Sign In

మ్యూచువల్ ఫండ్స్‌ను తెలివిగా ఎంపిక చేయడానికి 5 చిట్కాలు

ఒక నిర్ధిష్ట సమయంలో మనమందరం మన డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి, మంచి రాబడిని పొందడానికి మెరుగైన మార్గాల కోసం చూస్తాము. ఆర్థిక లక్ష్యాలకు సంబంధించి మన బుర్రలో ఒక ప్లాన్ ఉంటుంది మరియు మన డబ్బుని పెట్టుబడిగా పెట్టడానికి మరియు అవి పెరిగేలా చూడడానికి ఒక నిర్దిష్ట వ్యవధి కూడా ఉంటుంది. మీ డబ్బును పెట్టుబడి చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఎంపిక, కానీ ఫండ్ పనితీరును పరిగణనలోకి తీసుకున్నపుడు, అది ఎలా పని చేస్తుందనే దాని గురించి ఆలోచించకుండా, ఉత్తమంగా పనిచేసే ఫండ్‌లలో డబ్బును పెట్టుబడి చేయడం మంచిదని మీరు భావిస్తే అది అనిశ్చితి పరిస్థితులకు దారి తీయవచ్చు. అందువల్ల, పెట్టుబడి వ్యూహాన్ని కలిగి ఉండటం ముఖ్యం. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడానికి మీకు సహాయపడే కొన్ని అంశాలు క్రింద అందించబడ్డాయి:

  • డైవర్సిఫికేషన్
    మారుతున్న ట్రెండ్లు కలిగి ఉన్న మార్కెట్‌లో, మీ పెట్టుబడులు అన్నింటినీ ఒకే దానిలో ఉంచడం సరైన విధానం కాదు. అందుకే, పెట్టుబడి చేసే ముందు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల నుండి ఎంచుకోవాలి, ఓపెన్ ఎండెడ్ లేదా క్లోజ్డ్ ఎండెడ్ నుండి ఎంచుకోవాలా, మీ పెట్టుబడుల యొక్క రంగాన్ని ఎంచుకోండి, మీరు ఒక ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి చేయాలని అనుకుంటున్నారా మొదలైనవి ఎంచుకోండి.
  • కొనుగోలు మరియు అమ్మకం కోసం ఉత్తమ సమయం ఏమిటో తెలుసుకోండి
    తరచుగా మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజలు భయాందోళనకు గురవుతారు మరియు వారి పెట్టుబడుల నుండి వైదొలగడానికి ప్రయత్నిస్తారు. బదులుగా రూపీ కాస్ట్ యావరేజింగ్ పొందడానికి, మార్కెట్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు పెట్టుబడి ఎక్కువ చేయాలి; అందువల్ల దానిని తప్పనిసరిగా విశ్లేషించి, వృద్ధికి అవకాశం ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలి.
  • పనితీరు మరియు మార్కెట్‌ను అంచనా వేయండి
    మీ నిధులు పెరగడానికి, మీరు మ్యూచువల్ ఫండ్‌ల పనితీరును నిశితంగా పరిశీలించాలి; అనేక ఫండ్‌ల పనితీరును తెలుసుకోవడానికి ఎన్ఎవి మరొక మార్గం.
  • మీ ఆర్థిక లక్ష్యాలు మరియు పరిమితులను తెలుసుకోండి
    మీరు మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీ పరిమితులు, మీరు ఎలాంటి ఫండ్ ఎంచుకోవాలని అనుకుంటున్నారు, ఎంత నిధులను సమీకరించాలనుకుంటున్నారు మరియు మీ పెట్టుబడుల నుండి మీ ఆర్థిక అంచనాలు ఏమిటి అనే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.
  • స్థిరత్వం మరియు క్రమం తప్పని నిర్వహణ
    మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు క్రమం తప్పకుండా మరియు స్థిరంగా ఉండాలి. అలాగే, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఎన్ఎవి ట్రాకింగ్ మరియు డౌన్‌లోడ్ చేయడం నుండి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టడం, ఎస్‌ఎంఎస్ అలర్ట్స్ పొందడం, అప్లికేషన్ ఫారంను డౌన్‌లోడ్ చేయడం, ఫ్యాక్ట్ షీట్స్, ట్రేడ్ డేటాను అందించడం వంటి అనేక రకాల సేవలను అందించవచ్చు.

కాబట్టి, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని భావించినప్పుడు, పైన పేర్కొన్న చిట్కాలను గుర్తుంచుకోండి, ప్రత్యేకించి మీరు మొదటిసారి పెట్టుబడి చేస్తున్నట్లయితే లేదా పెట్టుబడిలో మీకు అనుభవం లేకపోతే లేదా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి సానుకూలంగా లేకపోయినట్లయితే.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app