మీరు నమ్మవలసిన అవసరం లేని 5 ఎస్ఐపి అపోహలు
ఒకవేళ, ఫిబ్రవరి 28, 2022 నాటికి భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న అసెట్స్ (ఎయుఎం) 37,56,296 కోట్లు (మూలం: ఎఎంఎఫ్‌ఐ ఇండియా https://bit.ly/3I96wy8) అయితే, మ్యూచువల్ ఫండ్‌లు భారతీయ పెట్టుబడిదారుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి అని చెప్పడంలో ఏ సందేహం లేదు. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం గురించి ఆలోచించినప్పుడు, ఇక్కడ అనేక అపోహలు ఉన్నాయి, ఇవి మొదటిసారి పెట్టుబడి చేసేవారికి సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా గందరగోళానికి గురిచేస్తాయి.
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌కు సంబంధించి మీకు అనేక అపోహలు ఉండవచ్చు. ఈ బ్లాగ్‌లో మేము ఎస్‌ఐపి గురించిన మీ సాధారణ అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తాము.
1. ఎస్ఐపి అనేది ఒక రకమైన పెట్టుబడి ప్రోడక్ట్
చాలా మంది పెట్టుబడిదారులు ఎస్‌ఐపి గురించి ఒక పెట్టుబడి ప్రోడక్ట్‌గా ఆలోచిస్తారు. ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇది ఒక ప్రోడక్ట్ కాదు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం.
ఒకే-సారి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టకుండా, మీరు ఎస్ఐపి ద్వారా కాలానుగుణంగా పెట్టుబడి పెట్టడం కొనసాగించవచ్చు. మీరు ఎంచుకున్న ఫండ్‌లలో కాలానుగుణంగా పెట్టుబడి పెట్టాలనుకునే అమౌంట్, మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా మినహాయించబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు ఎస్ఐపి గురించిన ఈ సందేహాన్ని తప్పనిసరిగా క్లియర్ చేసుకోవాలి.
2. ఎస్ఐపి అనేది చిన్న పెట్టుబడులకు మాత్రమే ఉద్దేశించబడింది
ఎస్ఐపి అనేది ప్రజలకు కేవలం ₹500 తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి అనుమతిస్తుంది, తద్వారా ఎవరైనా వారి పెట్టుబడి ప్రయాణాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. అయితే, చాలా మంది ప్రజలు ఎస్‌ఐపిని చిన్న-మొత్తంతో పెట్టుబడులు పెట్టే వారి కోసం మాత్రమే ప్రత్యేకించినవని భావిస్తున్నారు, కాని ఇది వాస్తవం కాదు.
ఒక పెట్టుబడిదారుగా మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఏదైనా మొత్తం కోసం మీరు ఎస్‌ఐపిని రిజిస్టర్ చేసుకోవచ్చు. సంపన్నులకు కూడా ఎస్‌ఐపి గురించి తెలుసు, చాలా వరకు వారు ఏకమొత్తంలో పెట్టుబడులకు బదులుగా ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడాన్ని ఇష్టపడతారు.
3. మీరు ఎస్ఐపి ద్వారా ఈక్విటీ ఫండ్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు
ఎస్ఐపి గురించిన ఒక సాధారణ అపార్థం ఏమిటంటే, దీనిని కేవలం ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకోవడం. ఎస్ఐపి అనేది మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా మీ పెట్టుబడులను సరైన రకమైన మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్చడానికి మిమ్మల్ని అనుమతించే ఒక పద్ధతి. కావున, మీకు స్వల్పకాలిక లక్ష్యం ఏదైనా ఉంటే మీరు ఎస్ఐపి ద్వారా డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా దీర్ఘకాల రాబడి కోసం ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు.
4. మీకు కావలసినప్పుడు మీరు ఎస్‌ఐపిని విత్‍డ్రా చేయలేరు
సరళంగా చెప్పాలంటే ఎస్‌ఐపిని విత్‌డ్రా చేయడం అంటే ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడం, అలాగే ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని విరమించుకోవడం. అలాగే, ప్రస్తుత ఎన్‌ఎవి వద్ద అన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడం అని అర్థం. పెట్టుబడిదారులు ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఇలాంటివి తరచుగా చేస్తారు.
ఎస్ఐపి గురించిన ఒక వాస్తవం ఏమిటంటే, మీరు ఎంచుకున్న ఫండ్ లాక్-ఇన్ వ్యవధి (అది ఏదైనా ఉంటే) ముగిసిన తర్వాత ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టబడిన మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇఎల్ఎస్ఎస్ స్కీమ్ కోసం 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది మరియు దానికి ముందు మీరు విత్‍డ్రా చేయలేరు. ఒక ఎస్‌ఐపిని విత్‍డ్రా చేయడానికి మీరు ఎగ్జిట్ లోడ్‌ను కూడా చెల్లించాల్సి రావచ్చు, అది వర్తిస్తే మీరు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడానికి మరియు మీ ట్రాన్సాక్షన్‌ను నిర్ధారించడానికి ఒక అభ్యర్థనను పంపించాలి. మీ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్‌ను సెటిల్ చేయడానికి పట్టే సమయం అనేది ఒక ఫండ్ నుండి మరొక ఫండ్‌కు మారవచ్చు.
5. ఎస్ఐపిలు సుదీర్ఘమైన లాక్-ఇన్ పీరియడ్‌లను కలిగి ఉంటాయి
మ్యూచువల్ ఫండ్స్‌లో లాక్-ఇన్ పీరియడ్ అంటే మీరు యూనిట్లను కొనుగోలు చేసిన తర్వాత వాటిని రీడీమ్ చేయలేని కాలం. అంటే మీరు ఈ కనీస వ్యవధి కోసం మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ రకాన్ని బట్టి ఇది మారుతుంది.
ఎస్ఐపి అనేది పెట్టుబడి పెట్టే ఒక పద్ధతి మాత్రమే, అది స్వయంగా ఒక ఫండ్ కాదు కావున, ఎస్ఐపి కోసం ఎలాంటి లాక్-ఇన్ వ్యవధి లేదు.
ముగింపు
మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడుల కోసం మీరు వివిధ అంశాల గురించి తగిన పరిజ్ఞానం పొందవలసి ఉంటుంది. మార్కెట్ అస్థిరతతో పాటు, ఎస్ఐపి గురించిన అపోహలను నమ్మడం అనేది మీకు విపరీతమైన నష్టాలను కలిగించవచ్చు మరియు సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకోవచ్చు.
ఎస్‌ఐపి సురక్షితమేనా?
మూలధనం భద్రత అనేది మీరు ఎంచుకున్న ఆర్థిక సాధనం మరియు మార్కెట్ అస్థిరతపై ఆధారపడి ఉంటుంది. ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఒక విధానం కాబట్టి, అందులో అలాంటి భద్రతా అంశాలు ఏమీ ఉండవు.
నేను ఏ సమయంలోనైనా ఎస్‌ఐపిని విత్‍డ్రా చేయవచ్చా?
మీరు చాలా సందర్భాల్లో మీ అవసరాలు లేదా ప్రాధాన్యతను బట్టి ఎస్‌ఐపిని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, మీరు ఒక లాక్-ఇన్ వ్యవధితో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ వ్యవధిలోపు ఎస్‌ఐపిని విత్ డ్రా చేయడం సాధ్యం కాదు.
ఎస్ఐపి కోసం లాక్-ఇన్ పీరియడ్ ఎంత?
ఒక చెల్లింపు పద్దతిగా ఎస్ఐపికి ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. అయితే, వాస్తవంగా లాక్-ఇన్ పీరియడ్ అనేది మీరు ఎస్‌ఐపి విధానంలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ల రకాలపై ఆధారపడి ఉంటుంది.