సైన్ ఇన్ అవ్వండి

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ - రకాలు, ప్రయోజనాలు మరియు పెట్టుబడి

మీ స్థానిక బహుళ ప్రయోజన దుకాణం ఎలా కిరాణా నుండి కూరగాయలు, స్టేషనరీ వరకు అంతా ఎలా ఉంచుతుందో పరిగణించండి. ఏదైనా ఒక ప్రోడక్ట్‌పైనే ఉన్న మీ దృష్టిని నివారించడానికి షాప్ కీపర్ ప్రయత్నిస్తున్నారు, తద్వారా రిస్కులు తగ్గి అతని ఆదాయాలు సురక్షితంగా ఉంటాయి. ఇటువంటి లాజిక్‌ని అనుసరించడం అనేవి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ స్కీంలు. ఈక్విటీ, డెట్, మొదలైనటువంటి వివిధ అసెట్ తరగతుల్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్. ఎందుకు కాకూడదు ఒక పెట్టుబడిదారుడిగా, ఈక్విటీ వంటి అసెట్ తరగతి అందించే సంపద సృష్టి అవకాశాన్ని కోరుకోవచ్చు మరియు అదే సమయంలో, డెట్ అసెట్ క్లాస్ అందించే తక్కువ-రిస్క్‌ను మీరు కోరుకోవచ్చు. ఏకాగ్రత రిస్క్‌ని నివారించడానికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ స్కీంలు అసెట్ తరగతుల్లో కార్పస్‌ను పంపిణీ చేస్తాయి.

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు డైవర్సిఫికేషన్ మరియు అసెట్ కేటాయింపు ఆధారంగా ఉంటాయి. ఆస్తి కేటాయింపు అనేది మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు పెట్టుబడి పరిధి ప్రకారం వివిధ ఆస్తి తరగతులకు మీ డబ్బును కేటాయించే ప్రక్రియ. అసెట్ తరగతుల్లో వైవిధ్యం సృష్టించడాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. పూర్తి పోర్ట్‌ఫోలియోకు రిస్క్-రిటర్న్ బ్యాలెన్స్ కోసం ఆస్తి కేటాయింపు మీకు సహాయపడినప్పటికీ, అసెట్ తరగతిలో రిస్క్‌లను బ్యాలెన్స్ చేయడానికి డైవర్సిఫికేషన్ సహాయపడుతుంది. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీంలు ఈ రెండు భావనలను కలుపుతాయి మరియు ఒక పెట్టుబడిదారునికి ఈక్విటీ మరియు డెట్ ప్రపంచాల ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా కలిగి ఉంటాయి.

ప్రధానంగా, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీంలు ఈక్విటీ మరియు డెట్ సెక్యూరిటీలను కలిగి ఉంటాయి. బంగారం మొదలైన ఇతర అసెట్ తరగతుల్లో కూడా కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టవచ్చు.

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీంల రకాలు

Conservative Hybrid Funds - Nippon India Mutual Fund Balanced Hybrid Fund - Nippon India Mutual Fund Aggressive Hybrid Fund - Nippon India Mutual Fund Multi Asset Allocation Fund - Nippon India Mutual Fund Equity Savings Fund - Nippon India Mutual Fund Dynamic Asset Allocation / Balanced Advantage Funds Arbitrage Fund - Nippon India Mutual Fund

గమనిక: 6 అక్టోబర్ 2017 తేదీన 'వర్గీకరణ మరియు మ్యూచువల్ ఫండ్ స్కీంల నిర్వహణ' పై SEBI సర్కులర్ ప్రకారం పైన పేర్కొన్న హైబ్రిడ్ స్కీంలు పరిగణించబడ్డాయి

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రయోజనాలు

  1. ఒకే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో అనేక అసెట్ తరగతులకు యాక్సెస్‌ను మీరు పొందుతారు
  2. మీ రిస్క్ అప్పిటైట్ మరియు అసెట్ తరగతులకు ప్రాధాన్యత ఆధారంగా, మీరు మీ అవసరాలకు సరిపోయే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీంని ఎంచుకోవచ్చు
  3. ఈక్విటీ మరియు డెట్ అసెట్ క్లాసెస్ మధ్య మీ రిస్కులను విభిన్నం చేయడానికి వారు మీకు ఒక అవకాశాన్ని ఇస్తారు
  4. అవి మీకు కేవలం అసెట్ కేటాయింపు మాత్రమే కాకుండా, డైవర్సిఫికేషన్ కూడా అందిస్తాయి

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీంలలో ఎవరు పెట్టుబడి పెట్టాలి?

మొదటిసారి పెట్టుబడి చేసే వారికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు మ్యూచువల్ ఫండ్ ప్రపంచంలో ఒక మంచి ప్రవేశ పాయింట్ కావచ్చు. డెట్ భాగం స్థిరత్వాన్ని అందించవచ్చు మరియు అదే సమయంలో ఈక్విటీ ఎక్స్‌పోజర్ మీకు సంపద సృష్టి అవకాశాన్ని ఇవ్వవచ్చు. వివిధ అసెట్ తరగతుల్లో ఎక్స్‌పోజర్ కోసం చూస్తున్న పెట్టుబడిదారులు లేదా పదవీవిరమణ పొందిన వ్యక్తులు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీంలలో పెట్టుబడి పెట్టడాన్ని కూడా పరిగణించవచ్చు.

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను

డొమెస్టిక్ ఈక్విటీ షేర్‌లో 65% లేదా అంతకంటే ఎక్కువ కేటాయింపు ఉన్న హైబ్రిడ్ ఫండ్‌ని పన్ను ప్రయోజనాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌గా పరిగణిస్తారు, మరియు మిగిలినవి అన్నీ ఈక్విటీ ఫండ్స్ కాకుండా అన్యమైనవిగా పరిగణిస్తారు.

ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీంకు పన్ను ఈ కింద పేర్కొన్న విధంగా ఉంది-

షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) పన్ను- ఒకవేళ పెట్టుబడిదారు ద్వారా సంపాదించబడిన తేదీ నుండి 12 నెలల కంటే తక్కువ కాలం పాటు నిర్వహించబడితే, అటువంటి లాభం 15% రేటు వద్ద పన్ను విధించబడుతుంది.

లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్ను- ఒకవేళ ఒక పెట్టుబడిదారు ద్వారా అక్విజిషన్ తేదీ నుండి 12 నెలల కంటే ఎక్కువ వ్యవధిపాటు నిర్వహించబడితే, అటువంటి లాభం @ 10% వద్ద పన్ను విధించబడుతుంది. ఖర్చు యొక్క గ్రాండ్ ఫాదరింగ్ యొక్క అదనపు ప్రయోజనంతోపాటు రూ. 1 లక్షల థ్రెషోల్డ్ పరిమితి అందుబాటులో ఉంది.

ఇంకా, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ STTకు లోబడి ఉంటాయి (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను).

ఈక్విటీ కాకుండా ఇతర మ్యూచువల్ ఫండ్స్ స్కీం పన్ను క్రింది విధంగా ఉంది-

షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) పన్ను- ఒకవేళ పెట్టుబడిదారు ద్వారా సంపాదించబడిన తేదీ నుండి 36 నెలల కంటే తక్కువ కాలం పాటు ఉన్నట్లయితే, అటువంటి లాభం పెట్టుబడిదారునికి వర్తించే పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధించబడుతుంది.

లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టిసిజి) ట్యాక్స్- ఒకవేళ పెట్టుబడిదారు పెట్టిన యూనిట్లు స్వాధీనం చేసుకున్న తేదీ నుండి 36 నెలల కంటే ఎక్కువ కాలం పాటు నిర్వహించినట్లయితే నివాస పెట్టుబడిదారుల కోసం అటువంటి లాభం పై 20% (ఇండెక్సేషన్‌తో) పన్ను విధించబడుతుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం కొనుగోలు ధర ద్రవ్యోల్బణం ప్రభావాన్ని లెక్కించడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా అసలు పెట్టుబడి విలువ కంటే ఇండెక్స్‌డ్ పెట్టుబడి విలువతో లాభాలు లెక్కించబడతాయి. ద్రవ్యోల్బణ సూచిక ధర (సిఐఐ) అనేది ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రకటించబడుతుంది మరియు ఈ విలువను నిర్ణయించడానికి ఇది ఉపయోగించబడుతుంది.


డిస్‌క్లెయిమర్:
పెట్టుబడిదారుల కోసం ఉపయోగకరమైన సమాచారం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరూ ఒక వన్-టైమ్ కెవైసి (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాలి. పెట్టుబడిదారులు 'మధ్యవర్తులు/మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలు' కింద సెబీ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడటానికి రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్‌లతో మాత్రమే లావాదేవీలు చేయాలి. మీ ఫిర్యాదుల పరిష్కారం కోసం, దయచేసి www.scores.gov.in ని సందర్శించండి. కెవైసి గురించి మరింత సమాచారం కోసం, వివిధ వివరాలలో మార్పు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం mf.nipponindiaim.com/investoreducation/what-to-know-when-investingని సందర్శించండి. ఇది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభించబడిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం.

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భాష డిస్‌క్లెయిమర్:
ఈ ఆర్టికల్‌ను ప్రాంతీయ భాష(ల)లోకి అనువదించడంలో తగు జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ, ఏదైనా అస్పష్టత లేదా అభిప్రాయ భేదాలు ఉంటే, ఆంగ్ల భాషలో అందుబాటులో ఉన్న కథనమే అంతిమంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆర్టికల్ సాధారణ పఠన ప్రయోజనాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇక్కడ వెల్లడించిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి కావున, పాఠకులు వీటిని మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా/ సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సహచరులు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు దాని అనుబంధ సంస్థలు") ఇలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచార గ్రహీతలు వారి స్వంత విశ్లేషణ, వివరణ మరియు పరిశోధనల పై ఆధారపడాలని సలహా ఇవ్వడమైంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాను పొందాలని సూచించడమైంది. ఈ మెటీరీయల్ తయారీ లేదా జారీలో పాలుపంచుకున్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా, అప్రధానంగా, పర్యావసానంగా, శిక్షణాత్మక మరియు దండనాత్మక నష్టాలకు, ఈ మెటీరీయల్‌లో ఉన్న సమాచారం వల్ల లాభాలకు జరిగిన నష్టంతో సహా ఏ విధంగానూ బాధ్యత కలిగి ఉండరు. ఈ ఆర్టికల్ ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా గ్రహీత మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
"పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ పేర్కొనబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఎలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి ఉండవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
పైకి