిటల్ సైజు, టాక్స్ సేవింగ్ మరియు ఇండెక్స్ ఫండ్స్‌మొదలైనవి. అయితే, ఈ కేటగిరీలు మరియు స్కీమ్స్ ఒక ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ నుండి మరొకదానికి మారుతూ ఉంటాయి.

కాబట్టి, ఉత్తమ మ్యూచువల్ ఫండ్ చిట్కా ఏమిటంటే, మీ పెట్టుబడుల కోసం తెలివైన మరియు బాగా లెక్కించబడిన ఎంపికను గుర్తించడం మరియు వాటిని తెలివిగా నిర్వహించడం.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app