₹1 కోటి కార్పస్ నిర్మించడానికి 15x15x15 నియమంకి ఒక సమగ్ర గైడ్
స్టాక్ మార్కెట్లో ప్రబలంగా ఉన్న పెరుగుదల మరియు పతనం అనేక మందిని
మ్యూచువల్
ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఆలోచించేలా చేసింది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి అనే హెచ్చరికతో పాటు దీర్ఘకాలంలో 10x లేదా 20x రిటర్న్‌లను అందించే
వివిధ రకాల ఫండ్స్ గురించి మీరు వార్తల్లో చదివి ఉంటారు.
వీటన్నింటి మధ్యలో మీరు
భారతదేశంలో కోటీశ్వరులు అవ్వడానికి ఏదైనా మార్గం ఉందా అని మీరు ఆలోచిస్తున్నారా? మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో
15x15x15 నియమం గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇందులోని గొప్ప విషయం- మీరు ₹1 కోటి కార్పస్‌ను కూడబెట్టుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.
15x15x15 నియమాన్ని అర్థం చేసుకోవడంలో మేము మీకు సహాయపడతాము, తద్వారా మీరు దాని నుండి పూర్తి ప్రయోజనం పొందవచ్చు. మేము ఈ భావనను వివరించడానికి ముందు, మీరు
కాంపౌండింగ్ శక్తి గురించి కూడా తెలుసుకోవాలి.
కాంపౌండింగ్ శక్తి పోషించే పాత్ర
మ్యూచువల్ ఫండ్
పెట్టుబడులలో కాంపౌండింగ్ అనేది మీరు చిన్న మొత్తాలతో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టినప్పుడు అది గణనీయమైన కార్పస్ వృద్ధికి తోడ్పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఒక కాంపౌండింగ్ వ్యవధిలో సంపాదించిన రిటర్న్స్ అనేవి తదుపరి కాంపౌండింగ్ వ్యవధిలో రిటర్న్స్ సంపాదిస్తాయి మరియు అది అలాగే కొనసాగుతుంది. ఈ ఉదాహరణను పరిశీలించండి -
మీరు
15 సంవత్సరాల పాటు మ్యూచువల్ ఫండ్‌లో నెలకు ₹15,000 పెట్టుబడిగా పెట్టాలని ఎంచుకున్నప్పుడు, అది 15% చొప్పున రిటర్న్స్ సంపాదిస్తుందని అంచనా వేయబడింది. అయితే, చక్రవడ్డీ లెక్కల ప్రకారం మీరు 15 సంవత్సరాల తర్వాత స్వీకరించే మొత్తం ~₹1 కోటి కాగా, అదే కాంపౌండింగ్ సూత్రం మరో 15 సంవత్సరాలకు వర్తింపజేసినప్పుడు పూర్తి కార్పస్ మొత్తం ~₹10 కోట్లకు పెరుగుతుంది.
సూచన: ఈ ఉదాహరణ
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన
15x15x15 నియమం సారాంశాన్ని కలిగి ఉంది. దానిని వివరంగా చూద్దాం.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం 15x15x15 నియమం గురించిన పూర్తి సమాచారం
ఈ
15x15x15 నియమం
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి ని ఎస్ఐపి మార్గం ద్వారా చేయడానికి ప్రాథమిక నియమాలలో ఒకటి. దీని ప్రకారం మీరు నెలకు ₹15,000 పెట్టుబడిని
ఎస్ఐపి ద్వారా ఒక
ఈక్విటీ
మ్యూచువల్ ఫండ్ లో చేసినట్లయితే, అది సగటున 15% రిటర్న్స్ ఆర్జించే అవకాశం ఉంటే, మీరు 15 సంవత్సరాల్లో కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది (పై ఉదాహరణలో పేర్కొనబడినట్లుగా).
పదిహేను సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి = ₹15,000 x 180 నెలలు = ₹27,00,000
సుమారు లాభం = ₹74,00,000
పాఠం: మీరు ఎంత త్వరగా ఈ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత ఎక్కువ సంపదను కాలక్రమేణా కూడబెట్టుకోవచ్చు.
కాంపౌండింగ్ అనే మ్యాజిక్ నుండి ఎలా ప్రయోజనం పొందాలి
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల గురించిన ఒక సాధారణ సామెత ఈ విధంగా ఉంటుంది -
డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది.
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి
15x15x15 నియమం అనుసరించినప్పుడు ఇది నిజమవుతుంది. కాంపౌండింగ్ పవర్ శక్తితో మీ డబ్బు రెట్టింపు ప్రయోజనం పొందుతుంది, అనగా మీ ప్రారంభ మూల ధనం రిటర్న్స్ సంపాదిస్తుంది, ఆ రిటర్న్స్ మరిన్ని రిటర్న్స్ సంపాదిస్తాయి, ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.
కాంపౌండింగ్ శక్తి నుండి ప్రయోజనం పొందడానికి అనుసరించాల్సిన అతి ముఖ్యమైన వ్యూహం దీర్ఘకాలిక పెట్టుబడి.
మ్యూచువల్
ఫండ్స్‌లో ఎస్ఐపి ఆధారిత పెట్టుబడులతో మీరు ఈక్విటీ మార్కెట్లో పాల్గొనడానికి సులభమైన మార్గాన్ని కూడా పొందుతారు.
ముగింపు
మీరు
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి చేసినప్పుడు, మీరు మీ మూల ధనంతో పాటు సమయాన్ని కూడా పెట్టుబడిగా పెడతారు. సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టినప్పుడు ఇది సమయమే డబ్బు అనే వాస్తవాన్ని సూచిస్తుంది. దీర్ఘ-కాలిక పెట్టుబడి పరిధితో మీరు ఒక మెరుగైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు మరియు దీని సహాయంతో ఒక కోటీశ్వరులుగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు
15x15x15 నియమం.
తరచుగా అడిగే ప్రశ్నలు
మ్యూచువల్ ఫండ్స్‌లో 15-15-15 నియమం అంటే ఏమిటి?
ఒక పెట్టుబడిదారు 15 సంవత్సరాలపాటు నెలకు ₹15,000 చొప్పున మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఒక కోటి రూపాయల కార్పస్‌ను కూడబెట్టవచ్చని ఈ నియమం తెలుపుతుంది, ఇక్కడ కాంపౌండింగ్ శక్తి ఆధారంగా 15% సగటు రాబడిని పొందవచ్చు.
కాంపౌండింగ్ అంటే ఏమిటి?
కాంపౌండింగ్ ప్రధానంగా, ప్రారంభ పెట్టుబడుల విలువను మరింత పెంచడానికి తిరిగి పెట్టుబడిగా పెట్టబడిన రిటర్న్స్‌ని ఉత్పత్తి చేసే అసెట్ యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది మీ సంపదను వేగంగా వృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
15 సంవత్సరాలలో నేను కోటీశ్వరునిగా ఎలా మారగలను?
మీ ప్రస్తుత ఆదాయం మరియు రిస్క్ విముఖతను బట్టి, మీరు ఎస్ఐపి ద్వారా సరైన ఫండ్స్‌లో డబ్బును పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించడానికి మరియు మీ పెట్టుబడులను ₹1 కోటి లేదా అంతకంటే ఎక్కువగా వృద్ధి చేసుకోవడానికి
15x15x15 నియమాన్ని అనుసరించవచ్చు.