మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? ఇది మొట్టమొదటి సారిగా మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రవేశ పెట్టినప్పుడు, అనగా 25 సంవత్సరాల క్రితం ఎదురైన ప్రశ్న. అయితే, ప్రారంభం నుండి ఇప్పటివరకు, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి పెట్టుబడిదారుల ఆలోచనా విధానం బాగా మెరుగుపడింది. అవి ప్రారంభమైన నాటి నుండి, మ్యూచువల్ ఫండ్స్ అనేక మంది పెట్టుబడిదారుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పెట్టుబడి రూపంగా నిలిచింది. ఇవి చాలా సులభమైనవి, సమయం లేని లేదా పరిమిత జ్ఞానం లేదా పరిమిత స్థాయిలో డబ్బు కలిగిన పెట్టుబడిదారుల కోసం ఇతర గొప్ప ఫీచర్లను కూడా అందిస్తాయి. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఎందుకు గొప్ప ట్రెండ్‌గా మారాయో విశ్లేషిద్దాం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు
ప్రయోజనం #1:
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు లో మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుంది: పెట్టుబడులు ఎల్లపుడూ కొంత అనిశ్చితని కలిగి ఉంటాయి. తగినంత జ్ఞానం మరియు సమయం, స్వీయ క్రమశిక్షణ లేదా పెట్టుబడి అనుభవం లేకపోవడం వలన పెట్టుబడిదారుడు పెట్టుబడి చేయడానికి వెనుకంజ వేస్తారు. ఇటువంటి పరిస్థితులలో మ్యూచువల్ ఫండ్స్ తగినవి. ఎందుకనగా అవి, పెట్టుబడులను నిర్వహించడానికి వృత్తినిపుణుల నైపుణ్యాన్ని ఉపయోగించే విధంగా రూపొందించబడ్డాయి, ఇది పెట్టుబడిదారు ఒత్తిడిని దూరం చేస్తుంది.
ప్రయోజనం #2: మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫికేషన్‌ను అందిస్తాయి: అసెట్ల డైవర్సిఫికేషన్ అనేది పెద్ద మరియు చిన్న వ్యాపారాలకు వర్తించే ఒక నియమం. మిగితా పోర్ట్‌ఫోలియో పై ధర పతనం అయిన స్టాక్ ప్రభావం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది
ఒక మ్యూచువల్ ఫండ్ లేని పెట్టుబడిదారు తన పెట్టుబడి మొత్తాన్ని ఒకటి లేదా రెండు స్టాక్స్‌లో పెట్టుబడిగా చేసి అధిక స్థాయిలో రిస్కును ఎదుర్కొంటారు
ప్రయోజనం #3: మ్యూచువల్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలను అందిస్తాయి: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు దీర్ఘకాలికంగా (12 నెలలు లేదా అంతకంటే ఎక్కువగా) నిర్వహించినప్పుడు మూలధన లాభాలు 7 కోసం అర్హత పొందుతాయి, తదనుగుణంగానే పన్ను విధించబడుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని కూడా కలిగి ఉన్నాయి.
ప్రయోజనం #4: మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీని కలిగి ఉంటాయి:
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో స్టాక్ యొక్క ప్రస్తుత విలువను పొందడానికి ఒక పెట్టుబడిదారునికి ఏ సమయంలోనైనా తన పెట్టుబడిలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రమాణీకరించబడింది, ఇది ఈ విధానాన్ని సమర్థవంతంగా మరియు చాలా త్వరగా పూర్తి చేస్తుంది, తద్వారా పెట్టుబడిదారు వీలైనంత త్వరగా తన నగదును పొందుతారు.
ప్రయోజనం #5: మ్యూచువల్ ఫండ్స్ పారదర్శకంగా ఉంటాయి: మ్యూచువల్ ఫండ్ పనితీరును అనేక ఏజెన్సీలు, ప్రచురణ సంస్థలు మరియు నిపుణులు క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. ఇది పెట్టుబడిదారు వేర్వేరు ఫండ్‌లను ఒకదానితో మరొక దానిని పోల్చడాన్ని సులభతరం చేస్తుంది. ఫండ్‌లో ఒక పెట్టుబడిదారునిగా, ఒక వ్యక్తికి నెలవారీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు, నెలవారి మరియు అర్థ వార్షిక పోర్ట్‌ఫోలియో డిస్‌క్లోజర్ మొదలైనటువంటి సాధారణ అప్‌డేట్‌లు అందించబడతాయి
మూలధన లాభాలు |
| ఏప్రిల్ 01, 2014 నుండి జూలై 10, 2014 వరకు |
|
స్వల్పకాలిక మూలధన లాభాలు (12 నెలల కంటే ఎక్కువ కాకుండా ఉంచబడిన యూనిట్లు) 5 |
దీర్ఘ కాలిక మూలధన లాభాలు (12 నెలల కంటే ఎక్కువ సమయం వరకు ఉంచబడిన యూనిట్లు) 5 |
| ఈక్విటీ స్కీములు | డెట్ స్కీములు (మౌలిక సదుపాయాల డెట్ ఫండ్స్ సహా) 4 | ఈక్విటీ స్కీములు | డెట్ స్కీములు (మౌలిక సదుపాయాల డెట్ ఫండ్స్ సహా) 4 |
నివాస వ్యక్తులు/హెచ్‌యూఎఫ్/ ఏఓపి/బిఓఐ | 15% | స్లాబ్ రేట్ల ప్రకారం | ఏవీ ఉండవు | 10% / 20% ఇండెక్సేషన్‌తో |
దేశీయ కంపెనీలు/సంస్థలు | 15% | 30% | ఏవీ ఉండవు | 10%/ 20% ఇండెక్సేషన్‌తో |
ఎన్‌ఆర్‌ఐలు | 15% | స్లాబ్ రేట్ల ప్రకారం | ఏవీ ఉండవు | జాబితా చేయబడిన యూనిట్లు - 10%/ 20% ఇండెక్సేషన్‌తో జాబితా చేయబడని యూనిట్లు - 10% ఇండెక్సేషన్ లేకుండా 7 |
ఎఫ్‌పిఐలు | 15% | 30% | ఏవీ ఉండవు | 10% ఇండెక్సేషన్ లేకుండా |
| జూలై 11, 2014 నుండి మార్చి 31, 2015 వరకు |
|
స్వల్పకాలిక మూలధన లాభాలు (36 నెలల కంటే ఎక్కువ కాకుండా ఉంచబడిన యూనిట్లు) 5 |
దీర్ఘ కాలిక మూలధన లాభాలు (36 నెలల కంటే ఎక్కువ సమయం వరకు ఉంచబడిన యూనిట్లు) 5 |
| ఈక్విటీ స్కీములు | డెట్ స్కీములు (మౌలిక సదుపాయాల డెట్ ఫండ్స్ సహా) 4 | ఈక్విటీ స్కీములు | డెట్ స్కీములు (మౌలిక సదుపాయాల డెట్ ఫండ్స్ సహా) 4 |
నివాస వ్యక్తులు/హెచ్‌యూఎఫ్/ ఏఓపి/బిఓఐ | 15% | స్లాబ్ రేట్ల ప్రకారం | ఏవీ ఉండవు | 20% ఇండెక్సేషన్‌తో |
దేశీయ కంపెనీలు/సంస్థలు | 15% | 30% | ఏవీ ఉండవు | 20% ఇండెక్సేషన్‌తో |
ఎన్‌ఆర్‌ఐలు | 15% | స్లాబ్ రేట్ల ప్రకారం | ఏవీ ఉండవు | జాబితా చేయబడిన యూనిట్లు - 20% ఇండెక్సేషన్‌తో జాబితా చేయబడని యూనిట్లు - 10% ఇండెక్సేషన్ లేకుండా 7 |
ఎఫ్‌పిఐలు | 15% | 30% | ఏవీ ఉండవు | 10% ఇండెక్సేషన్ లేకుండా |
డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.