సైన్ ఇన్ అవ్వండి

మ్యూచువల్ ఫండ్‌ను విశ్లేషించడానికి దశలవారీ గైడ్

షాపింగ్ చేసేటప్పుడు మనలో చాలా మంది చాలా సమయం వెచ్చిస్తారు. అనేక ఎంపికలు ఉన్నప్పుడు ఇది గందరగోళంగా ఉంటుంది; ఇది జీవితంలోని దాదాపు అన్ని అంశాలలో ఉంటుంది. దుస్తుల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ఇల్లు వెతికేటప్పుడు లేదా పెట్టుబడులు చేసేటప్పుడు షార్ట్‌లిస్ట్ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. వీటిల్లో ఒక కష్టాన్ని తగ్గించడానికి ఒక గైడ్ ఇక్కడ ఇవ్వబడింది.

మ్యూచువల్ ఫండ్‌ను ఎలా విశ్లేషించాలో తెలుసుకోండి, తద్వారా మీ పెట్టుబడి ఎంపికలు సులభంగా, మరింత స్పష్టంగా మరియు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి చేస్తారు గనుక తగిన స్కీం ఎంచుకోవడానికి శ్రద్ధగా చేసిన విశ్లేషణ మరియు అవగాహన అవసరం. ఏదైనా మ్యూచువల్ ఫండ్‌ను విశ్లేషించేటప్పుడు పెట్టుబడిదారు పరిగణించగల కొన్ని అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి:

బెంచ్‌మార్క్ ఇండెక్స్ తో పోల్చినప్పుడు పనితీరు

మ్యూచువల్ ఫండ్‌ను విశ్లేషించేటప్పుడు పరిగణించవలసిన మొదటి అంశం దాని బెంచ్‌మార్క్ ప్రకారం స్కీమ్ యొక్క పనితీరు. బెంచ్‌మార్క్ ఇండెక్స్ అనేది సంబంధిత పథకం యొక్క పనితీరును కొలిచే ఒక ప్రామాణికత. బెంచ్‌మార్క్ ప్రదర్శన కంటే మంచి ప్రదర్శన కనబరిచిన మ్యూచువల్ ఫండ్‌ను ఒక మంచి పనితీరు కలిగిన మ్యూచువల్ ఫండ్‌గా పరిగణించవచ్చు.

ఫండ్ యొక్క ట్రాక్ రికార్డ్

ఒక స్కీమ్ యొక్క గత పనితీరు దాని భవిష్యత్ పనితీరుకు హామీ ఇవ్వకపోయినప్పటికీ, చారిత్రాత్మక డేటాను పరిశీలించి గడచిన సంవత్సరాలలో ఫండ్ యొక్క స్థిరత్వం గురించి మంచి అవగాహనను పొందవచ్చు. స్థిరంగా పెరిగే పనితీరు కలిగిన గ్రాఫ్ అనేది వివిధ మార్కెట్ సైకిళ్లలో పెరుగుదల మరియు తగ్గుదలలను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని మరియు దీర్ఘకాలంలో సంపదను సృష్టించగలదని సూచిస్తుంది. అయితే, దీర్ఘకాలం నుండి ఉన్న ఫండ్స్ విషయంలో మాత్రమే ఈ అంశాన్ని విశ్లేషించవచ్చు.

మార్కెట్ క్యాప్ ప్రాధాన్యత

స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (ఎస్ఐడి) మార్కెట్ క్యాప్స్ వ్యాప్తంగా ఫండ్ యొక్క వెయిటేజీని పేర్కొనవచ్చు. కాబట్టి, మీరు లార్జ్ క్యాప్స్ లేదా మిడ్-క్యాప్స్ ఎంచుకోవాలని అనుకుంటున్నా లేదా వాటి మిశ్రమాన్ని చూడాలని అనుకున్నా, ఈ విశ్లేషణ తగిన విధంగా ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.

సమానమైన వాటితో పోలిక

ఒకే కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీముల పనితీరును పరిశీలించడం సరైన నిర్ణయం. మీరు ఒకస్మాల్ క్యాప్ ఫండ్‌ లో పెట్టుబడి చేయాలని అనుకున్నారు, పవర్ వ్యూహాన్ని ఉపయోగించి ఇతర స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే ఫండ్ లక్ష్యం ప్రకారం దాని బెంచ్‌మార్కుతో పోలిస్తే మెరుగైన (ప)పనితీరు, (వ)విస్తృత పెట్టుబడిదారు బేస్, మార్కెట్ సైకిల్స్‌లో అనేక సంవత్సరాల అనుభవం మరియు (ర్) రైట్ సైజ్ కలిగి ఉన్న దానిని ఎంచుకోవచ్చు.

ఎక్స్‌పెన్స్ రేషియో

ఎక్స్‌పెన్స్ రేషియో అనేది ఫండ్స్ నిర్వహించడానికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వసూలు చేసే ఫీజు. ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటే, మీరు మ్యూచువల్ ఫండ్ హౌస్‌కు చెల్లించవలసిన మూలధన లాభాలలోని భాగం తక్కువగా ఉంటుంది. ప్రారంభంలో అవి తక్కువగా అనిపించినప్పటికీ అవి తుది లెక్కింపుకు జోడించబడతాయి మరియు దీర్ఘకాలంలో భారీ మొత్తం రూపంలో కనిపించవచ్చు. అయితే, ఇది మ్యూచువల్ ఫండ్ విశ్లేషణలో ఇది ప్రధాన ప్రమాణం కాకూడదు.

ఓవర్‌ల్యాప్ నిష్పత్తి

ఒకే కంపెనీలలో పెట్టుబడి చేసే రెండు ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం వలన ఎటువంటి ఉపయోగం ఉంటుంది?? ఈ అంచనా కోసం ప్రామాణిక సంఖ్య ఏదీ లేకపోయినప్పటికీ, ఓవర్‌ల్యాప్ రేషియో వీలైనంత తక్కువగా ఉండాలి.

ఇవి కాకుండా, మ్యూచువల్ ఫండ్‌ని అంచనా వేయడానికి షార్ప్ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ లేదా పి/ఇ రేషియో, ఫండ్ మేనేజర్ నిర్వహిస్తున్న ఇతర ఫండ్స్ పనితీరు మొదలైనవి ఉపయోగించబడతాయి. ఒక ఆర్థిక సలహాదారు సహకారం తీసుకోవడం కూడా తెలివైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది.

కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, కానీ వీటిని అధ్యయనం చేయకుండా పెట్టుబడి పెట్టడం ఇంకా ప్రమాదకరమైనది. మరియు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పనితీరును ఎలా విశ్లేషించాలో మీకు తెలుసు గనుక ఈరోజే మీ జీవిత లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి