సైన్ ఇన్ అవ్వండి

మ్యూచువల్ ఫండ్స్‌లో అసెట్ కేటాయింపు - ప్రారంభకుల కోసం ప్రాథమిక మార్గదర్శి

ఇన్వెస్ట్‌ చేయడం అనేది సైన్స్ కాదు, అనగా అది అందరికీ ఒకే సత్యం కాదు. మరియు అదే దానిని ఆసక్తికరంగా మరియు అదే సమయంలో గమ్మత్తుగా చేస్తుంది. ముడిపడి ఉన్న ముప్పులు మరియు ఆశించిన రాబడులు అనేవి ఏదైనా ఇన్వెస్టింగ్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉండే రెండు ప్రధాన శక్తులుగా ఉంటాయి. ముప్పులు అనేవి మీరు ఇన్వెస్ట్‌ చేసిన డబ్బును కోల్పోవడానికి సంబంధించినవి. వివిధ రకాల అసెట్ తరగతులు ఈక్విటీ, డెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ మొదలైనవి కావచ్చు; మరియు వీటిలో ప్రతి ఒక్కదానికి దానితో ముడిపడి ఉండే వ్యత్యాసపూర్వక స్థాయి ముప్పు ఉంటుంది. అందువల్ల, ఒక్క అసెట్ తరగతిలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేయడం ముప్పు కావచ్చు ఎందుకంటే ఒకవేళ అది సరిగా నిర్వహించబడకపోతే, మీరు ఇన్వెస్ట్‌ చేసిన డబ్బును కోల్పోవచ్చు.

మీరు ఈ ప్రమాదాలను ఎలా తగ్గిస్తారు? - వివిధ అస్సెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా

ఏ అస్సెట్ క్లాస్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలో మీకు ఎలా తెలుస్తుంది? - సరైన అస్సెట్ కేటాయింపు వ్యూహాన్ని అనుసరించడం ద్వారా

అస్సెట్ కేటాయింపు అంటే ఏమిటి?

అసెట్ కేటాయింపు అనేది మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు పెట్టుబడి పరిధి ప్రకారం వివిధ అసెట్ తరగతులకు మీ డబ్బును కేటాయించే ప్రాసెస్. ఉదాహరణకి, మీ స్వల్పకాలిక లక్ష్యాలు పరిష్కరించబడితే, మరియు పదవీవిరమణ వంటి మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై మాత్రమే మీరు దృష్టి పెట్టాలనుకుంటే, అప్పుడు మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మరింత పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల, చాలా పరిశోధన తర్వాత, మీరు ఈక్విటీ కోసం 70:30 ఆస్తి కేటాయింపును నిర్ణయించవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో డెట్ యొక్క 30% మిగిలిన 70% ద్వారా ఏవైనా నష్టాలు ఏర్పడితే, అది ఆ రిస్కులను తగ్గిస్తుంది. అసెట్ కేటాయింపు మీరు మీ ఆర్థిక లక్ష్యాలను ఎంత సమర్థవంతంగా నెరవేర్చుకుంటారో నిర్ణయిస్తుంది. వాస్తవానికి, మీ రిటర్న్స్‌లో 90% కంటే ఎక్కువ అసెట్ కేటాయింపు నిర్ణయాల ఆధారంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

అసెట్ కేటాయింపు యొక్క భావన కూడా పనిచేస్తుంది ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ భిన్నంగా నిర్వహిస్తుంది. అంటే వాటిలో ఒకటి మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ, మరొకటి సరిగ్గా ప్రదర్శించకపోవచ్చు మరియు దీనికి విరుద్ధంగా ఉండవచ్చు. కాబట్టి, మీ పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్‌డ్‌గా ఉందని తెలుసుకున్న తరువాత, రెండింటిలోనూ పెట్టుబడి పెట్టడం వల్ల అది మీరు ప్రశాంతంగా ఉండడానికి సహాయ పడుతుంది. ప్రత్యేక పరిస్థితులలో మినహాయించి, మీ అసెట్ కేటాయింపు ప్రధమంగా స్థిరంగా ఉండాలి. పైన పేర్కొన్న ఉదాహరణలో, ఈక్విటీ ప్రదర్శన బలహీనంగా ఉన్న కారణంగా అసెట్ కేటాయింపు 60:40 అని మీరు తెలుసుకుంటే, మీరు 70:30కు రేషియోను తిరిగి సరిచేయాలి. ఈ ప్రక్రియను రీబ్యాలెన్సింగ్ అని పిలుస్తారు.

అసెట్ కేటాయింపు మరియు డైవర్సిఫికేషన్ మధ్య వ్యత్యాసం-

తరచుగా మార్చదగిన విధంగా ఉపయోగించబడుతుంది, రెండు భావనలు భిన్నంగా ఉంటాయి. ఏ ఆస్తులను ఎంచుకోవాలి మరియు వాటిలో ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవడం అనేది మొదటిది అయితే, ఆ అస్సెట్ క్లాస్‌లలో డైవర్సిటీని సృష్టించడం అనేది రెండోది. పూర్తి పోర్ట్‌ఫోలియో రిటర్న్‌కు రిస్క్-రిటర్న్ బ్యాలెన్స్‌తో సహాయపడడం మొదటిది అయితే, అస్సెట్ క్లాస్‌లో రిస్క్‌లను బ్యాలెన్స్ చేయడంలో రెండోది సహాయపడుతుంది. ఒకవేళ మీకు డెబ్ట్‌కు 60:40 అస్సెట్ కేటాయింపు ఉన్నట్లయితే. ఇప్పుడు ఈక్విటీ అస్సెట్ క్లాస్‌లో, మీరు సాధించడానికి సిద్ధంగా ఉన్నదాని ఆధారంగా మీరు ఎంచుకోగల వివిధ ఎంపికలు ఉన్నాయి. మార్కెట్ యొక్క అప్స్ మరియు డౌన్స్‌తో మీరు ఎంత సౌకర్యవంతంగా ఉన్నారు అనే దాని ఆధారంగా, మీరు లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, ఈక్విటీ-ఓరియంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా సెక్టారల్ ఫండ్స్ మొదలైన వాటిలో మీ పెట్టుబడులను పంపిణీ చేయవచ్చు. ఈ ప్రక్రియను డైవర్సిఫికేషన్ అని పిలుస్తారు.

అస్సెట్ కేటాయింపు వ్యూహాన్ని ఎలా పొందాలి?

మీ వయస్సు, మీ రిస్క్ ప్రొఫైల్ మరియు మీ పెట్టుబడి హారిజాన్ అనేవి ఎటువంటి ఆస్తి తరగతిలో పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని నిర్ణయించేటప్పుడు పరిగణించవలసిన అత్యంత ముఖ్యమైన అంశాలు.

మీరు వృద్ధి చెందుతున్నప్పుడు ఈక్విటీ నుండి డెబ్ట్‌కు మీ అత్యధిక అస్సెట్‌లను తరలించడం మంచిది. ఒక ముఖ్యమైన నియమంగా, మీరు ఈ నియమాన్ని అనుసరించవచ్చు - 100 నుండి మీ వయస్సుని మినహాయించండి, తద్వారా మిగిలిన నంబర్ మీరు ఈక్విటీలో పెట్టుబడి పెట్టాల్సిన మీ అస్సెట్‌ల యొక్క శాతం. కాబట్టి, మీరు 25 అయితే, మీరు మీ అస్సెట్‌లో 75% ను ఈక్విటీకి కేటాయించవచ్చు, మరియు మీరు 70 అయితే, కేవలం 30% సురక్షితంగా పరిగణించబడుతుంది.

చివరగా-

ఆస్తి కేటాయింపు అనేది మీ ఆర్థిక ప్రయాణంలో వన్-టైమ్ కార్యకలాపం కాదు, కానీ మీ ఆస్తి కేటాయింపు మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే ఇందులో మీరు ఒక ట్యాబ్‌ని ఉంచవలసి ఉంటుంది మరియు ప్రతి కొన్ని సంవత్సరాలకు దీన్ని తనిఖీ చేయవలసి ఉంటుంది.ఇక్కడ వ్యక్తం చేయబడిన వ్యూస్ కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఏలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి లేవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి