Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

ఈక్విటీ ఫండ్స్ గురించిన పూర్తి సమాచారం

వివిధ రంగాలు మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ విభాగాలలో లిస్ట్ చేయబడిన కంపెనీల ఈక్విటీ షేర్‌లలో ఈక్విటీ ఫండ్స్ ప్రాథమికంగా పెట్టుబడి పెడతాయి. ఉద్యోగ విరమణ, మీ పిల్లల యొక్క ఉన్నత విద్య లేదా సంపద సృష్టి వంటి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి దీర్ఘకాలిక పెట్టుబడిని పెట్టాలనే ప్రణాళిక చేస్తున్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడి ఉత్పత్తులలో ఒకటిగా ఈక్విటీ ఫండ్స్ పరిగణించబడతాయి. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి ద్వారా లభించే ప్రయోజనాలను చూద్దాం.దీర్ఘకాలంలో ఉత్తమ పని తీరు ప్రదర్శించే అసెట్లలో ఈక్విటీ ఒకటి: మీ పెట్టుబడి దీర్ఘకాలం ఉంటే ఈక్విటీ అత్యుత్తమ పనితీరు ప్రదర్శించే అసెట్ అని చారిత్రాత్మక డేటా చూపుతుంది. గత 20 సంవత్సరాల్లో, బిఎస్ఇ సెన్సెక్స్ 11.94% రాబడిని ఇచ్చింది, బంగారం 10.32% రాబడిని ఇచ్చింది మరియు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 7.01% వార్షిక రాబడులు ఇచ్చాయి. (మూలం: 23/1/2018 న ముగిసిన వ్యవధి కోసం బిఎస్ఇ ఇండియా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మరియు ప్రముఖ బ్యాంక్ ఎఫ్‌డి రేట్లు)20 సంవత్సరాల క్రితం సెన్సెక్స్‌లో ₹1 లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ప్రస్తుతం ₹9.62 లక్షలకు పెరిగి ఉంటుంది, అయితే బంగారంలో మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టిన అదే మొత్తం ₹7.10 లక్షలు మరియు ₹ 3.89 లక్షలకు పెరిగి ఉంటుంది. (మూలం: బిఎస్ఇ ఇండియా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మరియు ప్రముఖ బ్యాంక్ ఎఫ్‌డి రేట్‌లు 23/1/2018 ముగిసే నాటికి)రిస్క్‌ను డైవర్సిఫై చేయడం: వివిధ రంగాలలో స్టాక్స్ యొక్క విభిన్నమైన పోర్ట్‌ఫోలియో కలిగిన ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు కంపెనీ నిర్దిష్ట రిస్క్‌లు మరియు సెక్టార్ రిస్క్‌లను మరింత ఎక్కువగా డైవర్సిఫై చేయగలుగుతారు. మీరు నేరుగా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు మార్కెట్ రిస్క్‌తో పాటు కంపెనీ మరియు సెక్టార్ రిస్క్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే, మీరు నేరుగా పెట్టుబడి పెడుతున్నట్లయితే, గణనీయమైన పెట్టుబడితో స్టాక్స్ యొక్క విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేక పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించే భావనపై పని చేస్తున్నందున, మీరు చిన్న పెట్టుబడితో కూడా రిస్క్ వైవిధ్యతను సాధించే లక్ష్యంగా పెట్టుబడి పెట్టవచ్చు.ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్: ఈక్విటీ ఫండ్స్ ఫండ్ మేనేజర్(ల) నేతృత్వంలో విశ్లేషకుల బృందం ద్వారా నిర్వహించబడతాయి. ఫండ్ మేనేజర్ నిర్వహించే స్కీమ్ యొక్క ట్రాక్ రికార్డ్ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంది. ఒక పెట్టుబడిదారుగా, మీ పెట్టుబడులపై మెరుగైన రాబడిని పొందడానికి ఫండ్ మేనేజ్‌మెంట్ బృందం యొక్క అనుభవం మరియు నైపుణ్యాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. మూలధన నిర్మాణం, ఆర్థిక పనితీరు, ఆర్థిక రిస్కులు, పోటీ, పరిశ్రమ వృద్ధి కారకాలు మొదలైన విభిన్న అంశాలను జాగ్రత్తగా విశ్లేషించాలి గనుక స్టాక్ ఎంపిక అనేది సంక్లిష్టమైన పని. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఈ సంక్లిష్ట అంశలాను విశ్లేషించడానికి అవసరమైన అనుభవం మరియు నైపుణ్యం కలిగిన రిసెర్చ్ అనలిస్ట్స్ మరియు ఫండ్ మేనేజర్/ల బృందాన్ని నియమించుకుంటాయి.సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ పెద్ద కార్పస్ సృష్టించడానికి సహాయపడుతుంది: మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల ((SIP) ద్వారా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు, ఇది ఒక నిర్దిష్ట రోజున ప్రతి నెల చిన్న మొత్తాలను సేవ్ చేయడానికి సౌకర్యవంతమైన మెకానిజాన్ని అందిస్తుంది. మీరు ఎంచుకున్న నిర్దిష్ట తేదీన ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడుతుంది మరియు మీకు నచ్చిన మ్యూచువల్ స్కీంలో పెట్టుబడి పెట్టబడుతుంది. కొంత కాల వ్యవధిలో ఒకరు చాలా పెద్ద కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.పన్ను ప్రయోజనం: ఆర్థిక బిల్, 2018 01.04.2018 నుండి అమలు అయ్యే విధంగా ₹ 1,00,000 మరియు అంత కంటే ఎక్కువ ఉన్న దీర్ఘకాలిక మూల ధన లాభం పై 10% రాయితీ రేటు వద్ద దీర్ఘ కాలిక ఈక్విటీ ఆధారిత ఫండ్ (12 నెలల కంటే ఎక్కువ ఉన్న పెట్టుబడులు) పై దీర్ఘ కాలిక మూల ధన లాభం పై పన్నును ప్రవేశపెట్టిందిసెక్షన్ 48లోని మొదటి మరియు రెండవ నిబంధనలను ప్రభావితం చేయకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాభాలు గణించబడతాయి అంటే సముపార్జనల వ్యయం మరియు మెరుగుదల ఖర్చుకు సంబంధించి ఇన్‌ఫ్లేషన్ ఇండెక్సేషన్, ఏదైనా ఉంటే అలాగే నాన్-రెసిడెంట్ విషయంలో విదేశీ కరెన్సీలో మూలధన లాభాల గణన యొక్క ప్రయోజనం అనుమతించబడదు.ii) 1 ఫిబ్రవరి, 2018 కు ముందు పన్ను చెల్లించే వ్యక్తి సొంతం చేసుకున్న దీర్ఘకాలిక మూల ధన ఆస్తికి సంబంధించిన స్వాధీన ఖర్చు, దీని కంటే ఎక్కువగా పరిగణించబడుతుంది –a) అటువంటి ఆస్తిని పొందడానికి అయిన అసలు ఖర్చు; మరియుb) వీటిలో తక్కువది –(I) అటువంటి ఆస్తి యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ; మరియు(II) మూలధన ఆస్తి బదిలీ ఫలితంగా అందుకున్న లేదా సంపాదించిన ప్రతిఫలము యొక్క పూర్తి విలువ.ఫెయిర్ మార్కెట్ వాల్యూ నిర్వచనం యొక్క అర్థం ఇది –a) ఏదైనా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌చేంజ్ పై క్యాపిటల్ అసెట్ లిస్ట్ చేయబడిన సందర్భంలో, 31 జనవరి, 2018 తేదీన అటువంటి ఎక్స్‌చేంజ్ పై కోట్ చేయబడిన క్యాపిటల్ అసెట్ యొక్క అత్యధిక ధర. అయితే, 31 జనవరి, 2018 తేదీన అటువంటి ఎక్స్‌చేంజ్ పై అటువంటి అసెట్ లో ఎటువంటి ట్రేడింగ్ లేనప్పుడు, అటువంటి అసెట్ అటువంటి ఎక్స్‌చేంజ్ పై 31 జనవరి, 2018 నాటికి ముందు తేదీన అటువంటి ఎక్స్‌చేంజ్ పై అటువంటి అసెట్ యొక్క ట్రేడ్ చేయబడినప్పుడు దాని యొక్క అత్యధిక ధర ఫెయిర్ మార్కెట్ వాల్యూ అవుతుంది; మరియుb) ఒక వేళ క్యాపిటల్ అసెట్ ఒక యూనిట్ అయి ఉండి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌చేంజ్ పై లిస్ట్ చేయబడని సందర్భంలో, జనవరి 31, 2018 తేదీ నాటికి అటువంటి అసెట్ యొక్క నెట్ అసెట్ వాల్యూ.• స్వల్ప కాలిక (12 నెలల కంటే తక్కువ కాలం ఉన్న పెట్టుబడులు) మూలధన లాభాల పై 15% పన్ను విధించబడుతుంది.ఆర్థిక బిల్లు, 2018 01.04.2018కి అమలు అయ్యే విధంగా ఇఒఎఫ్ ద్వారా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పై వర్తించే విధంగా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్ను @10% వద్ద (స్థూల ప్రాతిపదికన) విధించింది మరియు ఇటువంటి డివిడెండ్లు పెట్టుబడిదారులకు మినహాయించబడతాయిపన్ను విశ్లేషణ, అభిప్రాయాలు, పన్నులకు సంబంధించిన డాక్యుమెంట్లలో వ్యక్తం చేయబడిన ఉద్దేశాలు ఫిబ్రవరి 1, 2018 నాడు పార్లమెంట్లో గౌరవనీయమైన ఆర్థిక మంత్రి ద్వారా సమర్పించబడిన బడ్జెట్ ప్రతిపాదనల ఆధారంగా ఉంటాయి మరియు పేర్కొన్న బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ద్వారా పాస్ చేయబడిన మరియు ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయబడిన సమయంలో మారవచ్చు లేదా భిన్నంగా ఉండవచ్చని గమనించబడాలి. వివరణాత్మక అధ్యయనం కోసం, దయచేసి http://www.indiabudget.gov.in పై అందుబాటులో ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్లను చూడండి"పైన పేర్కొన్న వివరణలు అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది ఏదైనా ఆర్ఎంఎఫ్ పథకం యొక్క పనితీరుకు నేరుగా లేదా పరోక్షంగా సంబంధించినది కాదు. ఇక్కడ వ్యక్తం చేయబడిన ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు పాఠకుడు అనుసరించదగిన ఏదైనా చర్య, ఏలాంటి మార్గదర్శకాలు లేదా సిఫారసులను కలిగి లేవు. ఈ సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పాఠకుల కోసం ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా ఉపయోగపడటానికి కాదు."నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం.


Get the app