మేము పనితీరు గురించి మాట్లాడినప్పుడల్లా, అది ఎల్లప్పుడూ సాపేక్షంగా ఉంటుంది, కాదా? గుర్తుచేసుకోండి, మీ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చినప్పుడు, మీ పనితీరు ఎల్లప్పుడూ మీ పెద్ద తోబుట్టువు లేదా ఇరుగుపొరుగు టాపర్‌తో లెక్కించబడుతుంది. ఈ వ్యక్తులు బెంచ్‌మార్క్‌లు మరియు మీ స్కోర్ వారి స్కోర్‌తో సరిపోల్చబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ బెంచ్‌మార్క్ అనేది పెట్టుబడి లక్ష్యాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్‌ను సరిపోల్చడానికి లేదా అధిగమించడానికి ప్రయత్నించే ఒక సూచిక. ఈ పనితీరుతో సంబంధం ఉన్న ఒక ప్రధాన అంశం అందులో పొంచివున్న రిస్క్. మీరు ఈ రెండింటిలో తగిన ప్రతిభను చూపాలి. కానీ మీరు రిస్క్‌ను ఎలా గుర్తించగలరు? చింతించకండి; సహాయం కోసం మీరు రెడీమేడ్ కొలమానాలను కనుగొనవచ్చు: ఆల్ఫా మరియు బీటా.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్ఫా మరియు బీటా ఏమిటో తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్ఫా అంటే ఏమిటి?
ఆల్ఫా అనేది మీ మ్యూచువల్ ఫండ్ పనితీరును అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే ఒక కొలమానం. ఇది మ్యూచువల్ ఫండ్ పనితీరును ఇండెక్స్‌తో సూచించే ఒక కొలమానం. మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆర్జించిన రాబడులు, నిర్ణీత కాల వ్యవధిలో ఇండెక్స్ ద్వారా సంపాదించిన వాటి కంటే ఎక్కువగా ఉంటే మీరు ఆ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు.
ఆల్ఫా కోసం బేస్‌లైన్ 0. అంటే మ్యూచువల్ ఫండ్ కోసం ఆల్ఫా విలువ 0 అయితే, అది బెంచ్‌మార్క్ ఇండెక్స్‌కు సమానమైన రాబడిని ఆర్జిస్తుంది. 0 కంటే ఎక్కువ విలువ కలిగిన ఆల్ఫా మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ సంపాదిస్తుందని సూచిస్తుంది, అయితే ఆల్ఫా 0 కంటే తక్కువ ఉంటే ఫండ్ ఇండెక్స్‌లో పనితీరు తక్కువగా ఉందని సూచిస్తుంది.
బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అధిగమించిన చరిత్ర ఫండ్‌కు ఉన్నందున, 0 కంటే ఎక్కువ ఆల్ఫా గల ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం అనుకూలంగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో బీటా అంటే ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులలో రిస్క్ అనేది ఒక కీలకమైన కొలమానం. బీటా ఈ ఫీచర్‌ను కొలుస్తుంది మరియు ఫండ్ మీ రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది. బీటా, మ్యూచువల్ ఫండ్ యొక్క అస్థిరతను బెంచ్‌మార్క్ ఇండెక్స్‌తో సరిపోల్చడం ద్వారా లెక్కిస్తుంది. ఇది వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ పనితీరును ట్రాక్ చేస్తుంది మరియు దానికి ఒక విలువను నిర్దేశిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో బీటా బేస్‌లైన్ 1 కి సమానం. 1 కంటే ఎక్కువ బీటా విలువను కలిగిన ఫండ్, బెంచ్‌మార్క్ ఇండెక్స్ కంటే ఎక్కువ అస్థిరతను కలిగి ఉంటుంది. ఇది 1కి సమానం అయితే, ఫండ్ ఇండెక్స్ మాదిరిగా అస్థిరంగా ఉంటుంది. 1 కంటే తక్కువ బీటా విలువ మ్యూచువల్ ఫండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉందని సూచిస్తుంది.
1 కంటే ఎక్కువ బీటా విలువ గల ఫండ్లు ఎక్కువ రిస్క్‌ను కలిగి ఉంటాయి, కానీ అధిక రాబడిని అందించగలవు. ఒకవేళ, అవి మీ రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉంటే మీరు వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఆల్ఫా మరియు బీటా ఎలా లెక్కించబడతాయి?
ఆల్ఫా మరియు బీటా అనేవి క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ (సిఎపిఎం) ఫార్ములాను ఉపయోగించి లెక్కించబడతాయి. అలాగే, సిఎపిఎం అనేది అసెట్‌ల యొక్క రిస్క్-అడ్జస్టడ్ రిటర్న్‌లను లెక్కించడంలో సహాయపడుతుంది. సిఎపిఎం ఉపయోగించే ఆల్ఫా మరియు బీటా ఫార్ములాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
బీటా = (మ్యూచువల్ ఫండ్ రిటర్న్ – రిస్క్ రహిత రేటు (ఆర్ఎఫ్)) / (బెంచ్‌మార్క్ రిటర్న్ – రిస్క్ రహిత రేటు (ఆర్ఎఫ్))
అదేవిధంగా, ఆల్ఫా కోసం ఫార్ములా:
ఆల్ఫా = (మ్యూచువల్ ఫండ్ రిటర్న్ – రిస్క్ రహిత రిటర్న్ (ఆర్ఎఫ్)) – [(బెంచ్‌మార్క్ రిటర్న్ – రిస్క్ రహిత రిటర్న్ (ఆర్ఎఫ్)) * బీటా]
మ్యూచువల్ ఫండ్ యొక్క ఆల్ఫా మరియు బీటాను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడింది. మ్యూచువల్ ఫండ్ ఒక సంవత్సరంలో 20% రిటర్న్స్ అందిస్తుంది అనుకోండి, అయితే బెంచ్‌మార్క్ ఇండెక్స్ 15% అందిస్తుంది. మేము రిస్క్-ఫ్రీ రేటు 10% అని భావిస్తే, బీటా ఈ విధంగా వస్తుంది:
బీటా = (20 - 10) / (15 - 10)
బీటా = 2
ఇది మనం ఊహించిన మ్యూచువల్ ఫండ్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ కంటే రెండు రెట్లు అస్థిరంగా ఉందని సూచిస్తుంది. ఇప్పుడు బీటాను 1 గా భావించి అదే ఫండ్ కోసం ఆల్ఫాను లెక్కిద్దాం.
ఆల్ఫా = (20 – 10) - [ (15 – 10) * 1)
ఆల్ఫా = 10 - 5
ఆల్ఫా = 5
ఇది ఫండ్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అధిగమిస్తుందని సూచిస్తుంది, దీనిని ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారుస్తుంది.
మీ రిస్క్ ప్రొఫైల్, పెట్టుబడి లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్ సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి మీరు ఆల్ఫా, బీటా మరియు ఇతర రిస్క్ ప్రమాణాలను ఉపయోగించవచ్చు. ఈ రెండు సాధనాలు కూడా మీ పెట్టుబడి నైపుణ్యాలను అభివృద్ధి చేయగలవు.
తరచుగా అడిగే ప్రశ్నలు
మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్ఫా మరియు బీటాను ఎలా వివరించాలి?
మ్యూచువల్ ఫండ్‌లలో ఆల్ఫా మరియు బీటా బేస్‌లైన్ విలువ వరుసగా 0 మరియు 1. ఈ బేస్‌లైన్‌కు ఇరువైపులా ఉన్న హెచ్చుతగ్గుల ఆధారంగా మీరు మ్యూచువల్ ఫండ్‌ను ముగించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్ఫా మరియు బీటా యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఆల్ఫా మరియు బీటా అనేవి మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ మరియు ఆశించిన రాబడిని గుర్తించడంలో సహాయపడతాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్ఫా మరియు బీటాను ఎలా లెక్కించాలి?
క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ (సిఎపిఎం) ఫార్ములాను ఉపయోగించి మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్ఫా మరియు బీటాను లెక్కించవచ్చు.
సాధారణ డిస్‌క్లెయిమర్
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు పేర్కొన్న వివరణలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి కావున, వీటిని ప్రత్యేక మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా పాఠకుల కోసం ఉద్దేశించిన నిపుణుల సలహాలుగా పరిగణించకూడదు. ఈ డాక్యుమెంట్ బాహ్య మూలాల నుండి సేకరించిన సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరుల ఆధారంగా తయారు చేయబడింది. స్పాన్సర్లు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") అలాంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, సమగ్రత మరియు విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ విశ్లేషణ, వివరణలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా, ఈ మెటీరియల్‌లోని సమాచారం వల్ల పొందిన ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు, లాభాలకు ఎలాంటి బాధ్యత వహించవు. ఈ సమాచారం ఆధారంగా తీసుకున్న ఏదైనా నిర్ణయానికి స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
గతంలోని పనితీరు భవిష్యత్తులో స్థిరంగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు ఆ ఫలితం ఇతర పెట్టుబడితో పోల్చడానికి తప్పనిసరి ఆధారాన్ని అందించకపోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.