సైన్ ఇన్ అవ్వండి

కంటెంట్ ఎడిటర్



మ్యూచువల్ ఫండ్స్‌లోని స్టాంప్ డ్యూటీ గురించిన సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి

స్టాంప్ డ్యూటీ వర్తించే ట్రాన్సాక్షన్ రకాలు ఏంటి?

మ్యూచ్యువల్ ఫండ్ స్కీమ్ యొక్క యూనిట్లపై స్టాంప్ డ్యూటీ అనేది కొనుగోళ్లు, SIP వాయిదాలు (వర్తించే తేదీకి ముందు రిజిస్టర్ చేయబడిన ప్రస్తుత SIPలు సహా), స్విచ్-ఇన్లు, STP స్విచ్-ఇన్లు (వర్తించే తేదీకి ముందు రిజిస్టర్ చేయబడిన ప్రస్తుత STPలతో సహా), డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్లు డివిడెండ్ ట్రాన్స్ఫర్ / స్వీప్ ట్రాన్సాక్షన్లు (టార్గెట్ స్కీంలో) మరియు ఇటువంటి ఇతర ప్రత్యేక ప్రోడక్టులకు వర్తిస్తుంది. పైన పేర్కొన్న దానికి వర్తించే రేటు 0.005%గా ఉంటుంది.

ఒక డీమ్యాట్ అకౌంట్ నుండి మరొక డీమ్యాట్ అకౌంట్‌కు యూనిట్ల ట్రాన్సఫర్‌ మార్కెట్ బదిలీలు మొదలైన వాటితో సహా యూనిట్ల ట్రాన్సఫర్‌లపై స్టాంప్ డ్యూటీ కూడా వర్తిస్తుంది. అటువంటి ట్రాన్సఫర్‌లకు‌ వర్తించే రేటు 0.015% ఉంటుంది, ఇది డిపాజిటరీలు వసూలు చేస్తాయి.

స్టాంప్ డ్యూటీ కింద ఏ మ్యూచువల్ ఫండ్ స్కీంలు కవర్ చేయబడతాయి?

అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీంలు (ETF స్కీంలతో సహా) స్టాంప్ డ్యూటీ ఛార్జీల కింద కవర్ చేయబడతాయి.

వర్తించే స్టాంప్ డ్యూటీ రేట్లు అంటే ఏమిటి?

వర్తించే స్టాంప్ డ్యూటీ రేట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి-

యూనిట్ల కొనుగోలు/కేటాయింపులకు
0.005%
యూనిట్ల బదిలీ (డిపాజిటరీ ద్వారా విధించబడుతుంది)0.015%

భౌతిక పద్ధతిలో నిర్వహించబడిన యూనిట్లకు స్టాంప్ డ్యూటీ వర్తిస్తుందా?

అవును, భౌతిక పద్ధతికి కూడా స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది.

గత SIP వాయిదాలకు ఏమి జరుగుతుంది? రిట్రోస్పెక్టివ్ స్టాంప్ డ్యూటీ వసూలు చేయబడుతుందా?

లేదు, 1 జూలై, 2020 నుండి ట్రిగ్గర్ చేయబడిన కొత్త ట్రాన్సాక్షన్లకు మాత్రమే స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ స్టాంప్ డ్యూటీ ఎలా లెక్కించబడుతుంది?

మీరు రూ 1,00,000 పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం.

ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం: ₹ 1,00,000

ట్రాన్సాక్షన్ మొత్తం: ₹ 100 (వర్తించే విధంగా)

నెట్ ట్రాన్సాక్షన్ మొత్తం: ₹ 99,900

స్టాంప్ డ్యూటీ= (నికర ట్రాన్సాక్షన్ మొత్తం) *0.005/100.005= ₹ 4.994

NAV ₹ 100 (అంచనా) అయితే-

కొనుగోలు చేసిన యూనిట్లు = (నెట్ ట్రాన్సాక్షన్ మొత్తం-స్టాంప్ డ్యూటీ)/ NAV= (99,900-4.994)/100= 998.9 యూనిట్లు

రిడెంప్షన్/స్విచ్ అవుట్స్ వంటి ఇతర ట్రాన్సాక్షన్ రకాలకు స్టాంప్ డ్యూటీ వర్తిస్తుందా?

లేదు, రిడెంప్షన్, స్విచ్ అవుట్స్, STP స్విచ్ అవుట్స్, డివిడెండ్ పే-అవుట్స్‌కు స్టాంప్ డ్యూటీ వర్తించదు. యూనిట్ల సృష్టి ద్వారా మాత్రమే స్టాంప్ డ్యూటీ ఆకర్షించబడుతుంది.

బ్రోకర్ అకౌంట్ నుండి ఇన్వెస్టర్ అకౌంట్‌కు యూనిట్ల ట్రాన్సఫర్‌పై స్టాంప్ డ్యూటీ అనేది వర్తిస్తుందా?

లేదు, ఎందుకంటే యూనిట్ల జారీ సమయంలో, స్టాంప్ డ్యూటీ ఇప్పటికే తీసివేయబడింది.

యూనిట్లను భౌతికంగా డిమాట్ మోడ్‌కు మార్చుకుంటే స్టాంప్ డ్యూటీ వర్తిస్తుందా?

లేదు, యూనిట్లు జారీ చేయబడినప్పుడు ఇప్పటికే స్టాంప్ డ్యూటీ తీసివేయబడుతుంది.

మ్యూచువల్ ఫండ్స్‌పై స్టాంప్ డ్యూటీ వర్తించని సందర్భాలు ఏంటి?

1.రిడెంప్షన్, STP స్విచ్-అవుట్స్, డివిడెండ్ పే-అవుట్స్ లేదా స్విచ్-అవుట్‍‌లు

2.పెట్టుబడిదారు ఖాతాకు బ్రోకర్- యూనిట్ల ట్రాన్స్ఫర్

3.డీమ్యాట్ యూనిట్లకు భౌతిక యూనిట్లు- కన్వర్షన్

మేము అభివృద్ధి నుండి డివిడెండ్ ప్లాన్‌కు యూనిట్‌లను మార్చినట్లయితే దానికి బదులుగా స్టాంప్ డ్యూటీ వర్తిస్తుందా?

అవును. అదే స్కీంలో యూనిట్లను మార్చేందుకు ఇది వర్తిస్తుంది. ఇది డైరెక్ట్ మరియు రెగ్యులర్ ప్లాన్ రెండింటికీ వర్తిస్తుంది.

డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్‌పై స్టాంప్ డ్యూటీ ఎలా లెక్కించబడుతుంది?

డివిడెండ్ మొత్తంపై స్టాంప్ డ్యూటీ మినహాయించబడుతుంది (TDS లేకుండా, ఒకవేళ ఉంటే) అలాగే బ్యాలెన్స్ మొత్తం యూనిట్లను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది.

క్లెయిమ్ చేయబడని స్కీంలో కేటాయించబడిన యూనిట్‌లపై స్టాంప్ డ్యూటీ వర్తిస్తుందా?

అవును, కొత్త యూనిట్ సృష్టించబడిన కారణంగా, క్లెయిమ్ చేయబడని స్కీంకు స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది.

మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో స్టాంప్ డ్యూటీ చూపించబడుతుందా?

అవును, వర్తించే ప్రతి ట్రాన్సాక్షన్‌పై, స్టాంప్ డ్యూటీ మొత్తం SOAలో ప్రదర్శించబడుతుంది.

ఇది ఒక పెట్టుబడిదారుగా మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

స్టాంప్ డ్యూటీ అనేది మ్యూచువల్ ఫండ్ స్కీం యూనిట్‌ల కొనుగోలుపై విధించబడే ఒక వన్-టైమ్ ఛార్జ్. అందువల్ల, పెట్టుబడి వ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే, సాధారణంగా దాని ప్రభావం తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే, తక్కువ పెట్టుబడి హారిజాన్ యొక్క స్కీంలు అధిక ప్రభావాన్ని చూడవచ్చు. లిక్విడ్ ఫండ్స్‌పై స్టాంప్ డ్యూటీ మీ రిటర్న్స్ను ఎలా ప్రభావితం చేస్తుందో అనే ఉదాహరణతో దానిని తెలుసుకుందాం-

నికర పెట్టుబడి మొత్తం₹ 99,900₹ 99,900
స్టాంప్ డ్యూటీ₹ 4.994₹ 4.994
ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం₹ 99,895.006₹ 99,895.006
అంచనా వేయబడిన రిటర్న్4%4%
పెట్టుబడి యొక్క వ్యవధి10 రోజులు30 రోజులు
ROI@ 4% ₹ 109.473₹ 328.421
కొత్త పెట్టుబడి మొత్తం₹ 100,004.478₹ 100,223.426
క్యాపిటల్ గెయిన్104.478323.426
అసలైన రిటర్న్% 3.82% 3.94%

పెట్టుబడి వ్యవధి 10 నుండి 30 రోజుల వరకు పెరిగినందున, అసలైన రిటర్న్% పై ప్రభావం తగ్గించబడింది.






డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి