Sign In

Dear Customer, Due to a scheduled DR activity, IMPS services will not be available on 7th September from 11:30 PM to 12.30 AM. Thank you for your patronage - Nippon India Mutual Fund (NIMF)

గోల్డ్ ఫండ్స్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి?

గోల్డ్ ఫండ్స్ అనేవి గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటిఎఫ్‌లు) లేదా గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌లు) ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టే ఫండ్స్. గోల్డ్ ఈటిఎఫ్‌లు ఎదురులేని పెట్టుబడి సాధనాలు, ఇవి బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి మరియు గోల్డ్ బులియన్‌లో పెట్టుబడి పెడతాయి. గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌లలో పెట్టుబడిని కలిగి ఉండటం అనేది, పరోక్షంగా భౌతిక బంగారు పెట్టుబడులకు ఒక ఎలక్ట్రానిక్ రూపాన్ని అందజేయడాన్ని బహిర్గతం చేస్తుంది. అందువల్ల, ఒక ఆస్తిగా బంగారంలో పెట్టుబడి పెట్టినట్లు పెట్టుబడిదారులు ప్రయోజనాన్ని కూడా అదేవిధంగా పొందవచ్చు.

గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ ఫండ్స్ ఒక అంతర్భాగంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:

స్టోరేజ్ సమస్యలు లేవు:

భద్రత విషయానికి వస్తే సాధారణంగా బంగారంపై పెట్టుబడి పెట్టడం సమస్యగా మారుతుంది. మీరు మీ బంగారు కడ్డీలు, నాణేలు లేదా ఆభరణాలను బ్యాంక్ లాకర్ లేదా ఇంట్లో సురక్షితంగా ఉంచుకోవాలి. బంగారాన్ని బ్యాంకులో భద్రపరచాలని ఎంచుకుంటే, సంబంధిత స్టోరేజ్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. స్టోరేజ్ సమస్యల కారణంగా బంగారం దాని కాంతిని కోల్పోవచ్చు, తద్వారా దాని విలువ తగ్గుతుంది. అయితే, ఈ సమస్యలు గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌లతో సంభవించవు, ఎందుకంటే ఇందులో ఫండ్స్ ఎలక్ట్రానిక్ ఇన్వెస్ట్‌మెంట్‌లు. అయితే, గోల్డ్ ఎఫ్ఓఎఫ్‌‌లు పెట్టుబడి పెట్టే అంతర్లీన స్కీమ్ ఖర్చులకు అదనంగా, పెట్టుబడిదారులు ఈ స్కీమ్ యొక్క రికరింగ్ ఖర్చులను కూడా భరిస్తారు.

పెట్టుబడిదారులు చిన్న మొత్తంతో ప్రారంభించడానికి అనుమతిస్తుంది:

ఎవరైనా గోల్డ్ ఫండ్స్‌లో ఒకేసారి ₹ 500 వంటి చిన్న మొత్తాన్ని లేదా ఎస్ఐపి లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భౌతిక బంగారం కంటే కూడా గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లలో పెట్టుబడి పెట్టడాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. అంతేకాకుండా, బంగారం కొనుగోలు చేయడానికి లేదా దానిపై పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో నగదు ఉండాలి అనే భావనను కొట్టిపారేస్తుంది.

తులనాత్మకంగా తక్కువ అస్థిరత కలిగినవి:

ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందో, మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది మరియు మొదట స్టాక్స్ మాత్రమే ప్రభావితమవుతాయి. ఇప్పుడు కొనసాగుతున్న మహమ్మారి కారణంగా, రాబోయే కొన్ని నెలల వరకు స్టాక్స్ పనితీరు ఆశించినదాని కంటే తక్కువగా ఉండవచ్చు. అలాంటి సమయాల్లో గోల్డ్ ఎఫ్ఓఎఫ్ ల ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది ఒక మంచి ఆలోచన. గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లు ఈక్విటీ మార్కెట్ అస్థిరత నుండి మంచి హెడ్జ్‌గా పనిచేస్తాయి. చరిత్రను గమనిస్తే, స్టాక్స్ తగ్గినప్పుడు, బంగారం ధరలు పెరిగాయి. అందువల్ల, ఫండ్స్‌తో బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది ఈక్విటీ పెట్టుబడులలో ఎలాంటి అస్థిరతను అయినా సమతుల్యం చేస్తుంది.
దయచేసి గమనించండి: గతంలోని పనితీరుకు సూచిక కాదు లేదా భవిష్యత్తు పనితీరుకు హామీ కాదు.

పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్:

పెట్టుబడుల యొక్క బంగారు నియమాలలో ఒకటి గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టడాన్ని నివారించడం. విభిన్నమైన పోర్ట్‌ఫోలియో సాధారణమైన దాని కంటే మెరుగైన ఆర్థిక తుఫానును తట్టుకోగలదు. వివిధ ఆర్థిక పరిస్థితులలో కూడా మెరుగ్గా పనిచేసే విభిన్న అసెట్‌లతో, మీరు కొంత స్థిరమైన వృద్ధిని పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, సాధారణంగా స్టాక్స్ తగ్గినప్పుడు, బంగారం పెరుగుతుంది, తద్వారా మీ రిస్క్‌ తగ్గించబడవచ్చు.

డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు:

గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ నిర్వహించడానికి మరియు తెరవడానికి అదనపు ఖర్చులు అవుతాయని భయపడుతున్నారా? అదృష్టవశాత్తు, గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లు మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి, డీమ్యాట్ అకౌంట్‌ను తెరవకుండానే మీరు వాటిలో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది పెట్టుబడిదారులకు సౌకర్యవంతంగా మరియు అనేక మందికి అందుబాటులో ఉండేలా చేస్తుంది. మీరు స్టాక్ ఎక్స్చేంజ్‌లో గోల్డ్ ఈటిఎఫ్‌లను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లేదా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే డీమ్యాట్ అకౌంట్ అవసరం.

లిక్విడిటీ ప్రయోజనాలు:

బంగారం తరచుగా ఒక పెట్టుబడి ఎంపికగా ఎంచుకోబడుతుంది, ఎందుకనగా ఇది అత్యంత లిక్విడిటీ కలిగిన వస్తువు, అలాగే గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లు కూడా. వాస్తవానికి, ఇతర ఆస్తులతో పోలిస్తే, బంగారాన్ని లిక్విడేట్ చేయడం అనేది భారతదేశంలో అత్యంత వేగవంతమైన మరియు సులభమైన ప్రక్రియ. నగదు ఆవశ్యకత సందర్భాల్లో, గోల్డ్ ఎఫ్ఓఎఫ్ ల రూపంలో అత్యధిక లిక్విడిటీ ఉన్న పెట్టుబడులను కలిగి ఉండటం వల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకనగా, వాటిని ఒకసారి రీడీమ్ చేసిన తర్వాత సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బౌతికపరమైన బంగారం కంటే కూడా గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లను లిక్విడేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు నగదుగా మార్చుకోవాలనుకుంటున్న మొత్తంలో మీకు వశ్యత అనేది ఉంటుంది.

చివరగా, అస్థిర మార్కెట్ ప్రవర్తన సందర్భాల్లో ఒక హెడ్జ్‌గా పనిచేయడం, ఒకరి పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేయడంలో గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లు అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలు. స్టోరేజ్ ప్రయోజనాలు మరియు వాడుకలో సౌలభ్యం వంటి విషయాల్లో భౌతిక బంగారం కంటే కూడా గోల్డ్ ఎఫ్ఓఎఫ్ లు ఉన్నతమైనవిగా పరిగణించబడతాయి. మీరు మీ రిస్క్ సామర్థ్యాన్ని మరియు ఆర్థిక లక్ష్యాలను బట్టి నిప్పాన్ ఇండియా గోల్డ్ సేవింగ్స్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు.


Get the app