సైన్ ఇన్ అవ్వండి

మ్యూచువల్ ఫండ్స్ గురించి సమాచారం

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ కొత్తది కాదు కానీ గత దశాబ్దం లేదా రెండు సంవత్సరాలలో, ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రజలు తమ సంపదను నిర్వహించడానికి మెరుగైన మార్గాన్ని సూచిస్తుంది,‌ భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఒక విజయవంతమైన ఉమ్మడి పెట్టుబడి సాధనం. ఇది ప్రాథమికంగా సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తుల సమూహం నుండి సేకరించిన డబ్బును ఒకచోట కూడబెడుతుంది. ఈ సెక్యూరిటీలు ట్రేడ్ చేయదగిన అసెట్‌లు, ఇవి వాటి పెట్టుబడి లక్ష్యం ఆధారంగా విస్తృతంగా వర్గీకరించబడ్డాయి మరియు అవి ఈక్విటీ ఫండ్స్​, డెట్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్,ఇండెక్స్ ఫండ్స్‌, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్​, లార్జ్​, మిడ్ లేదా లో క్యాప్ ఫండ్స్.‌మొదలైన వర్గాల కిందకు వస్తాయి. ఈ ఫండ్‌లలో నుండి ఎంచుకోవడానికి కారణమైన ఇతర అంశాలు వాటి క్లోజర్ సమయం ఆధారంగా ఉంటాయి మరియు అవి ఓపెన్ ఎండ్ లేదా క్లోజ్ ఎండ్ స్కీమ్‌లు కావచ్చు. అలాగే, కాలానుగుణ చెల్లింపు అనేది డివిడెండ్ చెల్లింపు మరియు గ్రోత్ ఆప్షన్ మధ్యన ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీ డబ్బును ఇంట్లో ఉంచడం అంటే దానిని కేవలం ఒక సంప్రదాయక మార్గంలో పొదుపు చేయడం అని అర్థం, కానీ, ఊరికే ఉన్న ఈ నగదు మీకు ఎలాంటి వృద్ధిని ఇవ్వదు. అదే సమయంలో, పెరుగుతున్న ఖర్చులను భరించడానికి, మీ భవిష్యత్తు మరియు ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అందుకు, మ్యూచువల్ ఫండ్‌లు లాభదాయకమైన పెట్టుబడి మార్గంగా ఉపయోగపడతాయి, ఇవి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు మరియు మార్కెట్ లింక్డ్ రాబడిని పొందాలనుకునే వారికి తక్కువ ఖర్చుతో లభిస్తాయి. అయితే, మీ డబ్బును మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టాలని ఎంచుకున్నప్పుడు, తెలివైన మరియు ఒక క్రమపద్ధతిని అనుసరించాలి. ముందుగా, అందుబాటులో ఉన్న వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను తెలుసుకోవడం ముఖ్యం. మీ వద్ద ఎంత నిధులు ఉన్నాయి? మీరు మీ నిధులను పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వ్యవధి ఎంత? మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఏమిటి? మీ ఆర్థిక లక్ష్యాలు ఏంటి మరియు మీ లాభం, అలాగే నష్టాన్ని భరించే సామర్థ్యం ఏమిటి?

ప్రాథమిక అంశాలపై నిర్ణయం తీసుకున్న తర్వాత, మీ నిధులను సక్రమంగా నిర్వహించడానికి మీకు, ఈ రంగంలో విస్తృతమైన పరిశోధన మరియు మనీ మార్కెట్‌పై మంచి పరిజ్ఞానం కలిగిన ఒక నిపుణుడు అవసరం. ఫండ్/మనీ మేనేజర్‌లుగా పిలవబడే ఈ నిపుణులు అనేక మ్యూచువల్ ఫండ్ మేనేజ్‌మెంట్ సేవలను అందించడంలో నిమగ్నమైన సంస్థలను కలిగి ఉంటారు మరియు వాటిని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఎఎంసిలు) లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీలుగా పిలుస్తారు. భారతదేశంలోని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చే నియంత్రించబడతాయి.

మ్యూచువల్ ఫండ్స్ అంటే కేవలం రిస్కును భరించడమే అని మీరు భావిస్తున్నట్లయితే, కాదు. వాటి ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసుకోండి. అందులో కొన్ని ఇలా ఉన్నాయి:

  • ప్రాసెస్ పరంగా, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం.
  • పెట్టుబడులను సులభంగా డైవర్సిఫై చేయవచ్చు, ఇది లాభనష్టాలను సమతుల్యం చేయడంలో పెట్టుబడిదారునికి దోహదపడుతుంది. తద్వారా పొంచివున్న రిస్క్ కూడా తగ్గించబడుతుంది.
  • ముఖ్యంగా ఓపెన్ ఎండెడ్ పాలసీలలో మీ పెట్టుబడికి లిక్విడిటీ ఉంటుంది.
  • మీ పెట్టుబడుల గురించిన రెగ్యులర్ సమాచారం మీకు పారదర్శకతను అందిస్తుంది.

సారాంశం: మ్యూచువల్ ఫండ్ అనేది ఒక గొప్ప సామూహిక పెట్టుబడి వాహనం, ఇది పెట్టుబడులను నిర్వహించుకోవడానికి ప్రజలకు మెరుగైన మార్గంలో సహాయం చేస్తుంది. ఇది మనీ మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్, ఇది ట్రేడబుల్ అసెట్‌లలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తుల డబ్బును ఒకచోట చేర్చుతుంది, వీటిని ప్రిన్సిపల్ ఇన్వెస్ట్‌మెంట్, క్లోజర్ టైమ్ మరియు చెల్లింపు యొక్క సమయాల ఆధారంగా అనేక కేటగిరీలుగా విభజిస్తారు. ఈ ఫండ్‌లలో రిస్క్ ఉందని భావించినప్పటికీ, దానితో పాటు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరియు మీ ఫండ్‌లు ఉత్తమంగా నిర్వహించబడితే తగిన ప్రతిఫలం కూడా అందుకుంటారు.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు కేవలం అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించబడతాయి కాబట్టి వాటిని మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా పాఠకుల కోసం నైపుణ్యత గల మార్గదర్శినిగా పరిగణించలేము. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సంబంధిత సమాచారం (చారిత్రాత్మకంగా అదేవిధంగా గురి చూపబడిన) స్వతంత్ర తృతీయ-పక్ష మూలాల నుండి సేకరించబడింది, అది నమ్మదగినదిగా భావించబడుతుంది. ఆర్ఎన్ఎఎం అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణీకరణను స్వతంత్రంగా ధృవీకరించనందున, లేదా ఆ విషయంలో అటువంటి డేటా మరియు సమాచారం ప్రక్రియ జరపబడిన లేదా అంచనా వేసుకున్న ఊహాత్మక అంశాల సమంజసత విషయం కోసం; ఆర్ఎన్ఎఎం ఏ విధంగానైనా సరే అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణీకరణకు హామీ ఇవ్వదు. ఈ విషయ సామాగ్రిలో ఉన్న కొన్ని ప్రకటనలు మరియు వక్కాణింపులు ఆర్ఎన్ఎఎం యొక్క అభిప్రాయాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబించవచ్చు, ఇవి ఉత్తరోత్తరా అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా రూపొందించబడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

​​


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి