మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు కెవైసి ని పూర్తి చేయాలి.
కెవైసి
కెవైసి లేదా మీ కస్టమర్‌ను తెలుసుకోండి అనేది ఒక వినియోగదారు గుర్తింపు ప్రక్రియ అని తెలుసుకోండి మరియు మ్యూచ్యువల్ ఫండ్(ల)లో పెట్టుబడి పెట్టడానికి ఇది తప్పనిసరి. ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) మనీ లాండరింగ్ చట్టం 2002 కింద మార్గదర్శకాలను నిర్దేశించింది, ఇది ఆర్థిక సంస్థలు మరియు ఆర్థిక మధ్యవర్తులను కస్టమర్లకు తమ గురించిన వివరాలను తెలియజేయడాన్ని తప్పనిసరి చేస్తుంది. ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఆఫీస్(లు) లో గుర్తింపు మరియు చిరునామా రుజువుతో పాటు పూర్తిగా నింపబడిన కెవైసి అప్లికేషన్ సమర్పించి ఈ వన్ టైమ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
అందువల్ల, ఏకమొత్తంగా లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ద్వారా మ్యూచ్యువల్ ఫండ్ స్కీంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు కెవైసి ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడి మొత్తంతో సంబంధం లేకుండా కెవైసి ప్రక్రియ అనేది తప్పనిసరి. అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో జరిగే ట్రాన్సాక్షన్‌లకు, వన్-టైమ్ వెరిఫికేషన్ తప్పనిసరి.
గమనిక: మనీ లాండరింగ్ మరియు ఇతర అనుమానాస్పద ట్రాన్సాక్షన్‌లను నివారించడానికి కెవైసి ప్రక్రియ సహాయపడుతుంది.
గుర్తింపు రుజువు (క్రింది డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి. పెట్టుబడి మొత్తం 50K కంటే ఎక్కువ ఉంటే పాన్ తప్పనిసరి)
పాస్‌పోర్ట్ / పాన్ కార్డ్ / ఓటర్ ఐడి / నరేగా జాబ్ కార్డ్.
చిరునామా రుజువు: (కింది డాక్యుమెంట్‌లో ఏదైనా ఒకటి)
పాస్‌పోర్ట్ / పాన్ కార్డ్ / ఓటర్ ఐడి / నరేగా జాబ్ కార్డ్/ ఆధార్ కార్డు
నిప్పాన్ ఇండియా మ్యూచ్యువల్ ఫండ్ వెబ్‌సైట్ (ఎన్ఐఎంఎఫ్)పై కెవైసి సమాచార విభాగాన్ని వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీ ప్రొఫైల్ వివరాలను అప్‌డేట్ చేయండి
ఎఎంసి / మ్యూచ్యువల్ ఫండ్(ల)లో మీ పెట్టుబడికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం మీ ప్రొఫైల్ వివరాలు. అవాంతరాలు లేని ట్రాన్సాక్టింగ్ / ఇన్వెస్టింగ్ కోసం మరియు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్ మరియు చిరునామా పై మీ ట్రాన్సాక్షన్ల సమాచారాన్ని పొందడానికి మీ ప్రొఫైల్ వివరాలను అప్‌డేట్ చేసి ఉంచడం చాలా ముఖ్యం. సంబంధిత ఫారం నింపడం ద్వారా మీరు మీ చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు మొదలైన వాటిని చాలా సులభంగా అప్‌డేట్ చేయవచ్చని అలాగే సంబంధిత సపోర్ట్ డాక్యుమెంట్లతో పాటు మీ సమీప నిర్దేశిత పెట్టుబడిదారు సేవా కేంద్రం (డిఐఎస్‌సి) కు ఫారం సమర్పించవచ్చని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము.
క్విక్ లింక్స్ (వీక్షించడానికి, డౌన్‌లోడ్ మరియు ఉపయోగించడానికి అవసరమైన సంబంధిత ఫారం / ట్యాబ్‌పై క్లిక్ చేయండి)
చిరునామాని మార్చండి / అప్‌డేట్ చేయండి
బ్యాంక్ వివరాలలో మార్పు
మొబైల్ నంబర్ / ఇమెయిల్ ఐడి ని మార్చండి / అప్‌డేట్ చేయండి
మరిన్ని వివరాల కోసం, మీరు ఇక్కడ క్లిక్ చేయండి మరియు నిప్పాన్ ఇండియా మ్యూచ్యువల్ ఫండ్ వెబ్‌సైట్‌లో నాన్-కమర్షియల్ ట్రాన్సాక్షన్ చెక్‌లిస్ట్ పేజీని చూడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము.
కొన్ని నియంత్రణ / జాగ్రత్త చర్యలు
- దయచేసి, ఎల్లప్పుడూ సెబీ వెబ్‌సైట్‌లో "ఇంటర్మీడియరీస్ / మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్"లో స్పష్టంగా ధృవీకరించబడిన రిజిస్టర్డ్ మ్యూచ్యువల్ ఫండ్ సంస్థలు / ఎఎంసి ల వద్ద మాత్రమే పెట్టుబడి పెట్టండి.
అంతేకాకుండా, మేము ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాము- మీ ఫిర్యాదులను పరిష్కరించడానికి / ఏదైనా సహాయం కోసం దయచేసి మీ ఆర్థిక సలహాదారున్ని / సమీప శాఖ లేదా పెట్టుబడిదారు సేవా కేంద్రాన్ని సంప్రదించండి లేదా 1860 266 0111 పై మమ్మల్ని సంప్రదించండి (సోమవారం నుండి శనివారం వరకు 8 AM నుండి 9 PM వరకు, కాల్ ఛార్జీలు వర్తిస్తాయి) లేదా మీరు దీనికి ఇమెయిల్ చేయవచ్చు:
[email protected]. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం మీరు సెబి స్కోర్స్ పోర్టల్‌ను కూడా సందర్శించవచ్చు.
సెబి స్కోర్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది ఒక
నిప్పాన్ ఇండియా మ్యూచ్యువల్ ఫండ్ (ఎన్ఐఎంఎఫ్) అందిస్తున్న ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ / అవగాహన కార్యక్రమం అలాగే మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా కలిగి ఉన్నాము. మీ విలువైన అభిప్రాయం / సూచనలను మాకు తెలియచేయండి.