సైన్ ఇన్ అవ్వండి

మ్యూచువల్ ఫండ్స్ రకాల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో మీకు తెలుసా? మీ సమాధానం అవును అయితే, ప్రస్తుతం ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ రకాలు అందుబాటులో ఉన్నాయోనన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఇది చాలా అవసరం, ఎందుకనగా ఇది ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు ఫండ్స్‌ను డైవర్సిఫై చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది.

ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్‌ మరియు అన్ని స్కీముల కింద అందుబాటులో ఉన్న అంశాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడు మీరు ఖచ్చితంగా అయోమయంలో పడతారు. పెట్టుబడిదారు కోసం ఎంచుకోవడానికి లెక్కలేనన్ని ఫండ్ స్కీమ్‌లు ఉన్నాయి, కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకోవాలి.

పెట్టుబడి అసెట్ తరగతిని బట్టి మ్యూచువల్ ఫండ్స్ విస్తృతంగా వర్గీకరించబడతాయి.

  • ఈక్విటీలు (లేదా స్టాక్స్): ఇవి మ్యూచువల్ ఫండ్స్ యొక్క అతిపెద్ద వర్గాన్ని సూచిస్తాయి. ఇవి ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ఫండ్‌లు. మరింతగా వర్గీకరించబడిన అవి ఈ విధంగా ఉంటాయి :
    • లార్జ్ క్యాప్: లార్జ్ క్యాప్ ఫండ్స్ బాగా-స్థిరపడిన కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. వీటి స్టాక్ ధరలలో అస్థిరత తక్కువగా ఉంటాయి; అందువల్ల
      అవి తక్కువ రిస్కుతో కూడుకున్నవి.
    • మీడియం మరియు స్మాల్ క్యాప్: ఈ ఫండ్‌లు అనిశ్చిత మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించే చిన్న మరియు మధ్య తరహా కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ
      వృద్ధి చెందుతుంటే ఇవి మెరుగైన రిటర్న్స్‌ను సంపాదించవచ్చు, కానీ లార్జ్ క్యాప్ కంపెనీల కంటే ఎక్కువ రిస్కును కలిగి ఉంటాయి.
    • సెక్టోరల్ ఫండ్స్: ఇవి మౌలిక సదుపాయాలు, ఎఫ్‌ఎంసిజి మొదలైనటువంటి నిర్దిష్ట రంగాల్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్. పోర్ట్‌ఫోలియోలు ఒకే రంగంలో కేంద్రీకృతం అయినందున
      వీటిలో రిస్క్ అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది.
  • స్థిర ఆదాయం (బాండ్లు): ఇవి డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి మొదలైన బాండ్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ఫండ్‌లు. ఇవి పెద్ద సంస్థలకు రుణాలు ఇవ్వడం అనే సరళమైన పెట్టుబడి భావనను అనుసరిస్తాయి.
  • మనీ మార్కెట్ ఫండ్స్ : ట్రెజరీ బిల్లులు, కమర్షియల్ పేపర్ వంటి స్వల్పకాలిక డెట్ సాధనాలను కలిగి ఉన్న మనీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ఫండ్స్. ఇవి చాలా వరకు తక్కువ రిస్కులతో కూడినవి మరియు తక్కువ రిటర్న్స్‌ను కలిగి ఉంటాయి.

కొన్ని ఇతర సంబంధిత ఫండ్ రకాలు:

  • ఇండెక్స్ ఫండ్స్: బిఎస్‌ఇ సెన్సెక్స్ లేదా ఎస్&పి నిఫ్టీ వంటి "ఇండెక్స్" కలిగిన అన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్‌లు. పెట్టుబడి నిష్పత్తి వాటన్నింటిలోనూ సమానంగా ఉంటుంది. ఇవి నిష్క్రియాత్మక పెట్టుబడి వ్యూహాన్ని ఉపయోగిస్తాయి ఎందుకంటే పెట్టుబడి శైలిలో క్రియాశీలమైన స్టాక్ ఎంపిక ఉండదు.
  • క్వాంట్ ఫండ్స్: స్టాక్‌లను ఎంచుకోవడంలో, కంపెనీ యొక్క అంతర్లీన వ్యాపారాన్ని పరిశోధించడానికి బదులుగా, క్వాంటిటేటివ్ పద్ధతులను ఉపయోగించే ఫండ్స్.
    మీరు వాటిలో ఎలా పెట్టుబడి పెట్టవచ్చనే దాని ఆధారంగా ఇక్కడ ఒక వర్గీకరణ ఇవ్వబడింది:
    • క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్: ఒక క్లోజ్డ్-ఎండ్ ఫండ్ పెట్టుబడిదారులను స్కీమ్ ప్రకటించినప్పుడు మాత్రమే అందులోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది మరియు స్కీమ్ ముగిసినప్పుడు మాత్రమే మెచ్యూరిటీకి అనుమతినిస్తుంది. అందువల్ల, దీనికి ఒక నిర్ణీత వ్యవధి (సాధారణంగా 3 నుండి 15 సంవత్సరాల వరకు) ఉంటుంది . క్లోజ్డ్-ఎండ్ ఫండ్‌లు ఎక్స్‌చేంజ్‌లో జాబితా చేయబడినప్పుడు ఇతర స్టాక్‌ల వలె ట్రేడింగ్ చేయబడవచ్చు
      లేదా ఓటీసి (ఓవర్ ది కౌంటర్) రూపంలో ట్రేడ్ చేయవచ్చు
    • ఓపెన్-ఎండ్ ఫండ్స్: ఓపెన్-ఎండ్ ఫండ్ అనేది ఏడాది పొడవునా సబ్‌స్రిప్షన్ / రిడెంప్షన్ కోసం అందుబాటులో ఉన్న ఒక ఫండ్. మరో మాటలో చెప్పాలంటే, ఇది
      పెట్టుబడిదారులను ఏ సమయంలోనైనా పెట్టుబడి పెట్టడానికి మరియు విత్‍డ్రా చేయడానికి అనుమతిస్తుంది.

వచ్చే ఆదాయ విధానాన్ని బట్టి వాటిని వర్గీకరించినప్పుడు, అవి ఈ విధంగా ఉంటాయి:

  • డివిడెండ్ ప్లాన్‌లు, ఇవి పెట్టుబడిదారుకు డివిడెండ్స్ రూపంలో రిటర్న్స్ అందిస్తాయి.
  • గ్రోత్ ప్లాన్‌లు మరొక రకం, ఇవి మీ డబ్బును మీరు విత్‌డ్రా చేసే వరకు పెట్టుబడిగా ఉంచడానికి అనుమతిస్తాయి.

ప్లాన్‌లు లేదా స్కీమ్‌ల ఆధారంగా ఫండ్స్‌ని వర్గీకరించినప్పుడు, అవి ఈ విధంగా ఉంటాయి:

  • రెగ్యులర్ ప్లాన్‌లు మధ్యవర్తులను పరిచయం చేసే ఫండ్స్‌ని కలిగి ఉంటాయి. ఆర్థిక సలహాలు, మొదలైన అదనపు సేవలను కూడా అందిస్తాయి. ఇవి అధిక ఖర్చులతో కూడుకున్నవి.
  • డైరెక్ట్ ప్లాన్‌లు నేరుగా ఎఎంసి నుండి కొనుగోలు చేయబడతాయి మరియు మధ్యవర్తులు లేని కారణంగా తక్కువ ట్రాన్సాక్షన్ ఖర్చులను కలిగి ఉంటాయి.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ పేర్కొనబడిన అంశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి మరియు వీటిని మార్గనిర్దేశకాలు, సిఫారసులు లేదా పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్‌లకు సంబంధించి నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సంబంధిత సమాచారం (చారిత్రక మరియు అంచనా వేయబడినవి) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది మరియు ఇవి నమ్మదగినవిగా పరిగణించబడతాయి. అలాంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను లేదా అలాంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా వాటి కోసం వేయబడిన అంచనాల సహేతుకతను ఆర్ఎన్ఎఎం స్వతంత్రంగా ధృవీకరించదని గమనించాలి; అలాంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు సంబంధించి ఆర్ఎన్ఎఎం ఏ విధంగా హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్‌లో ఉన్న కొన్ని వాక్యాలు మరియు స్టేట్‌మెంట్లు ఆర్‌ఎన్ఎఎం యొక్క ఉద్దేశ్యాలను లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, అవి అలాంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

​​


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి