ఒక ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటిఎఫ్) అనేది ఒక అంతర్లీన ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఇది ఒక పాసివ్ పెట్టుబడి సాధనం. ఇందులో ఫండ్ అనేది అంతర్లీన ఇండెక్స్ భాగాలలో పెట్టుబడి పెడుతుంది. కాబట్టి, సరళంగా చెప్పాలంటే, ఒక ఈటిఎఫ్ అనేది సెక్యూరిటీల బాస్కెట్ లాంటిది. ఇది ఇండెక్స్ మిశ్రమానికి సరిపోలడానికి ప్రయత్నించడం ద్వారా, వాటి నిష్పత్తి అనేది దాని ఇండెక్స్‌ను పోలి ఉండేలా చూస్తుంది. ఈటిఎఫ్‌లు అనేవి ఇండెక్స్ పనితీరును ట్రాక్ చేస్తాయి కాబట్టి, వాటిని ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా నిర్వహించాల్సిన అవసరం లేదు. వాటి సూచికలను మించి పనితీరు ప్రదర్శించే లక్ష్యం కూడా వాటికి ఉండదు.
ఈటిఎఫ్‌లు అనేవి ఇతర షేర్ లాగానే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ చేయబడతాయి మరియు వాటి ధరలు కూడా స్టాక్ ఎక్స్‌చేంజ్ పని గంటల్లో మారుతూనే ఉంటాయి. ఒక ఈటిఎఫ్ యూనిట్‌ను ఏ ధర వద్ద కొంటారు లేదా అమ్ముతారు అనేది మార్కెట్ ధర మరియు ఎక్స్‌చేంజ్ మీద ఆధారపడి ఏదైనా ఇతర స్టాక్ కొనడం/అమ్మడం కోసం కొనుగోలుదారు మరియు విక్రేత ద్వారా అమలు చేయబడిన అదే మార్కెట్ ధర ఆధారంగానే ఉంటుంది. ఈటిఎఫ్‌లులో పెట్టుబడి పెట్టడానికి మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి.
ఇతర క్రియాశీల మ్యూచ్యువల్ ఫండ్స్తో పోలిస్తే, ఈటిఎఫ్‌లు సాధారణంగా తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియోని కలిగి ఉంటాయి. ఇవి వాటి పరిశోధన మరియు యాక్టివ్ ఫండ్ మేనేజ్‌మెంట్ ఆలోచనల ఆధారంగా స్టాక్ ఎంపిక ప్రక్రియలో భాగం కావాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు కారణం.
వీటి గురించి అర్థం చేసుకోవడం కొంచెం ఎక్కువ కష్టంగా ఉండవచ్చు. కానీ, ఇతర మ్యూచ్యువల్ ఫండ్స్తో పోలిస్తే వీటిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
• సులభంగా ఉపయోగించడం మరియు తక్కువ ధర అనేవి వీటిని ఒక ఆకర్షణీయ పెట్టుబడి సాధనంగా మార్చాయి.
• ఫైనాన్షియల్ మార్కెట్‌లలో మొదటిసారిగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నంలో ఉన్న పెట్టుబడిదారులకు ఇవి మంచి ఎంపిక కాగలవు.
• అంతేకాకుండా, కొన్ని విస్తృత స్థాయి మార్కెట్-ఆధారిత ఈటిఎఫ్‌లు పెట్టుబడిదారుల కోసం పెట్టుబడి పోర్ట్‌ఫోలియో కేంద్రం కూడా రూపొందించగలవు.
ఈటిఎఫ్‌లు ఎలా పనిచేస్తాయి?
ఈటిఎఫ్‌లు నిర్మాణపరంగా ఇతర మ్యూచువల్ ఫండ్స్ లాగే ఉంటాయి. పెట్టుబడి నగదు విస్తరణ వ్యాప్తంగా ఇవి సెక్యూరిటీల (స్టాక్‌లు, బాండ్‌లు, మొదలైనవి) సేకరణ రూపంలో ఉంటాయి. తమ పెట్టుబడికి ప్రతిఫలంగా జారీచేయబడిన యూనిట్‌లు లేదా షేర్లు పొందిన ఇష్టపూర్వక పెట్టుబడిదారులు అందించిన డబ్బు ద్వారా ఈ పూల్ రూపొందించబడుతుంది.
మీరు ఒకే కంపెనీకి సంబంధించిన ఈక్విటీ షేర్లు కొనాలనుకుంటే, ఆ నిర్దిష్ట స్టాక్‌లో మాత్రమే మీకు యాజమాన్య హోదా ఉంటుంది. అయితే, అదే మొత్తాన్ని మీరు ఒక ఈటిఎఫ్‌లో పెట్టుబడి పెడితే, మీరు అనేక విభిన్న స్టాక్‌లు స్వంతం చేసుకోవడంతో పాటు మీ పెట్టుబడి అనేక స్టాక్‌లలో విస్తరించిన కారణంగా, డైవర్సిఫికేషన్ ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది. ఒకే స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎదురయ్యే రిస్క్‌తో పోలిస్తే, దాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఒక ఈటిఎఫ్ ప్రాథమిక నిర్మాణం విస్తృతంగా ఉండగా, ఫండ్స్ అనేవి అనేక రకాలుగా ఉంటాయి.
ఈటిఎఫ్‌ల రకాలు
(ఎ)ఈక్విటీ ఈటిఎఫ్‌లు:
ఎవరైనా ఇటిఎఫ్ అనే పదం పేర్కొన్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే ఫండ్స్ ఇవి. ఎస్&పి బిఎస్ఇ సెన్సెక్స్ లేదా నిఫ్టీ 50; నిఫ్టీ బ్యాంక్ లేదా నిఫ్టీ ఐటి లాంటి సెక్టోరల్ ఇండెక్స్; నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదా నిఫ్టీ 50 వ్యాల్యూ 20 ఇండెక్స్ లాంటి స్ట్రాటజీ ఇండెక్స్ లాంటి ఒక విస్తృత మార్కెట్ స్టాక్ ఇండెక్స్‌ను ఇవి ట్రాక్ చేస్తాయి. అంతేకాకుండా, కొన్ని అంతర్జాతీయ ఇటిఎఫ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. హాంగ్ సెంగ్ లేదా నాస్‌డాక్ 100 లాంటి అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించిన ప్రఖ్యాత ఇండెక్స్‌ను ఇవి ట్రాక్ చేస్తాయి. ఈ ఇటిఎఫ్‌లు అనేవి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్‌లకు పరిచయం చేయడం ద్వారా ఈక్విటీలలో పెట్టుబడి దిశగా మొదటి అడుగు వేయడానికి వారిని అనుమతిస్తాయి. అలాంటి ఒక ఇటిఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, ఒక ప్రఖ్యాత ఇండెక్స్‌లోని అన్ని స్టాక్‌లను స్వంతం చేసుకునే అవకాశం ఇన్వెస్టర్‌లకు లభిస్తుంది మరియు వారు తమ పోర్ట్‌ఫోలియోను ఇండెక్స్-మ్యాచింగ్ రిటర్న్స్ వద్ద (ఖర్చు నిష్పత్తి మరియు ట్రాకింగ్ లోపాలకు లోబడి) పోస్ట్ చేయడంలో ఇవి వారికి సహాయంగా నిలుస్తాయి.
(బి) స్థిర ఆదాయ ఈటిఎఫ్‌లు:
జి-సెక్స్, స్టేట్ డెవలప్‌మెంట్ లోన్లు (ఎస్‌డిఎల్‌లు), గవర్నమెంట్ కంపెనీస్ బాండ్లు, మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్స్ మొదలైనవి లాంటి సెక్యూరిటీలు కలిగిన అంతర్లీన బాండ్ ఇండెక్స్‌ను ఈ ఫండ్స్ ప్రతిబింబిస్తాయి. ఈ సెక్యూరిటీలలో విభిన్నంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా, పోర్ట్‌ఫోలియో అస్థిరతను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడగలవు. ప్రస్తుతం, భారతదేశంలో గల పెట్టుబడిదారులు లిక్విడ్ ఈటిఎఫ్‌లు, గవర్నమెంట్ ఈటిఎఫ్‌లు, మరియు ప్రభుత్వ రంగ కంపెనీల డెట్ ఇష్యూల్లో పెట్టుబడులు పెట్టే ఈటిఎఫ్‌లు కొనుగోలు చేయవచ్చు.
(సి)కమోడిటీ ఈటిఎఫ్‌లు:
ఇన్వెస్టర్‌లు వారి పోర్ట్‌ఫోలియోకు కమోడిటీలు జోడించడానికి ఈ ఫండ్స్ సహాయపడతాయి. ఇవి డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు రూపంలో ఉండవచ్చు, మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఒక కమోడిటీ ధరను ఇవి ట్రాక్ చేస్తాయి. భారతదేశంలో, ప్రస్తుత నియమాలు గోల్డ్ ఈటిఎఫ్‌లు మాత్రమే అనుమతిస్తున్నాయి. గోల్డ్ ఈటిఎఫ్ ద్వారా ఒక ఇన్వెస్టర్ 99.5% స్వచ్ఛత కలిగిన భౌతిక రూప బంగారాన్ని పరోక్షంగా అందుకుంటారు. భౌతిక రూపంలోని బంగారం ధర పనితీరును (ఖర్చు నిష్పత్తి మరియు ట్రాకింగ్ లోపాలకు లోబడి) ట్రాక్ చేయడమే ఇక్కడ లక్ష్యం.
పైన పేర్కొన్న ఈటిఎఫ్‌ల జాబితా సమగ్రమైనది కాదని దయచేసి గమనించండి. ఆర్థిక ఆవిష్కరణల ప్రకారం, మార్కెట్లలో, ప్రత్యేకించి యూరప్ మరియు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక కొత్త ఈటిఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పాసివ్ పెట్టుబడి ప్రయాణం ప్రారంభించడానికి ఈ ప్రాథమిక ఈటిఎఫ్‌లు గొప్ప మార్గంగా ఉంటాయి. ప్రతి ఈటిఎఫ్ రకంలోని రిస్క్‌ను అర్థం చేసుకున్న తర్వాతే, డబ్బు పెట్టుబడి పెట్టాలని సలహా ఇవ్వడమైనది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
ఇక్కడ ఉన్న సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి, కావున వీటిని, పాఠకులకు మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు ఇతర విశ్వసనీయమైన మూలాల ఆధారంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు") అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి, వృత్తిపరమైన నిపుణుల సలహా తీసుకోవాలని పాఠకులకు సలహా ఇవ్వడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో భాగంగా ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పొందిన లాభాలు, నష్టాలతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, అనుకోని, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు బాధ్యత వహించవు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.