సైన్ ఇన్ అవ్వండి

 కంటెంట్ ఎడిటర్



మీరు నమ్మవలసిన అవసరం లేని 5 ఎస్ఐపి అపోహలు

ఒకవేళ, ఫిబ్రవరి 28, 2022 నాటికి భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న అసెట్స్ (ఎయుఎం) 37,56,296 కోట్లు (మూలం: ఎఎంఎఫ్‌ఐ ఇండియా https://bit.ly/3I96wy8) అయితే, మ్యూచువల్ ఫండ్‌లు భారతీయ పెట్టుబడిదారుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి అని చెప్పడంలో ఏ సందేహం లేదు. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం గురించి ఆలోచించినప్పుడు, ఇక్కడ అనేక అపోహలు ఉన్నాయి, ఇవి మొదటిసారి పెట్టుబడి చేసేవారికి సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా గందరగోళానికి గురిచేస్తాయి.

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌కు సంబంధించి మీకు అనేక అపోహలు ఉండవచ్చు. ఈ బ్లాగ్‌లో మేము ఎస్‌ఐపి గురించిన మీ సాధారణ అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తాము.

1. ఎస్ఐపి అనేది ఒక రకమైన పెట్టుబడి ప్రోడక్ట్

చాలా మంది పెట్టుబడిదారులు ఎస్‌ఐపి గురించి ఒక పెట్టుబడి ప్రోడక్ట్‌గా ఆలోచిస్తారు. ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇది ఒక ప్రోడక్ట్ కాదు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం.

ఒకే-సారి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టకుండా, మీరు ఎస్ఐపి ద్వారా కాలానుగుణంగా పెట్టుబడి పెట్టడం కొనసాగించవచ్చు. మీరు ఎంచుకున్న ఫండ్‌లలో కాలానుగుణంగా పెట్టుబడి పెట్టాలనుకునే అమౌంట్, మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా మినహాయించబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు ఎస్ఐపి గురించిన ఈ సందేహాన్ని తప్పనిసరిగా క్లియర్ చేసుకోవాలి.

2. ఎస్ఐపి అనేది చిన్న పెట్టుబడులకు మాత్రమే ఉద్దేశించబడింది

ఎస్ఐపి అనేది ప్రజలకు కేవలం ₹500 తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి అనుమతిస్తుంది, తద్వారా ఎవరైనా వారి పెట్టుబడి ప్రయాణాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. అయితే, చాలా మంది ప్రజలు ఎస్‌ఐపిని చిన్న-మొత్తంతో పెట్టుబడులు పెట్టే వారి కోసం మాత్రమే ప్రత్యేకించినవని భావిస్తున్నారు, కాని ఇది వాస్తవం కాదు.

ఒక పెట్టుబడిదారుగా మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఏదైనా మొత్తం కోసం మీరు ఎస్‌ఐపిని రిజిస్టర్ చేసుకోవచ్చు. సంపన్నులకు కూడా ఎస్‌ఐపి గురించి తెలుసు, చాలా వరకు వారు ఏకమొత్తంలో పెట్టుబడులకు బదులుగా ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడాన్ని ఇష్టపడతారు.

3. మీరు ఎస్ఐపి ద్వారా ఈక్విటీ ఫండ్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు

ఎస్ఐపి గురించిన ఒక సాధారణ అపార్థం ఏమిటంటే, దీనిని కేవలం ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకోవడం. ఎస్ఐపి అనేది మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా మీ పెట్టుబడులను సరైన రకమైన మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్చడానికి మిమ్మల్ని అనుమతించే ఒక పద్ధతి. కావున, మీకు స్వల్పకాలిక లక్ష్యం ఏదైనా ఉంటే మీరు ఎస్‌ఐపి ద్వారా డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా దీర్ఘకాల రాబడి కోసం ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు.

4. మీకు కావలసినప్పుడు మీరు ఎస్‌ఐపిని విత్‍డ్రా చేయలేరు

సరళంగా చెప్పాలంటే ఎస్‌ఐపిని విత్‌డ్రా చేయడం అంటే ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడం, అలాగే ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని విరమించుకోవడం. అలాగే, ప్రస్తుత ఎన్‌ఎవి వద్ద అన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడం అని అర్థం. పెట్టుబడిదారులు ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఇలాంటివి తరచుగా చేస్తారు.

ఎస్ఐపి గురించిన ఒక వాస్తవం ఏమిటంటే, మీరు ఎంచుకున్న ఫండ్ లాక్-ఇన్ వ్యవధి (అది ఏదైనా ఉంటే) ముగిసిన తర్వాత ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టబడిన మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇఎల్ఎస్ఎస్‌ స్కీమ్ కోసం 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది మరియు దానికి ముందు మీరు విత్‍డ్రా చేయలేరు. ఒక ఎస్‌ఐపిని విత్‍డ్రా చేయడానికి మీరు ఎగ్జిట్ లోడ్‌ను కూడా చెల్లించాల్సి రావచ్చు, అది వర్తిస్తే మీరు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడానికి మరియు మీ ట్రాన్సాక్షన్‌ను నిర్ధారించడానికి ఒక అభ్యర్థనను పంపించాలి. మీ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్‌ను సెటిల్ చేయడానికి పట్టే సమయం అనేది ఒక ఫండ్ నుండి మరొక ఫండ్‌కు మారవచ్చు.

5. ఎస్ఐపిలు సుదీర్ఘమైన లాక్-ఇన్ పీరియడ్‌లను కలిగి ఉంటాయి

మ్యూచువల్ ఫండ్స్‌లో లాక్-ఇన్ పీరియడ్ అంటే మీరు యూనిట్లను కొనుగోలు చేసిన తర్వాత వాటిని రీడీమ్ చేయలేని కాలం. అంటే మీరు ఈ కనీస వ్యవధి కోసం మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ రకాన్ని బట్టి ఇది మారుతుంది.

ఎస్ఐపి అనేది పెట్టుబడి పెట్టే ఒక పద్ధతి మాత్రమే, అది స్వయంగా ఒక ఫండ్ కాదు కావున, ఎస్ఐపి కోసం ఎలాంటి లాక్-ఇన్ వ్యవధి లేదు.

ముగింపు

మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడుల కోసం మీరు వివిధ అంశాల గురించి తగిన పరిజ్ఞానం పొందవలసి ఉంటుంది. మార్కెట్ అస్థిరతతో పాటు, ఎస్ఐపి గురించిన అపోహలను నమ్మడం అనేది మీకు విపరీతమైన నష్టాలను కలిగించవచ్చు మరియు సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకోవచ్చు.

ఎస్‌ఐపి సురక్షితమేనా?

మూలధనం భద్రత అనేది మీరు ఎంచుకున్న ఆర్థిక సాధనం మరియు మార్కెట్ అస్థిరతపై ఆధారపడి ఉంటుంది. ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఒక విధానం కాబట్టి, అందులో అలాంటి భద్రతా అంశాలు ఏమీ ఉండవు.

నేను ఏ సమయంలోనైనా ఎస్‌ఐపిని విత్‍డ్రా చేయవచ్చా?

మీరు చాలా సందర్భాల్లో మీ అవసరాలు లేదా ప్రాధాన్యతను బట్టి ఎస్‌ఐపిని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, మీరు ఒక లాక్-ఇన్ వ్యవధితో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ వ్యవధిలోపు ఎస్‌ఐపిని విత్ డ్రా చేయడం సాధ్యం కాదు.

ఎస్ఐపి కోసం లాక్-ఇన్ పీరియడ్ ఎంత?

ఒక చెల్లింపు పద్దతిగా ఎస్ఐపికి ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. అయితే, వాస్తవంగా లాక్-ఇన్ పీరియడ్ అనేది మీరు ఎస్‌ఐపి విధానంలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ల రకాలపై ఆధారపడి ఉంటుంది.

​​ ​
డిస్‌క్లెయిమర్:
ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడిదారులకు విద్య మరియు అవగాహన చొరవ.
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి