మీరు స్పష్టంగా స్టీర్ చేయాలనుకునే 7 సాధారణ ఇన్వెస్టింగ్ బైయాస్‌లు
ప్రతి పెట్టుబడిదారునికి మరియు అతని/ఆమె మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేసేవి వారి ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాలు మరియు పెట్టుబడుల పట్ల వారికున్న పక్షపాతములు. మీ గత అనుభవాలు, ఆలోచన సరళి, వ్యక్తిత్వం మరియు కుటుంబ నేపథ్యం కూడా కొన్ని పక్షపాతములకు దారితీయవచ్చు అందువల్ల, ఐవి మీరు డబ్బుపై చేసే నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. మీకు దాని గురించి తెలియకపోవచ్చు కానీ ఈ పక్షపాతములు తరచుగా మీరు చేసే లేదా చేయని పెట్టుబడుల రకాల్లో గణనీయమైన పాత్రను పోషిస్తాయి. ప్రస్తుత పెట్టుబడి సందర్భాలకు సరిపోని లేదా సరిపోయే ఉనికిలో లేని ఊహాజనితమైన నియమాలు ఆధారంగా ఈ పక్షపాతము ఉండవచ్చు మరియు ఇవి తార్కిక ఆలోచనను ప్రభావితం చేస్తాయి.
మీరు తొలిగించడానికి ప్రయత్నించే 7 బైయస్‌లు ఇక్కడ ఉన్నాయి-
1 యాంకరింగ్ బైయాస్
ఈ రకమైన బైయాస్‌లో నేడు మీరు తీసుకునే నిర్ణయంలో గత రిఫరెన్స్/బెంచ్‌మార్క్‌కి కొంత ఎక్కువ విలువ ఉంటుంది. ఉదాహరణకు, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీం కొన్ని బాహ్య మార్కెట్ కారకాల కారణంగా నిర్దిష్ట సంవత్సరంలో అనూహ్యంగా మంచి పనితీరు కనబరిచినట్లయితే, అనేక సంవత్సారల పాటు ఆ స్కీమ్ సరైన పనితీరు కనబరచనప్పటికీ, దానిలోనే పెట్టుబడిని కొనసాగించడం యాంకరింగ్ బైయాస్ అవుతుంది. మీరు మీ నిర్ణయాన్ని ఆ ఒక్క బెంచ్‌మార్క్ పై ఆధారపడి తీసుకున్నారు మరియు ఆ నిర్ణయం వెనకాల ఎటువంటి తార్కికమైన ఆలోచన లేదు.
2 బ్యాండ్‌వాగన్ బైయాస్/హెర్డ్ మెంటాలిటీ
ప్రతి ఒక్కరూ ఒక మంచి రోజున బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు అని మీరు కూడా కొనుగోలు చేస్తే, మీకు బ్యాండ్‌వ్యాగన్ బైయాస్ ఉండవచ్చు. అదే విధంగా, ఇతర పెట్టుబడిదారులు పెట్టుబడి చేస్తున్నారు అని మీరు కూడా అదే స్కీమ్ లో పెట్టుబడి చేస్తే, అది మీకు ఉత్తమమైన పెట్టుబడి కాకపోవచ్చు. ప్రతి పెట్టుబడిదారు, వారి పెట్టుబడి ప్రయాణం, రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు లక్ష్యాలు విభిన్నంగా ఉంటాయి, అందుకే ఒకరి పోర్ట్‌ఫోలియోకి సరిపోయే ఫండ్ మరొకరికి సరిపోకపోవచ్చు. లాజిక్ లేదా డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోగలరని సలహా ఇవ్వబడుతుంది.
3 ఛాయస్ సపోర్టివ్ బైయాస్
మీరు తరచుగా మీకు నచ్చిన గాడ్జెట్‌లు, ఒక స్పోర్ట్స్ ప్లేయర్, ఐడియాలజీలు, ఐస్ క్రీమ్ యొక్క ఫ్లేవర్ లేదా మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీం యొక్క నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మీకు ఛాయస్ సపోర్టివ్ బైయాస్ ఉండే అవకాశం ఉంది, ఇది మీ పెట్టుబడి నిర్ణయాలను మీరు సమర్థించుకునేలా చేస్తుంది మరియు అది మంచి నిర్ణయం కాదు అని తెలిసినప్పటికీ ఇతర ఎంపికలను పరిగణించడం మీకు కష్టం అవుతుంది.
4 కన్ఫర్మేషన్ బైయాస్
కన్ఫర్మేషన్ బైయాస్ అనేది మన నమ్మకాలను బలపరిచే కంటెంట్/సమాచారాన్ని వినియోగించే మరియు మీ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని తిరస్కరించే కోరికను సూచిస్తుంది. ఉదాహరణకి, ఈక్విటీ స్కీమ్లలో పెట్టుబడి రిస్క్‌కి తగిన ప్రతిఫలం ఇవ్వదు అని మీరు భావిస్తే, మీరు కేవలం అధిక రిస్క్ అన్న అంశం పైనే దృష్టి పెడతారు మరియు తెలివిగా పెట్టుబడి చేస్తే అధిక లాభం కూడా వస్తుంది అనే విషయాన్ని తెలిపే సమాచారన్ని మీరు విస్మరిస్తారు.
5 అవుట్‌కమ్ బైయాస్
అవుట్‌కమ్ బైయాస్ అనేది నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆధారంగా కాకుండా, ఫలితం ఆధారం ఒక చర్య గురించి నిర్ణయం తీసుకోవడం. ఈ బైయాస్ కారణంగా ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందు జరిగిన పరిస్థితులకు తక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. ఉదాహరణకి, మీరు బలంగా విశ్వసించి, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి చేసి అది మంచి లాభాలను అందించి మీ సంపదను పెంచినట్లయితే, మీరు బలంగా విశ్వసించి తీసుకున్న నిర్ణయాలు అన్ని మీకు విజయం సాధించి పెడతాయి అని కాదు, అది పూర్తిగా అదృష్టం కూడా అవ్వచ్చు. కానీ అవుట్‌కమ్ బైయాస్ ఈ వాస్తవాన్ని మీరు విస్మరించేలా చేస్తుంది. మరో సారి పెట్టుబడి చేసేటప్పుడు మీరు డేటా మరియు వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా ఈ బైయాస్ అడ్డు పడుతుంది.
6 లాస్ అవర్షన్ బైయాస్
పేరు సూచిస్తున్నట్లుగా, లాస్ అవర్షన్ బైయాస్ అనేది నష్టం వస్తుంది అనే భయాన్ని సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ₹ 10 కోల్పోతే మీకు కలిగే బాధ, మీరు ₹ 20 సంపాదిస్తే వచ్చే సంతోషం కన్నా ఎక్కవ ఉంటుంది. పెట్టుబడిదారులు రిస్క్ అవర్షన్ మరియు లాస్ అవర్షన్ గురించి గందరగోళానికి గురవుతారు అని తరచుగా చెప్పబడుతుంది. బహుశా, మీ లాస్ అవర్షన్ బైయాస్‌ని తొలగించి మీ రిస్క్ వ్యూహాన్ని మళ్ళీ పరిశీలించడానికి ఇదే సమయం.
7 ట్రెండ్ ఛేజింగ్ బైయాస్
ఒక పెట్టుబడిదారుగా, ఎక్కువగా ప్రచారంలో ఉన్న, లేదా మంచి కారణాల వలన వార్తల్లో ఉన్న స్కీమ్లు లేదా ఫండ్స్ కేటగిరీలలో పెట్టుబడి చేయడానికి మీకు ఆసక్తి కలగవచ్చు. ట్రెండ్ ఛేజింగ్ బైయాస్ వలన మీరు, ఒక నిర్దిష్ట సమయంలో మంచి పనితీరు కనబరిచిన స్కీమ్లు కొనుగోలు చేయవచ్చు, కానీ అవి మీ లక్ష్యాలు, పెట్టుబడి సమయం లేదా రిస్క్ తీసుకునే సామర్థ్యం ప్రకారం మీ పోర్ట్‌ఫోలియోలో ఉండే అర్హతను కలిగి ఉండవు.
పైన పేర్కొన్న బైయాసులు మీ పెట్టుబడి ప్రణాళికను మీకు తెలియకుండానే ప్రభావితం చేయవచ్చు, మరియు ఏవైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీరు మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ను సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది లేదా, ఎటువంటి బైయాస్ లేకుండా నిర్ణయం తీసుకోవడానికి, మీ గత పెట్టుబడి నిర్ణయాలు మీ బైయాస్‌ల ద్వారా ప్రభావితం అయ్యయ్యో లేదో పరిశీలన చేసుకోండి.