సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి పూర్తి సమాచారం
మ్యూచువల్ ఫండ్స్ కింద సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) అందించే సౌకర్యాలు ఏమిటి?
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) సౌకర్యం ద్వారా మీరు
మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు, దీనిలో మీరు ప్రతి నెలా/ త్రైమాసికం/ అర్ధ సంవత్సరానికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించవచ్చు. ఉదాహరణకు, మీరు జనవరి 1, 2014 న, 1 సంవత్సరం వ్యవధి కోసం ₹8,000 చొప్పున ఎస్ఐపి తీసుకుంటే, తదుపరి 12 నెలల కోసం ప్రతి నెలా ₹8,000 చొప్పున చెల్లిస్తారు.
"చిన్నగా ఉన్నవి శక్తివంతమైనవి" అనే వాక్యము ఎస్ఐపి ఆలోచనను మరింత విస్తరించడానికి ఉద్దేశించబడింది, ఇది నిర్ణీత వ్యవధిలో చిన్న పెట్టుబడులను పెద్ద పెట్టుబడులుగా మార్చాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం మరియు స్థిరంగా ఉంచడం వల్ల, మీరు పతనం అవుతున్న మార్కెట్లో అదనపు యూనిట్లను మరియు విలువ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లను పొందుతారు. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని సర్దుబాటు చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల, కొంత కాలానికి పెట్టుబడులు తక్కువ ఖర్చుతో ఉంటాయి.
మీరు ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి?
మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత మార్కెట్లు అస్థిరంగా ఉన్నంత వరకు లేదా తగ్గుతున్నంత వరకు ఎస్ఐపి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ, అలా కాకుండా మార్కెట్లు బుల్లిష్‌గా మారి మరియు షేర్ ధరలు పెరగడం మొదలైతే, ఎస్ఐపి ప్రయోజనకరంగా ఉండదు మరియు ఏకమొత్తంలోని పెట్టుబడులతో పోలిస్తే తక్కువ రాబడిని ఇవ్వచ్చు. ఎస్ఐపి అనేది ఒక సాధారణ భావన, కానీ చాలా కీలకమైంది. దీని ద్వారా పెట్టుబడి పెట్టడం ఎందుకు విలువైనదో తెలుసుకోవడానికి కొన్ని అంశాలను చూద్దాం
ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్.
మీరు ఎస్ఐపి లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
- ఒకేసారి పెద్ద మొత్తానికి బదులుగా ఒక వ్యక్తి, ప్రతి నెలా చిన్న మొత్తాన్ని కూడబెట్టడం చాలా సులభం. ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం వలన ఆర్ధిక భారం ఎక్కువగా ఉండదు. ఒకేసారి ₹96,000 పెట్టుబడి పెట్టడానికి బదులుగా నెలకు ₹8,000 చెల్లించడం సులభం.
- ఎస్ఐపి అందించే ప్రధాన ప్రయోజనం రూపీ-కాస్ట్ యావరేజింగ్ కాన్సెప్ట్. మార్కెట్ పతనం అవుతున్నప్పుడు అధిక యూనిట్లు కొనుగోలు చేయడానికి మరియు మార్కెట్ పెరుగుతున్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయడానికి ఎస్ఐపి మిమ్మల్ని అనుమతిస్తుంది.
- ఎస్ఐపి అందించే ఇతర ప్రయోజనం ఏమిటంటే, ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పెట్టుబడిదారుగా మారడానికి మీకు శిక్షణను ఇస్తుంది. ఒకసారి, మీరు ఎస్ఐపి ప్రారంభించిన తర్వాత ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్ కోసం కొంత డబ్బును కేటాయించాలి మరియు దానిని అలవరచుకోవాలి.
- పెట్టుబడి కోసం ఎస్ఐపి చాలా అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికి కేవలం ఒక చెక్కుతో పాటు సరిగ్గా పూరించిన ఎన్రోల్మెంట్ ఫారమ్ అవసరం. మ్యూచువల్ ఫండ్ అభ్యర్థించిన తేదీన చెక్కును డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత, యూనిట్లు మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతాయి, అలాగే దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది.
- ఒక వేళ వర్తిస్తే, ఫస్ట్-ఇన్, ఫస్ట్-అవుట్ ప్రాతిపదికన క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను విధించబడుతుంది.
ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా?
- బుల్లిష్ మార్కెట్లలో లేదా కాలక్రమేణా పెరుగున్న మార్కెట్లలో ఎస్ఐపి పెట్టుబడులు పనిచేయవు. మార్కెట్ పెరిగినప్పుడు మరియు క్రమంగా పెరుగుతున్న సమయంలో, మీరు ప్రతిసారి కొనుగోలు చేసిన యూనిట్లు మునుపటి వాటి కంటే అధిక విలువను కలిగి ఉంటాయి, ఇవి ప్రారంభంలో ఏకమొత్తంగా చేసిన పెట్టుబడితో పోలిస్తే, చివరికి సగటు విలువను పెంచుతాయి.
- ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లు, ఎస్ఐపి ద్వారా మీరు పెట్టుబడిగా పెట్టిన డబ్బును మూడు సంవత్సరాల పాటు లాక్ చేస్తాయి; అనగా, మీ పెట్టుబడి మొత్తం, పెట్టుబడి పెట్టిన తేదీ నుండి మూడు సంవత్సరాల కోసం విడిగా లాక్ చేయబడుతుంది. కావున, మీరు జనవరి 2014 లో మీ మొదటి వాయిదాను చెల్లిస్తే, అది జనవరి 2017 వరకు లాక్ చేయబడుతుంది, ఆపై ఫిబ్రవరి, 2014 లో చెల్లించిన వాయిదాలు ఫిబ్రవరి, 2017 వరకు లాక్ చేయబడతాయి మరియు ఆ విధానం కొనసాగుతుంది.
డిస్క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ పేర్కొనబడిన అంశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి మరియు వీటిని మార్గనిర్దేశకాలు, సిఫారసులు లేదా పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించి నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సంబంధిత సమాచారం (చారిత్రక మరియు అంచనా వేయబడినవి) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది మరియు ఇవి నమ్మదగినవిగా పరిగణించబడతాయి. అలాంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను లేదా అలాంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా వాటి కోసం వేయబడిన అంచనాల సహేతుకతను ఆర్ఎన్ఎఎం స్వతంత్రంగా ధృవీకరించదని గమనించాలి; అలాంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు సంబంధించి ఆర్ఎన్ఎఎం ఏ విధంగా హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్‌లో ఉన్న కొన్ని వాక్యాలు మరియు స్టేట్మెంట్లు ఆర్ఎన్ఎఎం యొక్క ఉద్దేశ్యాలను లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, అవి అలాంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.