Sign In

 Content Editor

డెట్ మ్యూచువల్ ఫండ్స్ రకాలు

మీరు ప్రత్యేకం, అదే విధంగా మీ ఆర్థిక అవసరాలు కూడా అలాంటప్పుడు, మరొకరి కోసం పని చేసిన సూత్రాన్ని మీరు ఎందుకు అనుసరించాలి? మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోకి అవసరం అయిన స్థిరత్వాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అందించగలవు కానీ వివిధ రకాల డెట్ ఫండ్‌లో, మీరు ఒక దానిని ఎలా ఎంచుకుంటారు? మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి పరిధి మరియు మీరు పెట్టుబడి పెడుతున్న ఆర్థిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేయబడుతుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న డెట్ ఫండ్స్ రకాలను చూద్దాం.



ఓవర్‌నైట్ ఫండ్స్
ఈ డెట్ ఫండ్లు ఓవర్‌నైట్ అనగా 1 రోజులో మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. ఏదైనా ఇతర ఫండ్‌తో పోలిస్తే తక్కువ రిస్క్ ఉన్న దానిలో స్వల్ప కాలం పాటు మీ మూలధనాన్ని పెట్టుబడి చేయడమే దీని లక్ష్యం. ఇతర కేటగిరీలతో పోలిస్తే, ఓవర్‌నైట్ ఫండ్లలో వచ్చే రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి.

లిక్విడ్ ఫండ్స్
91 రోజుల వరకు మెచ్యూరిటీ సమయం ఉన్న సెక్యూరిటీలలో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడి పెడతాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌తో పోలిస్తే వాటిలో అధిక రిస్క్ ఉంటుంది, కానీ మీ ఫండ్స్‌ను పెట్టుబడి పెట్టడానికి ఒక సురక్షితమైన ఎంపిక. ఓవర్‌నైట్ ఫండ్స్‌తో పోలిస్తే, రిటర్న్స్ సంపాదించడానికి అవి మీకు మెరుగైన అవకాశాలను అందించవచ్చు.

అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్
కనీసం 3 నెలల పాటు తమ డబ్బును పెట్టుబడి చేయాలనుకునే పెట్టుబడిదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది, లిక్విడ్ ఫండ్స్ కంటే ఈ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ అందిస్తాయి మరియు వీటిలో రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. స్కీం యొక్క పెట్టుబడి లక్ష్యం ప్రకారం క్రెడిట్ రిస్క్ మారవచ్చు.

లో డ్యూరేషన్ ఫండ్స్
మీ డబ్బును 6 నెలల నుండి 1 సంవత్సర కాలం వరకు మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, అప్పుడు లో డ్యూరేషన్ ఫండ్స్ సురక్షితమైన ఎంపిక కావచ్చు. వాటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది మరియు అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ కంటే మెరుగైన రిటర్న్స్ అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి.

మనీ మార్కెట్ ఫండ్స్
కమర్షియల్ పేపర్లు, డిపాజిట్ సర్టిఫికెట్లు, ట్రెజరీ బిల్లులు మొదలైన సెక్యూరిటీలలో మనీ మార్కెట్ ఫండ్స్ పెట్టుబడి పెడతాయి. వీటికి 1 సంవత్సరం వరకు/అంత కంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. అందులో ఉన్న సెక్యూరిటీల క్రెడిట్ నాణ్యత ప్రకారం క్రెడిట్ రిస్క్ మారుతుంది. రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువ ఉన్న పెట్టుబడిదారులకు ఈ ఫండ్ అనుకూలంగా ఉంటుంది.

షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్
షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ స్వల్ప కాలిక మరియు దీర్ఘ కాలిక డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి చేయవచ్చు మరియు వివిధ క్రెడిట్ రేటింగ్‌లలో పెట్టుబడి చేయవచ్చు. పోర్ట్‌ఫోలియో వ్యవధి 1-3 సంవత్సరాల మధ్య ఉండేటట్లు పెట్టుబడి సాధనాలు ఎంచుకోబడతాయి. ఈ వ్యవధిని మెకాలే డ్యూరేషన్ అని పేర్కొంటారు. ఇవి లిక్విడ్ మరియు అల్ట్రా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ డెట్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ అందిస్తాయి, కానీ వాటితో పోలిస్తే అధిక రిస్కును కలిగి ఉంటాయి.

మీడియం/మీడియం నుండి లాంగ్/లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్
ఒక మీడియం డ్యూరేషన్ ఫండ్ యొక్క మెకాలే డ్యూరేషన్ సాధారణంగా 3-4 సంవత్సరాలు, మీడియం నుండి లాంగ్ డ్యూరేషన్ ఫండ్ యొక్క వ్యవధి 4-7 సంవత్సరాలు, మరియు లాంగ్ డ్యూరేషన్ ఫండ్ యొక్క వ్యవధి 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఫండ్స్ పై వడ్డీ రేటు మార్పులు తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకనే, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు వాటి పనితీరు బాగుంటుంది మరియు వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఫలితాలు ఆశాజనకంగా ఉండవు.

ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్ఎంపి లు)
ఇవి స్కీం యొక్క అవధికి సరిపోయే సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే క్లోజ్డ్-ఎండెడ్ ఫండ్స్. మెచ్యూరిటీ కాలం వరకు ఇవి పెట్టుబడులను నిలిపి ఉంచుతాయి. అందువల్ల, వడ్డీ రేటు రిస్క్ తక్కువగా ఉంటుంది, మరియు రిటర్న్స్ ఇతర వాటితో పోలిస్తే మరింత స్థిరంగా ఉంటాయి.

కార్పొరేట్ బాండ్ ఫండ్స్
కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అత్యధిక రేటింగ్ ఉన్న బాండ్లలో పెట్టుబడి పెడతాయి, అంటే పెట్టుబడిలో 80% ఎఎ+ మరియు అంతకంటే ఎక్కువ రేటింగ్ కలిగిన కార్పొరేట్ బాండ్లలో ఉంటాయి. అందువల్ల, వాటితో ముడిపడి ఉన్న క్రెడిట్ రిస్క్ తక్కువగా ఉంటుంది.

క్రెడిట్ రిస్క్ ఫండ్స్
ఇతర వాటితో పోలిస్తే ఇవి అధిక రిస్క్ ఉన్న డెట్ ఫండ్స్, ఎందుకంటే, ఇవి తమ అసెట్స్‌లో కనీసం 65% క్రెడిట్ రేటింగ్ ఎఎ లేదా అంతకంటే తక్కువ ఉన్న సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. అవి తీసుకునే క్రెడిట్ రిస్క్ కారణంగా, ఇతర వాటితో పోలిస్తే అధిక రిటర్న్స్ అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బ్యాంకింగ్ మరియు పిఎస్‌యు ఫండ్స్
పేరు సూచిస్తున్నట్లుగా, ఈ ఫండ్స్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు జారీ చేసిన డెట్ సాధనాలలో మరియు మునిసిపల్ బాండ్లలో వారి అసెట్స్‌లో కనీసం 80% పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్స్ లిక్విడిటీ, రిటర్న్స్ స్థిరత్వం మరియు రిటర్న్స్ విలువ మధ్య ఒక బ్యాలెన్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తాయి.

గిల్ట్ ఫండ్స్
గిల్ట్ ఫండ్స్ తమ అసెట్స్‌లో ప్రధాన భాగం (కనీసం 80%) ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి చేస్తాయి. పెట్టుబడి లక్ష్యం ప్రకారం సెక్యూరిటీలు దీర్ఘకాలం లేదా స్వల్ప కాలం ఉండవచ్చు, మరియు జి-సెక్ లలో పెట్టుబడి కారణంగా వాటిలో తక్కువ క్రెడిట్ రిస్క్ ఉంటుంది. 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడి చేయాలని అనుకున్న పెట్టుబడిదారుల కోసం ఇది అనుకూలం మరియు స్వల్ప కాలంలో అధిక వడ్డీ రేటు రిస్కును కలిగి ఉంటుంది. 10 సంవత్సరాల నిరంతర అవధి ఉన్న గిల్ట్ ఫండ్స్ 10 సంవత్సరాల వద్ద నిరంతర అవధిని నిర్వహిస్తుంది.

డైనమిక్ బాండ్ ఫండ్స్
స్కీం యొక్క పెట్టుబడి లక్ష్యం ప్రకారం డైనమిక్ బాండ్ ఫండ్స్ వివిధ మెచ్యూరిటీలు లేదా సెక్యూరిటీలలో పెట్టుబడి చేస్తాయి. మార్కెట్ అవుట్‌లుక్ ప్రకారం ఏదైనా సెక్యూరిటీలో ఫండ్ మేనేజర్ పెట్టుబడి చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు. దీర్ఘకాలం పాటు పెట్టుబడి చేసే పెట్టుబడిదారుల కోసం ఇది మెరుగైన ఎంపిక మరియు స్వల్ప కాలంలో వడ్డీ రేటు రిస్క్ తీసుకునే వారికి ఉత్తమం. ఇందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా, ఈ స్కీం యొక్క రిటర్న్స్ ఇతర వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి.

ఫ్లోటింగ్ రేట్ ఫండ్
ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ ఫ్లోటింగ్-రేట్ సాధనాలలో వారి ఆస్తులలో కనీసం 65% పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిదారులకు ఫ్లెక్సిబుల్ వడ్డీ ఆదాయాన్ని అందించడమే వారి లక్ష్యం, ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు. అవి సాధారణంగా ఎక్కువ స్థిరంగా ఉంటాయి.

అన్ని డెట్ ఫండ్ రకాలలో, మీ అవసరాలకు తగిన డెట్ ఫండ్‌ను మీరు నిర్ణయించారా? డెట్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడానికి మరియు నేడే మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇక్కడ క్లిక్ చేయండి!

పైన పేర్కొన్న వివరణలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్ఐఎంఎఫ్ యొక్క ఏదైనా స్కీమ్ పనితీరుకు సంబంధించినది కాదు. ఇక్కడ వ్యక్తం చేయబడిన వ్యూస్ కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు రీడర్ అనుసరించదగిన ఏదైనా చర్య, ఏలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులు కలిగి లేవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగించడానికి కాదు. ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు మాత్రమే అభిప్రాయాలు కలిగి ఉంటాయి మరియు అందువల్ల పాఠకుల కోసం మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించబడకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర వనరుల ఆధారంగా డాక్యుమెంట్ సిద్ధం చేయబడింది స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అసోసియేట్లు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అసోసియేట్లు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సముచితత్వం మరియు విశ్వసనీయతకు ఎటువంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వ్యాఖ్యానాలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులకు స్వతంత్ర ప్రొఫెషనల్ సలహా పొందవలసిందిగా కూడా సలహా ఇవ్వబడుతుంది ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగం అయి ఉన్న వ్యక్తులు సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా కోల్పోయిన నష్టాలు సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

Get the app