సైన్ ఇన్ అవ్వండి

వారం యొక్క ఫైనాన్షియల్ టర్మ్- పొడిగించబడిన ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (XIRR)

చివరి ధర నుండి ఖర్చును తీసేస్తే ఆ వచ్చేదే లాభం, ఆ లాభ శాతం ఖర్చుపై లెక్కించబడుతుందని ప్రాథమిక పాఠశాలలో మేము నేర్చుకున్నాము. బాగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆర్థిక పెట్టుబడుల నుండి పొందే రాబడికి ఇది ఇకపై సమర్థవంతమైన కొలత కాదని మేము గ్రహించాము. ఎందుకంటే పైన పేర్కొన్న లాభాల లెక్కింపులో, పెట్టుబడి పెట్టిన మొత్తం, పెట్టుబడి వ్యవధి మరియు రాబడులు స్థిరంగా ఉంటాయని భావించబడుతుంది. అయితే, ఇది నిజం కాకపోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ నుండి రాబడులను మేము కొలవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మొదటిది మేము పైన పేర్కొన్నట్లుగా లాభం మాత్రమే కాకుండా సంపూర్ణ రిటర్న్. మీరు ₹ 5000 పెట్టుబడి పెట్టి, 5 సంవత్సరాల చివరిలో ₹ 10,000 పొందినట్లయితే, మీ పూర్తి రిటర్న్ 100% అవుతుంది. రెండవది కాంపౌండ్ వార్షిక అభివృద్ధి రేటు (CAGR); ఇది మీకు రిటర్న్స్ యొక్క ప్రతినిధి సంఖ్యను ఇవ్వడానికి ప్రతి సంవత్సరం పెట్టుబడుల యొక్క కాంపౌండ్ రిటర్న్స్ ను సగటుగా అందిస్తుంది. కాబట్టి, పైన పేర్కొన్న పెట్టుబడి కోసం CAGR 14.87% (((10000/5000) ^1/5)-1).

మూడవది, రాబడుల యొక్క అత్యంత ప్రభావవంతమైన కొలత, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్‌లోని SIP విషయంలో XIRR. XIRR అనేది ఎందుకు అవసరమో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. మీరు 12 నెలల కోసం ₹ 5000 పెట్టుబడి పెట్టినట్లయితే, 12 నెలల చివరిలో మీ పెట్టుబడి విలువ ₹ 80,000 గా అనుకుందాం. CAGR ఇక్కడ ఎందుకు పని చేయదంటే ప్రతి మొత్తం వేరొక వ్యవధి కోసం పెట్టుబడి పెట్టబడుతుంది. మొదటి ₹ 5000 12 నెలలకు పెట్టుబడి పెట్టబడుతుంది, రెండవది ₹ 5000 11 నెలలకు మరియు అలాగే కొనసాగుతుంది. కాబట్టి, మీకు ఇక్కడ ఖచ్చితమైన రాబడి అవసరమైతే, మీరు ప్రతి ఇన్స్టాల్మెంట్ కోసం CAGRని లెక్కించాలి ఆ తర్వాత వాటిని కూడించాలి. XIRR ఖచ్చితంగా అలా చేస్తుంది.

XIRR ఎలా లెక్కించబడుతుంది?

సులభమైన పదాలలో,

XIRR= అన్ని ఇన్‌స్టాల్‌మెంట్ల సగటు CAGR

IV= పెట్టుబడి విలువ (IV)

FV= తుది విలువ (FV)

N= పెట్టుబడి ఇంటర్వెల్స్ (n)

ఏదైనా పెట్టుబడికి XIRRను మాన్యువల్‌గా లెక్కించడానికి మేము దానిని అర్థం చేసుకున్నాము. ముఖ్యంగా మీరు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని ప్రాముఖ్యత మరియు అవసరాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

XIRR లెక్కించడానికి సులభమైన మార్గం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఇది దానిని లెక్కించడానికి ఒక ఇన్‌బిల్ట్ ఫార్ములాను ఉపయోగిస్తుంది.

మేము పైన పేర్కొన్న అదే ఉదాహరణను తీసుకోవడం-

ఫార్ములా XIRR (విలువలు, తేదీలు, గెస్) = XIRR (B2:B14, A2:A14) = 67.91%

తేదీ కాలమ్‌లోని చివరి సెల్ అనేది మీరు XIRR లెక్కించే తేదీ మరియు వాల్యూ కాలమ్‌లో ఉన్నది ఆ నిర్దిష్ట తేదీన మీ పెట్టుబడి యొక్క మెచ్యూరిటీ విలువ. అదే పెట్టుబడి కోసం సంపూర్ణ రాబడి 33.33% ఉంటుందని మేము సూచించాలనుకుంటున్నాము. మీరు చూస్తున్నట్లయితే, సంపాదించిన రాబడులకు XIRR మీకు మరింత ఖచ్చితమైన మరియు సమగ్ర చర్యను అందిస్తుంది.

చివరగా-

మీరు సరైన పెట్టుబడి మార్గంలో ఉన్నారా లేదా అని అర్థం చేసుకోవడానికి CAGR, XIRR వంటి చర్యలను మీరు ఉపయోగించవచ్చు. వాస్తవానికి, ఇది కేవలం మ్యూచువల్ ఫండ్స్ కోసం మాత్రమే కాక, పెట్టుబడి మొత్తం స్వభావంలో లేని ఏదైనా పెట్టుబడి కోసం రాబడిని లెక్కించడానికి మీరు ఈ చర్యను ఉపయోగించవచ్చు.


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి