భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం పొదుపు మరియు పెట్టుబడి అనేది ప్రతి వ్యక్తికీ అధిక ప్రాధాన్యతతో కూడినది. అనేక మందికి తీరిక లేని జీవన శైలి మరియు తగిన సమాచారం లేకపోవడం అనే అంశాలు సరైన పెట్టుబడి ప్రోడక్టును ఎంచుకోవడంలో అడ్డంకులుగా నిలుస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్ అటువంటి వ్యక్తుల కోసం సహేతుకమైన విలువ వద్ద నైపుణ్యం కలిగిన పెట్టుబడి నిర్వహణను అందిస్తాయి. అయితే,
తదుపరి అంశాలను విశ్లేషించిన తరువాత మాత్రమే, మనము ఎంచుకోవాలి ఒక
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి. మీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ అందించబడ్డాయి:
- ఫండ్ హౌస్ పెడిగ్రీ: మీకు నచ్చిన స్కీమును ఎంచుకోవడానికి ముందు, మీకు నమ్మకం ఉన్న ఫండ్ హౌస్‌ను ఎంచుకొని అందులో మీరు పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక ప్రపంచంలో బలమైన ఉనికిని కలిగి సుదీర్ఘమైన మరియు స్థిరమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న ఫండ్‌లను అందించే ఫండ్ హౌస్‌లను శోధించి గుర్తించండి.
- పెట్టుబడి యొక్క లక్ష్యం: మన సేవింగ్స్ మన లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని నిర్ధారించుకోవడానికి మనం పెట్టుబడులు పెడతాము. పెట్టుబడి అనేది లక్ష్యం యొక్క అవధికి తగినట్లుగా ఉండాలి, ఆ విధంగా నిర్ణయించాలి
మ్యూచువల్ ఫండ్ రకం. మీకు అవధి తక్కువగా ఉంటే, డెట్ ఫండ్స్ ఎంచుకోవడం ఒక మంచి ఎంపిక. మధ్య కాలిక వ్యవధి కలిగిన పెట్టుబడిదారుల కోసం, డెట్ మరియు ఈక్విటీ రెండింటిలోనూ పెట్టుబడి చేసే బ్యాలెన్స్ ఫండ్‌లు మంచి ఎంపిక. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈక్విటీలో అదనపు పెట్టుబడులను చేయవచ్చు
- డైవర్సిఫికేషన్: స్వభావరీత్యా, మ్యూచువల్ ఫండ్స్ పూర్తిగా విభిన్నమైన కేటగిరీలు స్టాక్స్, రంగాలు మరియు రియల్ ఎస్టేట్‌లో కూడా డైవర్సిఫికేషన్‌ను అందిస్తాయి అని భావించబడుతుంది. ఒక నిర్దిష్ట స్టాక్, అసెట్ కేటగిరీ లేదా ఒక సెక్టార్ వైపు మొగ్గు చూపిన పోర్ట్‌ఫోలియో కంటే, వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో తక్కువ రిస్కును కలిగి ఉంటుంది.
- స్థిరత్వం: మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది 3-5 సంవత్సరాల పాటు దాని బెంచ్‌మార్క్‌ను స్థిరంగా అధిగమించేది. స్వల్పకాలిక రిటర్న్స్ కాకుండా, 3, 5 మరియు 10 సంవత్సరాల వంటి దీర్ఘ కాల వ్యవధిలో పనితీరులో స్థిరత్వం పరిగణించండి.
- రిస్క్-రిటర్న్ ట్రేడ్-ఆఫ్: అనేక సెక్యూరిటీలలో రిస్క్ కొంతైనా ఉంటుంది మరియు తీసుకున్న రిస్కుకు తగిన ప్రతిఫలం లేకపోతే, అటువంటి పెట్టుబడులు చేయడం అనవసరం. ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఒకే రకమైన రిస్క్ కలిగిన ఇతర పెట్టుబడి సాధనాల కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంది. ఈ అంశాలను బ్యాలెన్స్ చేసి తగిన రిస్కులను తీసుకోవడంతో మీరు మీ రిటర్న్స్ పెంచుకోవచ్చు. ఇలా చేయడానికి, మీరు వాటి రిస్క్ టోలరెన్స్‌ను విశ్లేషించడం ముఖ్యం.
రిస్క్-అడ్జస్ట్ చేయబడిన రిటర్న్ యొక్క సూచనలలో ఒకటి
షార్ప్ రేషియో, గణాంక సంబంధితమైన స్టాండర్డ్ డీవియేషన్ తో భాగించబడిన ఒక రిస్క్ రహిత సాధనం యొక్క రిటర్న్ ఫై ఒక ఫండ్ ద్వారా పొందిన అదనపు రిటర్న్‌ను సూచిస్తుంది, ఇది ఒక నిర్ణీత కాలంలో ఫండ్ యొక్క రిటర్న్స్ అస్థిరతను తెలియజేస్తుంది. షార్ప్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే రిస్క్ అడ్జస్టడ్ రిటర్న్ అంత మెరుగ్గా ఉంటుంది. - మ్యూచువల్ ఫండ్ ఫీజులు, ఛార్జీలు మరియు నికర రాబడి: అందించిన సేవలకు గానూ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడులపై ఫీజు వసూలు చేస్తాయి. ఫీజులు ఎగ్జిట్ లోడ్ మరియు ఎక్స్‌పెన్స్ రేషియోగా వర్గీకరించబడ్డాయి. పెట్టుబడుల యొక్క నికర రాబడి పై ఈ ఫీజులు ప్రభావం చూపుతాయి. మ్యూచువల్ ఫండ్‌లు నిర్ణీత కాలపరిమితికి ముందు రిడీమ్ చేయబడిన పెట్టుబడులపై ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు పెట్టుబడిదారులు, ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేయబడే కాల వ్యవధిని అర్థం చేసుకోవాలి. పెట్టుబడి లక్ష్యం యొక్క కాలపరిమితి కంటే ఈ కాల వ్యవధి తక్కువగా ఉండాలి.
డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.