సైన్ ఇన్ అవ్వండి

₹1 కోటి కార్పస్ నిర్మించడానికి 15x15x15 నియమంకి ఒక సమగ్ర గైడ్

స్టాక్ మార్కెట్లో ప్రబలంగా ఉన్న పెరుగుదల మరియు పతనం అనేక మందిని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఆలోచించేలా చేసింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి అనే హెచ్చరికతో పాటు దీర్ఘకాలంలో 10x లేదా 20x రిటర్న్‌లను అందించే వివిధ రకాల ఫండ్స్ గురించి మీరు వార్తల్లో చదివి ఉంటారు.

వీటన్నింటి మధ్యలో మీరు భారతదేశంలో కోటీశ్వరులు అవ్వడానికి ఏదైనా మార్గం ఉందా అని మీరు ఆలోచిస్తున్నారా? మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో 15x15x15 నియమం గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇందులోని గొప్ప విషయం- మీరు ₹1 కోటి కార్పస్‌ను కూడబెట్టుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. 

15x15x15 నియమాన్ని అర్థం చేసుకోవడంలో మేము మీకు సహాయపడతాము, తద్వారా మీరు దాని నుండి పూర్తి ప్రయోజనం పొందవచ్చు. మేము ఈ భావనను వివరించడానికి ముందు, మీరు కాంపౌండింగ్ శక్తి గురించి కూడా తెలుసుకోవాలి.

కాంపౌండింగ్ శక్తి పోషించే పాత్ర

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులలో కాంపౌండింగ్ అనేది మీరు చిన్న మొత్తాలతో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టినప్పుడు అది గణనీయమైన కార్పస్‌ వృద్ధికి తోడ్పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఒక కాంపౌండింగ్ వ్యవధిలో సంపాదించిన రిటర్న్స్ అనేవి తదుపరి కాంపౌండింగ్ వ్యవధిలో రిటర్న్స్ సంపాదిస్తాయి మరియు అది అలాగే కొనసాగుతుంది. ఈ ఉదాహరణను పరిశీలించండి -

మీరు 15 సంవత్సరాల పాటు మ్యూచువల్ ఫండ్‌‌లో నెలకు ₹15,000 పెట్టుబడిగా పెట్టాలని ఎంచుకున్నప్పుడు, అది 15% చొప్పున రిటర్న్స్ సంపాదిస్తుందని అంచనా వేయబడింది. అయితే, చక్రవడ్డీ లెక్కల ప్రకారం మీరు 15 సంవత్సరాల తర్వాత స్వీకరించే మొత్తం ~₹1 కోటి కాగా, అదే కాంపౌండింగ్ సూత్రం మరో 15 సంవత్సరాలకు వర్తింపజేసినప్పుడు పూర్తి కార్పస్‌ మొత్తం ~₹10 కోట్లకు పెరుగుతుంది.

సూచన: ఈ ఉదాహరణ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన 15x15x15 నియమం సారాంశాన్ని కలిగి ఉంది. దానిని వివరంగా చూద్దాం.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం 15x15x15 నియమం గురించిన పూర్తి సమాచారం

15x15x15 నియమం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి ని ఎస్ఐపి మార్గం ద్వారా చేయడానికి ప్రాథమిక నియమాలలో ఒకటి. దీని ప్రకారం మీరు నెలకు ₹15,000 పెట్టుబడిని ఎస్ఐపి ద్వారా ఒక ఈక్విటీ ‌మ్యూచువల్ ఫండ్ లో చేసినట్లయితే, అది సగటున 15% రిటర్న్స్ ఆర్జించే అవకాశం ఉంటే, మీరు 15 సంవత్సరాల్లో కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది (పై ఉదాహరణలో పేర్కొనబడినట్లుగా).

పదిహేను సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి = ₹15,000 x 180 నెలలు = ₹27,00,000

సుమారు లాభం = ₹74,00,000

పాఠం: మీరు ఎంత త్వరగా ఈ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత ఎక్కువ సంపదను కాలక్రమేణా కూడబెట్టుకోవచ్చు.

కాంపౌండింగ్ అనే మ్యాజిక్ నుండి ఎలా ప్రయోజనం పొందాలి

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల గురించిన ఒక సాధారణ సామెత ఈ విధంగా ఉంటుంది - డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది.

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి 15x15x15 నియమం అనుసరించినప్పుడు ఇది నిజమవుతుంది. కాంపౌండింగ్ పవర్ శక్తితో మీ డబ్బు రెట్టింపు ప్రయోజనం పొందుతుంది, అనగా మీ ప్రారంభ మూల ధనం రిటర్న్స్ సంపాదిస్తుంది, ఆ రిటర్న్స్ మరిన్ని రిటర్న్స్ సంపాదిస్తాయి, ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.

కాంపౌండింగ్ శక్తి నుండి ప్రయోజనం పొందడానికి అనుసరించాల్సిన అతి ముఖ్యమైన వ్యూహం దీర్ఘకాలిక పెట్టుబడి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి ఆధారిత పెట్టుబడులతో మీరు ఈక్విటీ మార్కెట్లో పాల్గొనడానికి సులభమైన మార్గాన్ని కూడా పొందుతారు.

ముగింపు

మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి‌ చేసినప్పుడు, మీరు మీ మూల ధనంతో పాటు సమయాన్ని కూడా పెట్టుబడిగా పెడతారు. సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టినప్పుడు ఇది సమయమే డబ్బు అనే వాస్తవాన్ని సూచిస్తుంది. దీర్ఘ-కాలిక పెట్టుబడి పరిధితో మీరు ఒక మెరుగైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు మరియు దీని సహాయంతో ఒక కోటీశ్వరులుగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు 15x15x15 నియమం.

తరచుగా అడిగే ప్రశ్నలు

మ్యూచువల్ ఫండ్స్‌లో 15-15-15 నియమం అంటే ఏమిటి?

ఒక పెట్టుబడిదారు 15 సంవత్సరాలపాటు నెలకు ₹15,000 చొప్పున మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఒక కోటి రూపాయల కార్పస్‌ను కూడబెట్టవచ్చని ఈ నియమం తెలుపుతుంది, ఇక్కడ కాంపౌండింగ్ శక్తి ఆధారంగా 15% సగటు రాబడిని పొందవచ్చు.

కాంపౌండింగ్ అంటే ఏమిటి?

కాంపౌండింగ్ ప్రధానంగా, ప్రారంభ పెట్టుబడుల విలువను మరింత పెంచడానికి తిరిగి పెట్టుబడిగా పెట్టబడిన రిటర్న్స్‌ని ఉత్పత్తి చేసే అసెట్ యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది మీ సంపదను వేగంగా వృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 సంవత్సరాలలో నేను కోటీశ్వరునిగా ఎలా మారగలను?

మీ ప్రస్తుత ఆదాయం మరియు రిస్క్ విముఖతను బట్టి, మీరు ఎస్ఐపి ద్వారా సరైన ఫండ్స్‌లో డబ్బును పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించడానికి మరియు మీ పెట్టుబడులను ₹1 కోటి లేదా అంతకంటే ఎక్కువగా వృద్ధి చేసుకోవడానికి 15x15x15 నియమాన్ని అనుసరించవచ్చు.

​​
డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి