ప్రతి ఒక్కరికీ దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. మీ డబ్బు వృద్ధి అనేది మీ పెట్టుబడులపై వచ్చిన రాబడులపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కాంపౌండింగ్ శక్తి ఉపయోగపడుతుంది.
కాంపౌండింగ్ మీ డబ్బును అనేక రెట్లు పెంచుతుంది. సులభమైన పదాలలో చెప్పాలంటే, కాంపౌండింగ్ అనేది కాంపౌండింగ్ వడ్డీ. ఇది వడ్డీ/రిటర్న్స్ ని అసలు మొత్తంతో పాటు తిరిగి పెట్టుబడి చేసి మీ పెట్టుబడి యొక్క విలువను పెంచుతుంది. మీ డివిడెండ్లు లేదా మీ అసలు పెట్టుబడి మొత్తం పై సంపాదించిన వడ్డీ ఆదాయాన్ని తిరిగి పెట్టుబడి చేయడం ఇందులోని కీలక అంశం.
కాంపౌండింగ్‌తో, అసలు మొత్తంలో పెరుగుదలతో ఆర్‌ఒఐ (పెట్టుబడిపై రాబడి) పెరుగుతుంది. పెరుగుతున్న కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీతో ఆర్‌ఒఐ - నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ-వార్షికంగా, లేదా వార్షికంగా మరింత పెరుగుతుంది. ఉదాహరణకు, మీరు సంవత్సరానికి 15% సగటు వార్షిక రిటర్న్స్‌తో ₹1,00,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పుడు, మూడు సంవత్సరాల తర్వాత, రిడెంప్షన్ వద్ద మీ పెట్టుబడి విలువ ₹1,55,545 ఉంటుంది.
అందువల్ల, కాంపౌండింగ్ శక్తి వేగవంతమైన రేటుతో మీ సంపదను పెంచుకోవడానికి సహాయపడుతుంది. కాంపౌండింగ్ స్థాయిని తెలుసుకోవడానికి, మీరు కాంపౌండింగ్ కాలిక్యులేటర్ యొక్క శక్తిని ఉపయోగించవచ్చు.
కాంపౌండ్ వడ్డీ కాలిక్యులేటర్
మీరు అవసరమైన విలువలను ఎంటర్ చేసిన తర్వాత, కాంపౌండ్ వడ్డీ కాలిక్యులేటర్ మీ ఫలితాలను సెకన్లలో లెక్కిస్తుంది. అందువల్ల, ఒక కాంపౌండింగ్ కాలిక్యులేటర్ వేగవంతమైన మరియు సమయం ఆదా చేసే సాధనం, ఎందుకంటే మీరు ఇకపై కష్టమైన మాన్యువల్ లెక్కింపులను చేయవలసిన అవసరం లేదు.
సంక్షిప్తంగా, ఒక కాంపౌండ్ వడ్డీ కాలిక్యులేటర్ నిర్ణీత సంఖ్యలో పీరియాడిక్ పెట్టుబడులు లేదా ఏకమొత్తం పెట్టుబడి తరువాత నిర్దేశించబడిన వ్యవధిలో ఇవ్వబడిన రిటర్న్ రేటు వద్ద మీ పెట్టుబడుల విలువను లెక్కిస్తుంది. ఒక కాంపౌండింగ్ కాలిక్యులేటర్ అనేది పెట్టుబడి ప్లానింగ్ కోసం ఒక అనివార్యమైన సాధనం.