ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ కంపెనీల షేర్లు లేదా ఈక్విటీలలో కార్పస్‌ను పెట్టుబడి పెడతాయి. ఇతర ఫండ్ రకాలతో పోలిస్తే రిటర్న్స్ జనరేట్ చేసే వారి సామర్థ్యం వాటిని ఒక ప్రముఖ పెట్టుబడి సాధనంగా చేస్తుంది. మీరు ఇటీవల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుగా మీ ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే, అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆధారంగా ఉంటే మీ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేయవలసిందిగా మీరు ఇప్పటికే ఒక సలహాని అందుకొని ఉండవచ్చు.
కానీ వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోకి విరుద్ధంగా ఉండేది ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
పెట్టుబడి పరిభాషలో దీనిని ఒక కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో అని పిలుస్తారు. మీ పెట్టుబడి వ్యూహాన్ని నిర్మించడానికి మరిన్ని ఎస్ఐపి ప్లాన్లను ప్రారంభించడానికి ముందు, పెట్టుబడులలో ఈ రకం గురించి మరింత అర్థం చేసుకోవడానికి మేము మీకు సహాయపడతాము.
కాన్సెంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో అంటే ఏమిటి, మరియు అది ఎలా పనిచేస్తుంది?
ఒక కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోలో పరిమిత డైవర్సిఫికేషన్‌తో కొన్ని సెక్యూరిటీలు మాత్రమే ఉంటాయి. అటువంటి పోర్ట్‌ఫోలియోలో 20-30 సెక్యూరిటీలు లేదా అంతకంటే తక్కువ సెక్యూరిటీలు ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పరంగా, ఇది తక్కువ స్టాక్స్ కలిగి ఉండి వాటిలో ఉన్న స్టాక్స్ కి అధిక ఎక్స్‌పోజర్ కలిగి ఉన్న స్కీంలను సూచిస్తుంది.
మరో మాటలో చెప్పాలంటే, ఒక స్కీమ్ యొక్క పోర్ట్‌ఫోలియో ఎంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబడితే, బెంచ్‌మార్క్‌తో పోలిస్తే దాని పై వచ్చే రిటర్న్స్ పై రిస్క్ అంత ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ లాభాలు ఉండవచ్చు లేదా ఎక్కువ నష్టాలు ఉండవచ్చు.
కాన్సెంట్రేటెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ సంఖ్యలో స్టాక్స్ కలిగి ఉంటాయి మరియు అధిక రిటర్న్స్ జనరేట్ చేసే ఉద్దేశ్యంతో వాటిలో అధిక ఎక్స్‌పోజర్ కలిగి ఉంటాయి. ఫండ్ మేనేజర్లు భవిష్యత్తులో మంచి లాభాలను అందించే నిర్దిష్ట స్టాక్‌లను గుర్తించినట్లయితే, గణనీయమైన రిటర్న్స్ సంపాదించడానికి వారు ఈ స్టాక్‌లలో అధిక ఎక్స్‌పోజర్‌ను తీసుకుంటారు. వారిలో చాలామంది ఒక కాన్సెంట్రేటెడ్ వ్యూహం పరిమిత శ్రేణిలో కదిలే మార్కెట్లలో బాగా పనిచేస్తుందని కూడా నమ్ముతారు, ఇందులో చాలా స్టాక్స్ పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతాయి మరియు అందులో కొన్ని మాత్రమే లాభాలను అందిస్తాయి.
అంతర్లీన కాన్సెంట్రేషన్ కారణంగా, ఈ ఫండ్స్ అత్యంత అస్థిరంగా ఉండవచ్చు మరియు ఒక నిర్దిష్ట వ్యవధిలో వాటి ప్రదర్శన నిరాశజనకంగా ఉండవచ్చు.
కాన్సెంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోల ప్రయోజనాలు
కాన్సెంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోలతో
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే ఇది సంభావ్య లాభాల అవకాశాన్ని పెంచుతుంది, అయితే ఇందులో అంతే సమానమైన రిస్క్ ఉంటుంది.
కాన్సెంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోలతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఎవరు పెట్టుబడి పెట్టాలి?
ఒక పెట్టుబడిదారుగా, మీరు ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పరిధిని దృష్టిలో ఉంచుకుని అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటే. అలాంటి సందర్భంలో, మీరు కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉన్న స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. మీరు దృష్టిలో ఉంచుకోవలసిన ఏకైక విషయం ఏమిటంటే అటువంటి పథకాల్లో మీ మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియో యొక్క నిష్పత్తిని పరిమితంగా ఉంచడం.
సాధారణంగా, కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోలతో ఉన్న ఈక్విటీ పథకాలు మీ పోర్ట్‌ఫోలియోలో 10-20% భాగాన్ని మాత్రమే కవర్ చేయాలి. అలాగే, మీరు ఈ పథకాల్లో ఎస్ఐపి ప్లాన్ల ద్వారా పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
కాన్సెంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోతో స్కీమ్‌లలో ఎవరు పెట్టుబడి పెట్టకూడదు?
ఏదైనా నిర్దిష్ట
రకం ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టకూడదు అనే నిర్ణయం ప్రాథమికంగా సంబంధిత రిస్క్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంటుంది. కాన్సెంట్రేటెడ్ పథకాలతో ప్రమాదం ఉంది కాబట్టి, కొత్త పెట్టుబడిదారులు వాటిని నివారించవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. అనుభవం లేని వారి కోసం ఒక మెరుగైన పెట్టుబడి విధానం ఏమిటంటే వైవిధ్యమైన ఫండ్స్‌తో ప్రారంభించడం అది లార్జ్-క్యాప్ లేదా మల్టీ-క్యాప్ అవ్వచ్చు.
అదేవిధంగా, స్వల్పకాలిక పెట్టుబడి పరిధి కలిగిన పెట్టుబడిదారులు లేదా తక్కువ రిస్క్ సామర్థ్యం ఉన్నవారు కాన్సెంట్రేటెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో వారి పెట్టుబడులను నివారించవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది.
ముగింపు
కాన్సెంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోలతో సృష్టించబడిన సంపద పట్ల అనేక మంది పెట్టుబడిదారులు ఆకర్షితులు అవుతారని అనుకోవచ్చు. అటువంటి ఉదాహరణలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ని ఒక కార్పస్ రూపొందించడానికి సహేతుకమైన మార్గంగా పరిగణించడానికి మనలో చాలా మందిని ఆలోచింపజేస్తుంది. అందువల్ల, నిర్దిష్ట స్కీంల ఫీచర్లను అర్థం చేసుకోవడం మరియు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి ముందు వృత్తిపరమైన సలహాని స్వీకరించడం చాలా ముఖ్యం.
డిస్‌క్లెయిమర్:
ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.