సైన్ ఇన్ అవ్వండి

ఎస్ఐపి వర్సెస్ ఏకమొత్తం: మీరు ఎలా నిర్ణయం తీసుకోవచ్చో ఇక్కడ ఇవ్వబడింది

Systematic Investment Plan (SIP) and lump sum investment are two ways of investment in a mutual fund scheme. There is often a debate regarding which one of the two modes of investments is better. The answer to that is not as black and white as you may think.

రెండు విధాల పెట్టుబడి విధానాలు ఉండడానికి గల కారణం ఏమిటంటే, కొందరు పెట్టుబడిదారులకు ఎస్ఐపి మెరుగ్గా ఉపయోగపడుతుంది మరియు మరికొందరికి ఏకమొత్తం మెరుగ్గా పని చేస్తుంది. ఎస్ఐపి మరియు ఏకమొత్తం పెట్టుబడుల ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం-

సిప్ అంటే ఏమిటి, మరియు దాని ప్రయోజనాలు ఏమిటి?

ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్ స్కీంలలో పెట్టుబడి పెట్టే విధానం, ఇందులో మీరు ఒక స్కీంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న నిర్ణీత మొత్తాన్ని మరియు మీరు ఏ నియమిత కాలంలో పెట్టుబడి చేయాలని అనుకుంటున్నారు అనేది ఎంచుకుంటారు. ఉదాహరణకు, మీ సౌలభ్యం ప్రకారం, మీరు ప్రతి నెలా ₹5000 పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచ్చు, లేదా మీరు ప్రతి త్రైమాసికంలో ₹10,000 పెట్టుబడి పెట్టడానికి కూడా ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఫ్రీక్వెన్సీ వద్ద, పెట్టుబడి మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ నుండి మినహాయించబడుతుంది మరియు మ్యూచువల్ ఫండ్ స్కీం యొక్క యూనిట్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఆ రోజున స్కీం యొక్క ఎన్ఎవి అంటే ఆ స్కీం యొక్క ప్రతి యూనిట్ ఖర్చు ఆధారంగా కొనుగోలు జరుగుతుంది.

ఎన్ఎవి మరియు ఇది మీ ఎస్ఐపి పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్ఐపి యొక్క ప్రయోజనాలు:

క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి

ఎస్ఐపి అనేది మీ ఆర్థిక లక్ష్యాల ప్రకారం మీ పెట్టుబడులను క్రమబద్ధంగా చేసే అలవాటును పెంపొందిస్తుంది. పెట్టుబడి చేయడానికి పెద్ద మొత్తం కోసం వేచి ఉండే అవసరాన్ని ఇది తొలగిస్తుంది. బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును మినహాయించే మ్యాండేట్ అవసరమైన క్రమశిక్షణను అందిస్తుంది.

రూపీ కాస్ట్ యావరేజింగ్

అస్థిరమైన మార్కెట్లో ఉండే అంశాల గురించి మెరుగైన అవగాహన లేని వారికి, మార్కెట్ సైకిల్స్‌ని అనుసరించడం కష్టతరం అవుతుంది. ఎస్ఐపి ల ద్వారా పెట్టుబడి చేయడం వలన మార్కెట్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అదే డబ్బు మొత్తంతో ఎక్కువ సంఖ్యలో యూనిట్లను కొనుగోలు చేస్తారు మరియు మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తారు. సమయం గడిచే కొద్దీ, మీ రిస్కులు మరియు ఖర్చులలో సమతౌల్యం లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అని పేర్కొంటారు

కాంపౌండింగ్ యొక్క శక్తి

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, కాంపౌండ్ వడ్డీ యొక్క మ్యాజిక్ దీర్ఘకాలంలో మీ లాభాలను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీరు ఒక సిప్ ప్రారంభించిన తర్వాత, మీరు పెట్టుబడిని కొనసాగిస్తే మీ రాబడులు విశేషంగా పెరుగుతాయి. మీ స్వంత జీవిత ఉదాహరణలతో కాంపౌండింగ్ శక్తిని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మీరు మా సిప్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

ఎస్ఐపి యొక్క ప్రయోజనాలు మరియు లక్షణాల గురించి వివరంగా చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడం అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనాలు ఏమిటి?

పేరు సూచిస్తున్నట్లుగా, ఏకమొత్తంలో పెట్టుబడులు అనేవి మ్యూచువల్ ఫండ్ పథకాలలో ఒకేసారి పెద్దమొత్తంలో చేయబడతాయి ఎస్ఐపి లో మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా క్రమబద్ధమైన రీతిలో మీరు పెట్టుబడులు చేయవచ్చు; కానీ, ఏకమొత్తం విధానంలో మీరు మార్కెట్ పరిస్థితులను పరిగణించవలసి ఉంటుంది కొనుగోలు చేసిన యూనిట్ల సంఖ్యను గరిష్టంగా పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడానికి తగిన సమయాన్ని ఎంచుకోవాలి.

ఏకమొత్తంలో పెట్టుబడి యొక్క ప్రయోజనాలు:

మీ పెట్టుబడులపై నియంత్రణ

ఎస్ఐపి లో ఒక స్కీంలో దీర్ఘ కాలం కోసం మీరు పెట్టుబడిని కొనసాగిస్తారు, ఏకమొత్తంలో, మీరు వివిధ స్కీంలలో పెట్టుబడి చేస్తారు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా, మీరు ఒక ఎంపిక చేసుకోవచ్చు. కాంపౌండింగ్ యొక్క శక్తి: మీరు మార్కెట్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి, మార్కెట్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు పెట్టుబడి చేసినట్లయితే, ఎస్ఐపి తో పోలిస్తే ఏకమొత్తంలో చేసే పెట్టుబడిలో కాంపౌండింగ్ యొక్క ప్రయోజనం మెరుగ్గా ఉంటుంది. మీరు ఎక్కువ కాలం పెట్టుబడి చేస్తే, మీ రిటర్న్స్ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఎస్ఐపి అనేది క్రమబద్ధమైన పెట్టుబడికి మరియు మార్కెట్ అస్థిరతను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, కానీ ఏకమొత్తంలో పెట్టుబడి అనేది మీరు తెలివిగా పెట్టుబడి చేస్తే మెరుగైన రిటర్న్స్ అందించడానికి సహాయపడుతుంది.

మార్కెట్ ప్రావీణ్యం యొక్క ప్రయోజనం

మార్కెట్ పరిస్థితుల ప్రకారం పెట్టుబడులు చేయలేని పెట్టుబడిదారులు కోసం ఎస్ఐపి లోని రూపీ కాస్ట్ యావరేజింగ్ యొక్క ప్రయోజనం అద్భుతమైన ప్రతిఫలాన్ని అందిస్తుంది, కానీ మార్కెట్ పరిస్థితులను మీరు సరిగ్గా అంచనా వేయగలిగితే ఏకమొత్తం పెట్టుబడితో మార్కెట్ అస్థిరత యొక్క ప్రయోజనాన్ని మీరు వినియోగించుకోవచ్చు. మార్కెట్ పడిపోతున్నప్పుడు మరియు ఎన్ఎవి లు తక్కువగా ఉన్నప్పుడు, ఏకమొత్తం పెట్టుబడి అనేది ఒక నిర్దిష్ట కాలంలో ఎస్ఐపి తో పోలిస్తే అధిక మొత్తంలో యూనిట్ల సంఖ్యను అందిస్తుంది. ఇలా ఎందుకంటే, మార్కెట్ పెరిగినప్పుడు ఎస్ఐపి లో కొనుగోలు చేసే యూనిట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది.

మీకు ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?

ఇది మీ ప్రారంభ మరియు మీ గమ్యస్థానం మధ్య రవాణా విధానాన్ని ఎంచుకోవడం వంటిది. 'సరైన' ఎంపిక ఏదీ లేదు; మీకు అనుకూలంగా ఉండే విధానాలు ఉన్నాయి మరియు మీకు అనుకూలంగా లేని విధానాలు ఉన్నాయి. అలాగే, ఎస్ఐపి మరియు ఏకమొత్తం పెట్టుబడుల మధ్య ఈ ఎంపిక పూర్తిగా మీ పెట్టుబడి లక్ష్యాలు, పెట్టుబడి మొత్తం, పెట్టుబడి అవధి, మీ రిస్క్ సామర్థ్యం మరియు అన్నింటి కంటే ముఖ్యంగా మీ ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.

అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కలిపే సాధారణ సూత్రం మీకు వీలైనంత కాలం పెట్టుబడి పెట్టడం. మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టినప్పుడు, రాబడులు మెరుగ్గా ఉండవచ్చు. మీరు చిన్న మొత్తాలలో లేదా అనేక పెద్ద మొత్తాలలో పెట్టుబడి చేయాలని అనుకోవడం అనేది, మీకు అందుబాటులో ఉన్న మూల ధనం మరియు మీరు కోరుకుంటున్న విధానం ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

To begin investing, click here!


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి