Sign In

ఇఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్‌లు కేవలం పన్ను ఆదా ఎంపిక కంటే ఎలా ఎక్కువ?

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఇఎల్‌ఎస్‌ఎస్) ఫండ్స్ అనేవి పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకించిన ప్రధాన ట్యాక్స్-సేవింగ్ పెట్టుబడి ఎంపిక. పన్ను ఆదాతో పాటు, ఇఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే, పన్ను ప్రయోజనం కోసం పెట్టుబడిదారు​లు ప్రాథమి​కంగా ఇఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌ని మాత్రమే ఎంచుకుంటారు.

పన్నుని ఆదా చేయడం పరంగా ఇఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తాయి?

ఇఎల్‌ఎస్‌ఎస్ లో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, మొత్తం పరిమితి ₹ 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కోసం అర్హత పొందుతాయి, ఈ ఫండ్‌లు చివరి-నిమిషంలో మీ పన్ను ప్రణాళికలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి మీకు అనుమతిస్తాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు వర్తించే పన్ను చట్టాలు మరియు నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఒక సంవత్సరానికి అయ్యే పన్నులో కొంత మొత్తాన్ని ఆదా చేయవచ్చు. పన్ను ప్రయోజనాలు అనేవి 2019-20 ఆర్థిక సంవత్సరానికి వర్తించే ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాలు మరియు నిబంధనల ప్రకారం ఉంటాయి. ఇలాంటి స్కీమ్స్‌లో పెట్టుబడి చేయడానికి ముందు పెట్టుబడిదారులు తమ పన్ను సలహాదారుని సంప్రదించాలని సూచించడమైనది.


ఇఎల్‌ఎస్‌ఎస్ ఫండ్ యొక్క పన్ను ప్రయోజ​నాలుకాకుండా, ఇతర ప్రయోజనాలు సాధారణంగా గుర్తించబడవు. ఇఎల్‌ఎస్‌ఎస్ లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే భారీ ప్రయోజనం ఎలా ఉంటుందో ఇక్కడ ఇవ్వబడింది.


ఇఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్‌ని ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?

ఇఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్ మీ నిధులను పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రకమైన ఫండ్స్‌ని తరచుగా నూతన మరియు అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు ఇద్దరూ ఇష్టపడతారు. ఈ గొప్ప పెట్టుబడి ఎంపిక యొక్క కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

  • అతి తక్కువ లాక్-ఇన్ పీరియడ్: ఇఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అనేది కేవలం మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటుంది. పన్ను ప్రయోజనాలను అందించే ఇతర సాంప్రదాయ పెట్టుబడి ప్రోడక్టులతో పోల్చినప్పుడు ఈ వ్యవధి చాలా తక్కువ.
  • కాంపౌండింగ్ ప్రయోజనం: సాధారణంగా ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తారు, ఇది దాదాపు ఐదు-పది సంవత్సరాలుగా ఉంటుంది. అయితే, లాక్-ఇన్ వ్యవధి రీత్యా ఇఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ పెట్టుబడి యొక్క క్రమశిక్షణ విధానాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియలో, దీర్ఘకాలంలో కాంపౌండింగ్ శక్తి నుండి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఇది సహాయపడుతుంది.
  • రిడెంప్షన్: 3 - సంవత్సరాల కాలం తర్వాత రిడెంప్షన్ అనేది తప్పనిసరి కాదు. పెట్టుబడిదారు తన నిర్దిష్ట నిధులతో పెట్టుబడిని కొనసాగించడం కోసం ఎంచుకోవచ్చు. అలాగే, గరిష్ట పెట్టుబడి వ్యవధి అంటూ ఏదీ లేదు
  • వృద్ధి సంభావ్యత: ఇఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెడతాయి, తద్వారా పెట్టుబడి వృద్ధికి అవకాశాన్ని కల్పిస్తాయి.

పైన పేర్కొన్న ప్రయోజనాలు అనేవి దాని పన్ను ప్రయోజనం కంటే కూడా ఇఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్కు చాలా సామర్థ్యం ఉందని తెలియజేస్తాయి. మీ పెట్టుబడులను పెంచుకోవాలనే లక్ష్యంతో మీరు దీర్ఘకాలికంగా వాటిలో పెట్టుబడి పెట్టడం అనేది, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అని అర్థం.

ఇక్కడ వ్యక్తీకరించబడిన విషయాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి, అందువల్ల వీటిని మార్గదర్శకాలు, సిఫారసులు లేదా పాఠకులకు ఒక ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, పాఠకులు స్వయంగా వృత్తిపరమైన నిపుణులను సలహాలను కోరాలని, సమాచార పెట్టుబడి నిర్ణయానికి రావడానికి దాని కంటెంట్‌ని ధృవీకరించాలని సూచించబడుతుంది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం నుండి ఉద్భవించిన లేదా కోల్పోయిన లాభాల ఖాతాతో సహా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app