సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

 కంటెంట్ ఎడిటర్

కాంపౌండ్ వడ్డీ కాలిక్యులేటర్

వృద్ధి కోసం మనమందరం కృషి చేస్తాము, అది ఆర్థిక వృద్ధి కావచ్చు లేదా వృత్తిపరమైన వృద్ధి కావచ్చు. వ్యక్తిగత స్థాయిలో ప్రతి ఒక్కరికీ వృద్ధి భిన్నంగా ఉన్నప్పటికీ, మన పెట్టుబడుల ద్వారా విశేష స్థాయిలో ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు. కాంపౌండింగ్ వలన ఇది సాధ్యమవుతుంది!

అసలు మొత్తం (₹)
వడ్డీ రేటు (% సంవత్సరానికి)
వ్యవధి (సంవత్సరాలలో)
కాంపౌండ్ ఇంటర్వెల్
  • అసలు అమౌంట్

  • వడ్డీ రేటు (% సంవత్సరానికి)

  • వ్యవధి

పూర్తి మెచ్యూరిటీ మొత్తం

pic

ప్రతి ఒక్కరికీ దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. మీ డబ్బు వృద్ధి అనేది మీ పెట్టుబడులపై వచ్చిన రాబడులపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కాంపౌండింగ్ శక్తి ఉపయోగపడుతుంది.

కాంపౌండింగ్ మీ డబ్బును అనేక రెట్లు పెంచుతుంది. సులభమైన పదాలలో చెప్పాలంటే, కాంపౌండింగ్ అనేది కాంపౌండింగ్ వడ్డీ. ఇది వడ్డీ/రిటర్న్స్ ని అసలు మొత్తంతో పాటు తిరిగి పెట్టుబడి చేసి మీ పెట్టుబడి యొక్క విలువను పెంచుతుంది. మీ డివిడెండ్లు లేదా మీ అసలు పెట్టుబడి మొత్తం పై సంపాదించిన వడ్డీ ఆదాయాన్ని తిరిగి పెట్టుబడి చేయడం ఇందులోని కీలక అంశం.

కాంపౌండింగ్‌తో, అసలు మొత్తంలో పెరుగుదలతో ఆర్‌ఒఐ (పెట్టుబడిపై రాబడి) పెరుగుతుంది. పెరుగుతున్న కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీతో ఆర్‌ఒఐ - నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ-వార్షికంగా, లేదా వార్షికంగా మరింత పెరుగుతుంది. ఉదాహరణకు, మీరు సంవత్సరానికి 15% సగటు వార్షిక రిటర్న్స్‌తో ₹1,00,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పుడు, మూడు సంవత్సరాల తర్వాత, రిడెంప్షన్ వద్ద మీ పెట్టుబడి విలువ ₹1,55,545 ఉంటుంది.

అందువల్ల, కాంపౌండింగ్ శక్తి వేగవంతమైన రేటుతో మీ సంపదను పెంచుకోవడానికి సహాయపడుతుంది. కాంపౌండింగ్ స్థాయిని తెలుసుకోవడానికి, మీరు కాంపౌండింగ్ కాలిక్యులేటర్ యొక్క శక్తిని ఉపయోగించవచ్చు.

కాంపౌండ్ వడ్డీ కాలిక్యులేటర్

మీరు అవసరమైన విలువలను ఎంటర్ చేసిన తర్వాత, కాంపౌండ్ వడ్డీ కాలిక్యులేటర్ మీ ఫలితాలను సెకన్లలో లెక్కిస్తుంది. అందువల్ల, ఒక కాంపౌండింగ్ కాలిక్యులేటర్ వేగవంతమైన మరియు సమయం ఆదా చేసే సాధనం, ఎందుకంటే మీరు ఇకపై కష్టమైన మాన్యువల్ లెక్కింపులను చేయవలసిన అవసరం లేదు.

సంక్షిప్తంగా, ఒక కాంపౌండ్ వడ్డీ కాలిక్యులేటర్ నిర్ణీత సంఖ్యలో పీరియాడిక్ పెట్టుబడులు లేదా ఏకమొత్తం పెట్టుబడి తరువాత నిర్దేశించబడిన వ్యవధిలో ఇవ్వబడిన రిటర్న్ రేటు వద్ద మీ పెట్టుబడుల విలువను లెక్కిస్తుంది. ఒక కాంపౌండింగ్ కాలిక్యులేటర్ అనేది పెట్టుబడి ప్లానింగ్ కోసం ఒక అనివార్యమైన సాధనం.

నిరాకరణ: పై ఫలితాలు కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకత కోసం మాత్రమే. వివరణాత్మక సూచన కోసం దయచేసి ఒక ప్రొఫెషనల్ సలహాదారును సంప్రదించండి. ఈ లెక్కింపులు అనేవి, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు/ రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత సెక్యూరిటీ యొక్క భవిష్యత్తు రాబడికి సంబంధించిన ఎలాంటి తీర్పులపై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రాబడులు మరియు/లేదా మూలధన భద్రతపై వాగ్దానంగా భావించబడకూడదు. కాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించిన గణనలు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎలాంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు కాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. అలాగే, ఈ ఉదాహరణలు ఏదైనా సెక్యూరిటీ లేదా పెట్టుబడి పనితీరును సూచించడానికి ఉద్దేశించబడలేదు. పన్ను పర్యవసానాల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అతను/ఆమె వృత్తిపరమైన పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైనది.

ఇక్కడ అందించబడిన సమాచారం/ఉదాహరణలు సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు అందువల్ల పాఠకుల కోసం మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా డాక్యుమెంట్ సిద్ధం చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అసోసియేట్లు లేదా ప్రతినిధులు ('సంస్థలు మరియు వారి అసోసియేట్స్') అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సముచితత్వం మరియు విశ్వసనీయత కోసం ఎటువంటి బాధ్యతను వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వ్యాఖ్యానాలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులకు స్వతంత్ర ప్రొఫెషనల్ సలహా పొందవలసిందిగా కూడా సలహా ఇవ్వబడుతుంది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వారి అసోసియేట్లు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం నుండి ఉత్పన్నమయ్యే నష్టాల కారణంగా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి