Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

మ్యూచువల్ ఫండ్‌తో స్మార్ట్ రిటైర్‌మెంట్ ప్లానింగ్

సాధారణంగా, మనలో చాలామందికి ఈపీఎఫ్ లేదా ఒక ప్రత్యేక పీపీఎఫ్ ఖాతా ఉండటమే ఎక్కువ మరియు రిటైర్‌మెంట్ కోసం మన యాక్షన్ ప్లాన్ తక్కువగా ఉంటుంది. మన తల్లిదండ్రుల కాలం నుండి మన దైనందిన జీవితాలు అభివృద్ధి చెందిన నేటి ప్రపంచంలో, ఈ రకమైన పొదుపులు అవుట్‌డేట్ అయ్యాయి. రాబోయే రిటైరింగ్ జెనరేషన్ కోసం ఈపీఎఫ్ పై మాత్రమే రిటైర్‌మెంట్ పొందడం అనేది సాధారణంగా పెన్షన్ లేకుండా చూస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తన రిటైర్‌మెంట్ కోసం తగినంత సంపదను కూడబెట్టుకోకపోతే, ఆదాయంపై వచ్చే వడ్డీతో మాత్రమే రిటైర్‌మెంట్ పొందితే, తరువాత వారు తమను తాము నిలబెట్టుకోలేని అవకాశాలు ఉన్నాయి.

సర్వేల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 75% కంటే ఎక్కువ కుటుంబాలు రిటైర్‌మెంట్ అనంతర ఆదాయం కోసం ‌ మ్యూచువల్ ఫండ్స్ ‌లో పెట్టుబడి చేస్తున్నాయికాబట్టి, అటువంటి పెట్టుబడి గురించి భారతీయులు ఎందుకు సంశయిస్తున్నారు? మీ రిటైర్‌మెంట్‌ను తెలివిగా ప్లాన్ చేయడానికి మ్యూచువల్ ఫండ్‌లు మీకు ఎలా సహాయపడతాయో చూద్దాం.

  • రిటైర్‌మెంట్ కోసం పెట్టుబడి పెట్టడానికి ముందు, మీ పెట్టుబడి యొక్క ప్రారంభ సంవత్సరాల్లో ఈక్విటీల కోసం తగిన మొత్తాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి మరియు నెమ్మదిగా వాటిని డెట్ ఫండ్‌లు లేదా ఇతర సంప్రదాయ పొదుపు ఆప్షన్స్‌కు తరలించండి. మీరు దాదాపు 15-20 సంవత్సరాలుగా పెట్టుబడి పెడుతున్నట్లయితే, మీ రిటైర్‌మెంట్‌కు 5 సంవత్సరాల ముందు ఈ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ మొదలవుతుంది. అలాగే, 15 సంవత్సరాలు లేదా అంతకు మించిన పెట్టుబడి కోసం, స్టాక్ మార్కెట్ నుండి నెగటివ్ రిటర్న్స్ పొందే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కావున, మీ డబ్బు స్థిరంగా ఉంటుంది మరియు సాధారణంగా ఈక్విటీ కూడా మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ ఇస్తుంది.

  • ప్రతి సంవత్సరం మీ ఫండ్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించండి. దీని అర్థం మీరు మీ పోర్ట్‌ఫోలియోలో డెట్, ఈక్విటీ మరియు బంగారం నిష్పత్తిని క్రమం తప్పకుండా మూవ్ చేయాలి. ఒక విభిన్న కార్పస్ మొత్తం అనేది ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇతర డెట్ ఆప్షన్‌లు మరియు మ్యూచువల్ ఫండ్ వంటి వివిధ రకాల అసెట్ కేటగిరీలకు అత్యంత ఎక్స్‌పోజర్‌ని అందిస్తుంది.
  • ఒకవేళ రిటైర్‌మెంట్ తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్‌ని కలిగి ఉంటే, నెలవారీ ఆదాయం కోసం పూర్తిగా డివిడెండ్‌లపై ఆధారపడకండి. మీ స్వంత వార్షిక ప్లాన్‌ను రూపొందించడానికి సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపి) ని చేర్చండి. డెట్ ఫండ్స్ ఒక సంవత్సరానికి పైగా ఉంచినట్లయితే ఇవి గొప్ప సమర్థవంతమైన పన్ను ఎంపికలగా ఉంటాయి.
  • మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో మీ రిటైర్‌మెంట్ ప్లాన్ కోసం ప్రత్యేకించినది. ఇది మీకు నచ్చిన సెక్టార్ లేదా నిర్దిష్ట థీమ్ లేకుండా మనుగడ సాగించగలదు. ఒకవేళ మీరు పెట్టుబడిదారుడిగా అలాంటి ఎక్స్‌పోజర్‌ని కోరుకుంటే, మీరు దానిని 10% కు పరిమితం చేయాలి మరియు మీ రిటైర్‌మెంట్‌కు కొన్ని సంవత్సరాల ముందు అలాంటి థీమ్ నుండి ఎగ్జిట్ అయ్యేలా చూసుకోవాలి.

పై పాయింటర్లను అనుసరించడం వలన మీకు ఖర్చు లేకుండా మీ రిటైర్‌మెంట్ ఫండ్‌ బాస్కెట్‌ను ప్లాన్ చేయడంలో ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, లీజు ఆర్థిక సలహాదారు నుండి మీ పెట్టుబడి సలహాను పొందండి.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app