Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

Content Editor

క్రెడిట్ రేటింగ్‌లను అర్థం చేసుకోవడం

డెట్ ఫండ్స్ గురించిన చర్చలు తరచూ క్రెడిట్ రేటింగ్స్ మరియు క్రెడిట్ రిస్క్‌ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని మీరు గమనించి ఉండవచ్చు. ఇవి ఏమిటో మరియు ఎలా పని చేస్తాయోనని అర్థం చేసుకోవడానికి, మేము ఇక్కడ పూర్తి వివరాలను అందించబోతున్నాము. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక మొదలుపెడదాం!

క్రెడిట్ రేటింగ్స్ అంటే ఏమిటి?

క్రెడిట్ రేటింగ్స్ అనేవి ఏవైనా సంస్థలు తీసుకున్న లోన్ యొక్క రీపేమెంట్ సామర్థ్యాన్ని సూచిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, స్థిర-ఆదాయ సాధనాల ద్వారా మీరు కార్పొరేట్లు, ప్రభుత్వానికి డబ్బును అప్పుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు, వాటిలో ఉన్న రిస్కులను అంచనా వేయడంలో అవి మీకు సహాయపడతాయి. ఇలాంటి రిస్కును క్రెడిట్ రిస్క్ అని పేర్కొంటారు, ఇది పెట్టుబడి కోసం డెట్ ఫండ్స్‌‌ ఎంచుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన నిర్ణయాత్మక అంశాల్లో ఒకటి. ఈ రేటింగ్‌లు వివిధ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ద్వారా నిర్ధారించబడతాయి. క్రెడిట్ యోగ్యత ఆధారంగా రేటింగ్‌లు ఎఎఎ నుండి డి వరకు మారుతూ ఉంటాయి, ఎఎఎ అత్యధిక రేటింగ్‌ను సూచిస్తుంది. క్రెడిట్ రేటింగ్ ఎక్కువగా ఉంటే, రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశాలు ఆ సంస్థకి మెరుగ్గా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

క్రెడిట్ రేటింగ్‌లు ప్రస్తుతం ఎందుకు అవసరం?

ఒక సంస్థ యొక్క క్రెడిట్ రేటింగ్ శాశ్వతం కాదు. అసెస్‌మెంట్ నిరంతరంగా జరుగుతుంది. అందువల్ల, ఏజెన్సీలు ఒక కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసినప్పుడు, కంపెనీకి ఇప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించడానికి మునుపటి కంటే మెరుగైన అవకాశం ఉందని సూచిస్తుంది. బదులుగా, తక్కువ క్రెడిట్ రేటింగ్ అనేది రీపేమెంట్ సామర్థ్యం తగ్గిపోయిందని సూచిస్తుంది.

ఈ సాధనాల యొక్క క్రెడిట్ రేటింగ్‌ను తెలుసుకోవడం మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది

1. ఇది రుణగ్రహీత యొక్క క్రెడిట్ యోగ్యత గురించి మీకు తెలియజేస్తుంది

2. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం మొదలైనవాటిని బట్టి, పెట్టుబడి కోసం తగిన డెట్ ఫండ్‌ను నిర్ణయించడంలో ఇది మీకు సహాయపడుతుంది.

3. తమ క్రెడిట్ రేటింగ్‌ను మెరుగుపరచుకోవడానికి రుణగ్రహీతలు నిరంతరం కృషి చేస్తారు, ఎందుకనగా, ఇది వారి రుణ సామర్థ్యాన్ని పెంచుతుంది.

భారతదేశంలో క్రెడిట్ రేటింగ్‌లు ఎలా నిర్ణయించబడతాయి?

క్రెడిట్ రేటింగ్‌లను నిర్ణయించే ప్రక్రియలో ఒక సంస్థ/కంపెనీ యొక్క సమగ్ర గుణాత్మక మరియు పరిమాణాత్మక విశ్లేషణను పరిగణిస్తారు. ప్రతి ఏజెన్సీకి రేటింగ్‌ను లెక్కించేందుకు దాని స్వంత పద్ధతి ఉండవచ్చు, అందువల్ల, ఫలితాలను సమిష్టిగా చూడాలి. రేటింగ్‌లను నిర్ణయించేటప్పుడు వారు, సంస్థల యొక్క రుణాలు ఇచ్చిన మరియు రుణాలు తీసుకున్న చరిత్ర, ఆర్థిక నివేదికలు, తీసుకున్న లోన్ రకం, వ్యాపార స్వభావం, రాబడి/వ్యయాలు మరియు అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

అయితే, ఈ రేటింగ్‌లు పెట్టుబడిదారులకు సలహా ఇవ్వడానికి కాదు. ఇవి మరింత మంచి నిర్ణయాలు తీసుకోవడంలో పెట్టుబడిదారులకు ఉపయోగపడే సమాచారం మరియు డేటా మాత్రమే అని అర్థం. క్రెడిట్ రేటింగ్ రెండు రకాలుగా ఉంటుంది - స్వల్ప కాలిక మరియు దీర్ఘ కాలిక. లోన్ తీసుకున్న 1 సంవత్సరంలోపు సంస్థ డిఫాల్ట్ అయ్యే అవకాశాన్ని గురించి స్వల్ప కాలిక క్రెడిట్ రేటింగ్ మీకు తెలియజేస్తుంది మరియు దీర్ఘ కాలిక రేటింగ్ సుదీర్ఘ భవిష్యత్తులో డిఫాల్ట్ జరిగే అవకాశాన్ని సూచిస్తుంది.

వివిధ రకాల క్రెడిట్ రేటింగ్‌లు ఏమిటి?

Here

క్రెడిట్ రేటింగ్‌లు మరియు క్రెడిట్ స్కోర్‌ల మధ్య వ్యత్యాసం

రెండింటి మధ్య గల ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మొదటిది ఒక సంస్థ/కంపెనీకి ఇవ్వబడుతుంది, రెండవది వ్యక్తులకు కేటాయించబడుతుంది. క్రెడిట్ రేటింగ్స్ అనేవి కంపెనీలు/వ్యాపారాల క్రెడిట్ యోగ్యతను నిర్ణయిస్తాయి మరియు పైన పేర్కొన్న పట్టికలో చూపిన విధంగా ఎఎఎ నుండి డి వరకు ఉంటాయి. క్రెడిట్ స్కోర్ అనేది ఒక సంఖ్య, సాధారణంగా ఇది 300-700 పరిధిలో ఇండివిడ్యువల్స్‌కు కేటాయించబడుతుంది.

ఈ రెండింటికీ సంబంధించిన విషయం ఏమిటంటే, ఇవి రెండూ ఒక వ్యక్తి యొక్క రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కొలుస్తాయి.

ఇప్పుడు మీకు క్రెడిట్ రేటింగ్స్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, క్రెడిట్ రిస్క్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ప్రారంభించండి Here

ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి

Get the app