బ్యాంకుల కోసం ఆర్‌బిఐ ద్వారా తప్పనిసరి చేయబడిన స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, మిమ్మల్ని డబ్బు ఆదా చేయమని బోధించే మీ తండ్రి వంటిది ఎందుకంటే ఆయన మీ చేతిలో ఉన్న డబ్బును నియంత్రించాలని అనుకుంటారు. అయితే, భారతీయ ఆర్థిక వ్యవస్థలో, ఈ నియంత్రణ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా నిర్వహించబడుతుంది. మేము దాని గురించి మీకు వివరిస్తాము.
ఒక బ్యాంక్ దాని వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తుంది?
ఒక బ్యాంక్ కోసం, ఆస్తులు మరియు బాధ్యతలు అనే భావన మీరు అనుకునే దానికి భిన్నంగా ఉండవచ్చు. మీరు సేవింగ్స్/కరంట్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదలైన వాటి ద్వారా బ్యాంకులలో డబ్బును డిపాజిట్ చేస్తారు, అదే విధంగా వివిధ వ్యాపారాలు మరియు పరిశ్రమలు కూడా చేస్తాయి. మీ సేవింగ్స్/కరంట్ అకౌంట్స్ నుండి మీరు కోరుకున్నప్పుడు ఎప్పుడైనా డబ్బును విత్‌డ్రా చేయగలిగినప్పటికీ, ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి ఒక నిర్ణీత సమయం తరువాత మాత్రమే విత్‌డ్రా చేసుకోగలరు. మీరు 1 సంవత్సరం కోసం ఒక ఎఫ్‌డి లో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు 1 సంవత్సరం వరకు వేచి ఉండవచ్చు మరియు అప్పుడు విత్‍డ్రా చేసుకోవచ్చు. మీరు విత్‌డ్రా చేసుకున్న డబ్బు పై కొంత మొత్తం వడ్డీ రూపంలో కూడా అందుతుంది. అందువల్ల, ఈ డిపాజిట్లు బ్యాంక్ యొక్క బాధ్యతలుగా మారుతాయి, ఎందుకంటే మీరు విత్‍డ్రా చేయాలనుకున్నప్పుడు ఈ డబ్బు మీకు అందించబడాలి. సేవింగ్స్/కరెంట్ అకౌంట్ (ఉదాహరణకు) లో ఉన్న డబ్బును డిమాండ్ లయబిలిటీ అని పిలుస్తారు, అయితే నిర్ణీత కాలపు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఉదాహరణకు) డబ్బును టైమ్ లయబిలిటీ అని పిలుస్తారు.
ఈ డబ్బును వివిధ ప్రజలు మరియు సంస్థలకు రుణాలను అందించడానికి బ్యాంకు ఉపయోగిస్తుంది మరియు ఈ రుణాల పై వడ్డీని సంపాదిస్తుంది. డిపాజిట్ చేయబడిన డబ్బులో కొంత భాగాన్ని, వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తాన్ని సంపాదించడానికి, ఇతర బ్యాంకుల్లో పెట్టుబడి చేయడానికి కూడా ఉపయోగించబడవచ్చు. మరియు డబ్బు సంపాదించడానికి ఉన్న ఈ వనరులు అన్ని బ్యాంక్ యొక్క ఆస్తులు అవుతాయి. రుణగ్రహీతలకు రుణాల రూపంలో డబ్బును అందించడానికి ప్రతి బ్యాంక్ తన లయబిలిటీలను వినియోగిస్తుంది.
లోన్లు అందించడానికి బ్యాంకుకు అందుబాటులో ఉన్న డబ్బు మొత్తాన్ని దాని నికర డిమాండ్ మరియు టైమ్ లయబిలిటీలు (ఎన్‌డిటిఎల్) అని పిలుస్తారు, ఇది ప్రాథమికంగా ఇతర బ్యాంకులలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తీసివేసిన తరువాత మీ వంటి వ్యక్తుల ద్వారా బ్యాంకుకు చేయబడిన అన్ని డిపాజిట్ల మొత్తం.
ఎన్‌డిటిఎల్= అన్ని లయబిలిటీలు- ఇతర బ్యాంకులలో డిపాజిట్లు
ఎస్ఎల్ఆర్ తో ఎన్‌డిటిఎల్ కి ఉన్న సంబంధం ఏమిటి?
ఒక బ్యాంక్ కోసం ఎన్‌డిఎల్‌టి ₹ 10 లక్షలు అయితే, రుణాల రూపంలో బ్యాంక్ ఆ పూర్తి ₹ 10 లక్షలను అందించవచ్చా? లేదు. ఎందుకంటే, అలా జరిగితే బ్యాంక్ వద్ద ఎటువంటి నగదు లేదా బఫర్ ఉండదు. ప్రతి వ్యాపారానికి నగదు లిక్విడిటీ అవసరం మరియు బ్యాంకులకు సంబంధించినంత వరకు దానిని నియంత్రించే బాధ్యతను భారతీయ రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉంది. బ్యాంకులు తమ వద్ద లిక్విడ్ అసెట్స్ రూపంలో ఈ ₹ 10 లక్షలలో కొంత భాగాన్ని ఉంచుకోవడాన్ని ఆర్‌బిఐ తప్పనిసరి చేసింది. లిక్విడ్ అసెట్స్ అనేవి నగదు లేదా సులభంగా నగదులోకి మార్చగలిగే ఆస్తులు, ఉదాహరణకు- నగదు, బంగారం లేదా ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైనవి. ఈ శాతాన్ని స్ట్యాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) అని పేర్కొంటారు. ఈ ఉదాహరణలో, ఒక వేళ ఆర్‌బిఐ బ్యాంకులను ఎస్ఎల్ఆర్ ని 20 % వద్ద నిర్వహించమని ఆదేశిస్తే, బ్యాంకు ₹ 2 లక్షలను లిక్విడ్ అసెట్స్ రూపంలో ఉంచుతుంది మరియు మిగిలిన ₹ 8 లక్షల నుండి మాత్రమే రుణాలను అందించాలని అనుకుంటుంది. ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ ₹ 2 లక్షల మొత్తం ఒక రక్షణ వలె ఉపయోగపడుతుంది.
పైన పేర్కొన్న ఉదాహరణ వివరణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే.
ఎస్ఎల్ఆర్ = (ఆర్‌బిఐ/ ఎన్‌డిటిఎల్ ద్వారా మ్యాండేట్ చేయబడిన లిక్విడ్ అసెట్స్)%
ఆర్‌బిఐ బ్యాంకుల కోసం ఎస్‌ఎల్‌ఆర్ ను ఎందుకు నియంత్రిస్తుంది?
చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా కాకుండా తగిన మొత్తం మాత్రమే రుణం ఇవ్వడానికి అందుబాటులో ఉండేలాగా నిర్ధారించడానికి ఆర్‌బిఐ ఎస్‌ఎల్‌ఆర్ ను నియంత్రిస్తుంది. లిక్విడ్ అసెట్స్ రూపంలో వారి వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ డబ్బు పై బ్యాంకులు వడ్డీ సంపాదిస్తాయి మరియు తమ రక్షణ కోసం వాటిని ఒక బఫర్ లాగా ఉంచుకుంటాయి. మన ఆర్థిక వ్యవస్థలో ఎస్ఎల్ఆర్ నియంత్రణ అభివృద్ధి మరియు ద్రవ్యోల్బణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ ఇవ్వబడింది. అది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం-
ఎస్ఎల్ఆర్ % ను తగ్గించడం లేదా పెంచడం ద్వారా, ఆర్‌బిఐ మార్కెట్‌లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. మీ నెలవారీ ఆదాయం ₹ 1 లక్షలు అని భావించండి, మీ నెలవారీ ఖర్చు ₹ 40,000 మరియు తప్పనిసరి సేవింగ్స్ ₹ 20,000 ఇక మీరు మీ కోరిక ప్రకారం ఖర్చు చేయగల రూ 40,000 డబ్బు మీ వద్ద ఉంటుంది. ఈ సందర్భంలో మీ ఎస్ఎల్ఆర్ 20%. ఇప్పుడు, మీరు ఎస్ఎల్ఆర్ ను 50% కు పెంచుకుంటే, మీరు ఖర్చు చేయడానికి తక్కువ డబ్బు (రూ 10,000) మిగిలి ఉంటుంది, తద్వారా అవసరం లేని లేదా ఆలస్యం చేయగల వస్తువుల కోసం తక్కువ డిమాండ్ ఉంటుంది. మీరు మీ స్వంత జీవితంలో సరఫరా మరియు డిమాండ్ నియంత్రించినట్లుగా, అదే పనిని దేశం కోసం ఆర్‌బిఐ చేస్తుంది.
ఎస్ఎల్ఆర్ మీ పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తుంది?
విషయాన్ని సులభతరం చేయడానికి మనం ప్రభుత్వ సెక్యూరిటీల పై దృష్టి పెడదాం. ఆర్‌బిఐ ఎస్ఎల్ఆర్ పెంచింది అని భావిద్దాం, దీని అర్థం బ్యాంకులు మరింత డబ్బును లిక్విడ్ అసెట్స్ రూపంలో ఉంచాలి మరియు అందువలన, మరిన్ని బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు చేయడానికి శోధిస్తాయి. స్పష్టంగా, జి-సెక్ ల కోసం డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది ఎందుకంటే వాటిని పొందడం కష్టం అవుతుంది, మరియు వాటి ధరలు పెరుగుతాయి. మీరు, ఒక పెట్టుబడిదారుగా, జి-సెక్ లలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, మీరు ఇప్పుడు వాటిని కొనుగోలు చేయడం కొంచం కష్టంగా ఉండవచ్చు. డిమాండ్ అధికంగా పెరుగుతున్న ఇతర సందర్భాల వలె, దానికి ఉన్న ప్రయోజనాలు కూడా తగ్గుతాయి. అందువల్ల, జి-సెక్ లకు సంబంధించిన వడ్డీ % తగ్గుతుంది. మీరు ఎస్ఎల్ఆర్ మెరుగుపరచడానికి ముందు ఒక జి-సెక్ లో పెట్టుబడి పెట్టినట్లయితే, ప్రస్తుత పరిస్థితిలో, బాండ్ ఖర్చు పెరిగినందున మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే మీకు మరిన్ని రిటర్న్స్ లభిస్తాయి.
పెరిగిన ఎస్ఎల్ఆర్ అంటే డెట్ ఇన్వెస్టర్ల కోసం మెరుగైన రిటర్న్స్.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.