ఏదైనా విలువైనది అయినప్పుడు ఖర్చు గురించి అంతగా పట్టించుకోము. విదేశీ పర్యటనలు ఆహ్లాదకరమైనవి మరియు ఆనందభరితమైనవి. కావున, మీరు మీ స్వంతంగా కొంచెం అదనంగా ఖర్చు చేస్తే అది సమస్యగా అనిపించకపోవచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్ మీ రిస్క్ సామర్థ్యానికి సరిపోయేలా మరియు ఆశాజనకంగా కనిపిస్తే, మీరు దాని ఖర్చులను విస్మరించవచ్చు.
అంతేకాకుండా, మీరు ఎక్కడైనా ఒక నిర్ణయం తీసుకోవాలి మరియు అలా చేయడంలో ఖర్చు నిష్పత్తి మీకు సహకరిస్తుంది. ఖర్చు నిష్పత్తి ప్రతిరోజూ మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను ప్రభావితం చేస్తుంది కనుక దీనిపై శ్రద్ధ వహించాలి. ఈ ఆర్టికల్ మీకు ఖర్చుల నిష్పత్తి మరియు మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోకు దాని వలన కలిగే ప్రయోజనం గురించి పూర్తి వివరణను అందిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం ఖర్చు నిష్పత్తి ఎంత?
మ్యూచువల్ ఫండ్‌లు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నిర్వహణ కోసం నిర్దిష్ట నిర్వహణ ఖర్చులను వసూలు చేయడానికి అనుమతించబడతాయి - అవి అమ్మకాలు మరియు ప్రకటనల ఖర్చులు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, పెట్టుబడి నిర్వహణ ఫీజులు మొదలైనవి. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను అమలు చేయడం మరియు నిర్వహించడం కోసం చేసే అలాంటి ఖర్చులన్నీ సమిష్టిగా 'మొత్తం ఖర్చు నిష్పత్తి'గా (టిఇఆర్) సూచించబడతాయి. ఈ ఖర్చులన్నింటినీ తీసివేసిన తర్వాతే మ్యూచువల్ ఫండ్ రోజువారీ ఎన్ఎవి బహిర్గతం చేయబడుతుంది.
మొత్తం ఖర్చు నిష్పత్తి ఏవిధంగా లెక్కించబడుతుంది?
మ్యూచువల్ ఫండ్స్ యొక్క మొత్తం ఖర్చు నిష్పత్తి ఈ కింది విధంగా వ్యక్తీకరించబడింది:
ఖర్చు నిష్పత్తి = మొత్తం ఖర్చులు / సగటు నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఎవి)
నిర్వహణ ఖర్చులు క్రమం తప్పకుండా ఉంటాయి. కావున, యాక్టివ్‌గా నిర్వహించబడే ఫండ్‌లు నిష్క్రియాత్మకంగా నిర్వహించబడే ఫండ్‌ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు నిష్పత్తిని కలిగి ఉంటాయి. ఎందుకనగా, వాటికి రెగ్యులర్ ట్రాకింగ్ అవసరం. అయితే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జారీ చేసిన నిబంధనల ప్రకారం, ఇది నిర్దిష్ట పరిధిని మించకూడదు. మొత్తం ఖర్చు నిష్పత్తి అనేది ఎయుఎం మరియు మ్యూచువల్ ఫండ్ రకం బాధ్యత. ఇది ఏవిధంగా లెక్కించబడుతుందో ఇక్కడ ఇవ్వబడింది:
రకం | గరిష్ట మొత్తం ఖర్చు నిష్పత్తి (టిఇఆర్) |
క్లోజ్-ఎండెడ్ మరియు ఇంటర్వెల్ ఈక్విటీ-ఆధారిత ఫండ్స్ | 1.25% |
క్లోజ్ ఎండెడ్ మరియు ఇంటర్వెల్ డెట్ ఓరియంటెడ్ స్కీమ్స్ | 1.00% |
ఇటిఎఫ్ఎస్, ఇండెక్స్ | 1.00% |
ఎఫ్‌ఒఎఫ్‌లు ప్రధానంగా ఇండెక్స్ మరియు ఇటిఎఫ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడతాయి* | 1.00% |
ఎఫ్‌ఒఎఫ్‌లు ప్రధానంగా యాక్టివ్ ఈక్విటీ ఆధారిత స్కీమ్‌లలో పెట్టుబడి పెడతాయి* | 2.25% |
ఎఫ్‌ఒఎఫ్‌లు ప్రధానంగా యాక్టివ్ డెట్ ఓరియెంటెడ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెడతాయి* | 2.00% |
* అంతర్లీన స్కీమ్ ద్వారా విధించబడిన మొత్తం ఖర్చు నిష్పత్తి వెయిటెడ్ సగటుతో సహా
ఖర్చు నిష్పత్తి: మీరు ఎందుకు శ్రద్ధ వహించాలి?
ఖర్చు నిష్పత్తి మీ పెట్టుబడి విలువ నుండి మినహాయించబడినందున, అధిక ఖర్చు నిష్పత్తి తక్కువ రిటర్న్స్‌కు దారితీయవచ్చు. కాబట్టి, మీరు పెట్టుబడి పెట్టే ముందు ఇతర అంశాలతో పాటు మ్యూచువల్ ఫండ్ ఖర్చు నిష్పత్తిని కూడా చెక్ చేయాలి.
అయితే, ఎక్కువ నిష్పత్తి ఉన్న వాటి కంటే తక్కువ ఖర్చు నిష్పత్తి ఉన్న ఫండ్‌లు మెరుగ్గా ఉన్నాయని దీని అర్థం కాదు. మీరు ఫండ్ యొక్క ఖర్చు నిష్పత్తిని అంచనా వేయవచ్చు మరియు అది మీ లక్ష్యాలు, పెట్టుబడి పరిధిని మరియు రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఉంటే మాత్రమే అందులో పెట్టుబడి పెట్టవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి చెక్‌లిస్ట్
మొత్తం ఖర్చు నిష్పత్తి (టిఇఆర్) తెలుసుకోవడం చాలా ముఖ్యం, కానీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు కొన్ని ఇతర విషయాలను గుర్తుంచుకోవాలి. వాటిలో కొన్ని మీకు దిగువ జాబితా చేసాము:
● అధిక ఎయుఎం అంటే మెరుగైన పనితీరు అని అర్థం కాదు
అధిక ఎయుఎం గల మ్యూచువల్ ఫండ్ మరింత ప్రజాదరణ పొందినప్పటికీ మరియు తక్కువ మొత్తం ఖర్చు నిష్పత్తి (టిఇఆర్) కలిగి ఉన్నప్పటికీ, ఇది రిటర్న్స్‌కు హామీ ఇవ్వదు. మ్యూచువల్ ఫండ్ పనితీరు అంతర్లీన సెక్యూరిటీల పనితీరుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
● ఫండ్ మేనేజర్ క్రెడెన్షియల్స్ ముఖ్యం
మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం ఖర్చు నిష్పత్తి (టిఇఆర్) మరియు మీ రిస్క్ సామర్థ్యం చాలా ముఖ్యం. కానీ, ఫండ్ మేనేజర్స్ క్రెడెన్షియల్స్ లాంటి కొన్ని అంశాలు కూడా ప్రధానమే. ఎందుకనగా, వారు ఫండ్స్ కలిగి ఉన్న అసెట్‌ల పనితీరును నిర్వహించడానికి మరియు ట్రాక్ చేయడానికి పూర్తి బాధ్యత వహిస్తారు.
● పోర్ట్‌ఫోలియో మిక్స్ మీకు అనుకూలంగా ఉందా?
మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మరియు డెట్ సాధనాలలో పెట్టుబడి పెడతాయి. ప్రతి ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియో మిక్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. కాబట్టి, ప్రస్తుతం ఉన్న మిక్స్, మీ ప్రొఫైల్ మరియు విశ్లేషణకు సరిపోతుందో లేదో నిర్ధారించడానికి మీరు పోర్ట్‌ఫోలియోను జాగ్రత్తగా విశ్లేషించాలి.
ఒకవేళ మీరు పూర్తి అధ్యయనం చేసి ఉంటే, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అంత ఛాలెంజింగ్‌గా ఉండవు. ఒక విధానాన్ని అనుసరించండి మరియు మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఖర్చు నిష్పత్తిని గురించి తెలుసుకోవడం కూడా మీ అధ్యయనంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది మీకు అంచనా ఖర్చుల గురించి ఒక ఆలోచనను ఇస్తుంది. మీరు ఫండ్ యొక్క ఖర్చు నిష్పత్తితో సౌకర్యవంతంగా ఉంటే మరియు ఫండ్ మీ లక్ష్యాలను, రిస్క్ సామర్థ్యాన్ని కూడా చేరుకుంటే, మీరు దానిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి లక్ష్యాల వైపు ప్రయాణం కొనసాగించవచ్చు.
సాధారణ డిస్‌క్లెయిమర్
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి కావున, వీటిని ప్రత్యేక మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకుల కోసం ఉద్దేశించిన నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బాహ్య మూలాల నుండి సేకరించిన సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్లు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా, ఈ మెటీరియల్‌లోని సమాచారం వల్ల పొందిన ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు, లాభాలకు ఎలాంటి బాధ్యత వహించవు. ఈ సమాచారం ఆధారంగా తీసుకున్న ఏదైనా నిర్ణయానికి స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.