సైన్ ఇన్ అవ్వండి

మ్యూచువల్ ఫండ్స్‌లో రెపో రేటు అంటే ఏమిటి, ఇది మీ పెట్టుబడులను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?​

వాణిజ్య బ్యాంకులకు అకస్మాత్తుగా చాలా లిక్విడ్ డబ్బు అవసరమయ్యే కొన్ని సందర్భాలు ఉండవచ్చు; అకస్మాత్తుగా రిడెంప్షన్ లేదా ఫండ్స్ విత్‍డ్రాల్ వంటి సందర్భాలు లేదా దాని చట్టబద్ధమైన లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) లేదా క్యాష్ రిజర్వ్ నిష్పత్తి (సిఆర్ఆర్)ని కొనసాగించడం లాంటి కొన్ని సందర్భాలు . మీరు నిధుల కొరతను ఎదుకున్నట్లయితే, మీరు బహుశా మీ తల్లిదండ్రుల సహాయం తీసుకోవచ్చు, కానీ ఒక బ్యాంక్ అనేది ఎవరి సహాయం తీసుకుంటుంది? ఆర్‌బిఐతో ప్రభుత్వ సెక్యూరిటీలను పరస్పరంగా ఉంచడం ద్వారా బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తీసుకుంటుంది. ఒక రాత్రి లేదా 7 రోజుల వరకు ఉన్న లోన్ కాలపరిమితి ముగిసిన తర్వాత, బ్యాంక్ ముందుగా నిర్ణయించబడిన వడ్డీ రేటుతో పాటు లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడం ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేస్తుంది.

అందువల్ల, రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు వారి లిక్విడిటీని మెరుగుపరచడానికి ఆర్‌బిఐ డబ్బును రుణంగా ఇస్తుంది. ఆర్‌బిఐకి డబ్బును తిరిగి చెల్లించడంలో బ్యాంక్ విఫలమైతే, తరువాత మార్కెట్‌లో కొలేటరల్ ఉంచబడిన జి-సెక్ లు విక్రయించబడతాయి.

ఒక ఉదాహరణను చూద్దాం-

ఒక వివరణగా, 6.5% యొక్క హైపోథెటికల్ రెపో రేటును పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంక్ యొక్క రుణ తీసుకునే ప్రక్రియ కింద ఇవ్వబడింది-

బ్యాంక్ యొక్క తిరిగి చెల్లించే ప్రక్రియ-

మా ఆర్థిక వ్యవస్థకు రెపో రేటు యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం మరియు వృద్ధిని నియంత్రించడానికి రెపో రేటును నియంత్రించడం అనేది ఆర్‌బిఐ అనుసరించే సాధనాల్లో ఒకటి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న పరిస్థితిని పరిగణించండి; దీన్ని తగ్గించేందుకు ఆర్‌బిఐ రెపో రేటును పెంచుతుంది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం:

మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను రెపో రేటు ఎలా ప్రభావితం చేస్తుంది?

డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీంలు-

ఒక ఉదాహరణను పరిగణించి చూస్తే, ఒక 10-సంవత్సరం ప్రభుత్వ బాండ్ రూ. 100 మరియు వడ్డీ (కూపన్) రేటు 8% యొక్క ఫేస్ వాల్యూ వద్ద జారీ చేయబడిందని భావించండి. ఈ బాండ్‌లోని ఈల్డ్ రూ 8.ని సూచిస్తుంది, రెపో రేటు పెరిగి, లెండింగ్ రేటును 10%కి పెంచినట్లయితే, కొత్తగా జారీ చేయబడిన బాండ్ యొక్క రిటర్న్ రూ 10 ఉంటుంది అని అర్థం. 10% కూపన్ రేటు మెరుగైన రిటర్న్‌లను ఇస్తుంది కాబట్టి ఇది 8% బాండ్ యొక్క డిమాండ్‌ను తగ్గిస్తుంది. మునుపటిది మరింత ఆకర్షణీయంగా ఉంచేందుకు, బాండ్ యొక్క ఫేస్ వాల్యూ 90కి తగ్గించబడుతుంది. ఈ బాండ్‌కు ఈల్డ్ ఇప్పుడు 8.89% (8/90*100)ని సూచిస్తుంది, ఇది అసలు కంటే ఎక్కువగా ఉంటుంది, అందువల్ల దానిని మరింత ఆకర్షణీయమైనదిగా చేస్తుంది. అందువల్ల, వడ్డీ రేటులో పెరుగుదల నేరుగా రాబడికి అనుగుణంగా మరియు ఫేస్ వాల్యూకి వ్యతిరేకంగా ఉంటుంది.

డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీంలు ప్రభుత్వ బాండ్‌లు వంటి స్థిరమైన ఆదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టండి; అందువల్ల, రెపో రేటు డెట్ స్కీం‌లను మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు, ఎందుకంటే ఇది డెట్ స్కీం‌ల ఎన్ఎవి ని పెంచుతుంది. లాభం యొక్క మార్జిన్ సగటు మెచ్యూరిటీ మరియు స్కీం కలిగి ఉన్న సెక్యూరిటీలపై ఆధారపడి ఉంటుంది.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీంలు-

ఈక్విటీ స్కీంలు రెపో రేటు మార్పుల యొక్క పరోక్ష ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు, వడ్డీ రేట్లు తగ్గితే, ఇది కార్పొరేట్లకు మరిన్ని ఫండ్స్ అందుబాటులోకి తెస్తుంది, ఇది వారి ఆదాయాలు మరియు నగదు ప్రవాహాన్ని పెంచవచ్చు తద్వారా అధిక స్టాక్ ధరలకు దారితీస్తుంది. ఈ షిఫ్ట్ వెంటనే ఫలితాన్ని చూపకకపోవచ్చు కానీ క్రమం తప్పక జరగుతుంది. ఇది ఈక్విటీ మార్కెట్లో పాజిటివ్ అభివృద్ధికి దారితీస్తుంది మరియు ఈక్విటీలో పెట్టుబడి పెట్టే పథకాలకు లాభాలను అందిస్తుంది.

మీరు చూస్తున్నట్లుగా, రెపో రేటులో మార్పు నేరుగా లేదా పరోక్షంగా మీ డెట్ మరియు ఈక్విటీ-లింక్డ్ పెట్టుబడులను ప్రభావితం చేయవచ్చు. కానీ రెపో రేట్ నిబంధనల కారణంగా మీ పెట్టుబడి వ్యూహంలో ఏవైనా మార్పులు చేయడానికి ముందు, మీరు మీ ఆర్థిక సలహాదారునిని సంప్రదించమని సిఫార్సు చేయబడుతుంది. అటువంటి మరింత జార్గాన్-డికోడింగ్‌కు ఈ స్థలాన్ని చూడండి!

​​
​​​
డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి