Sign In

భారతదేశంలో అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్‌లను ఎలా ఎంచుకోవాలి​

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అత్యంత ప్రజాదరణ పొందిన ఒక ట్రెండ్‌గా మారాయి. కానీ ఇప్పటికీ చాలా మంది భారతీయులు తమ సేవింగ్ అకౌంట్స్‌లో పెద్ద మొత్తంలో పొదుపు చేస్తున్నారు మరియు వారి అతిపెద్ద పెట్టుబడిలో సాధారణంగా ఇల్లు ఉంటుంది. భారతదేశంలో చాలా మందికి పెట్టుబడుల గురించి అవగాహన లేదు లేదా వాటి కోసం సమయం లేదు. ఇది ‌మ్యూచువల్ ఫండ్స్‌ భారతదేశంలో ప్రజాదరణ పొందడానికి ఒక కారణం.

మీకు సరిపోయే ఉత్తమ మ్యూచువల్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక అనేది మనలను అయోమయంలో పడేసే మరియు ఆలోచింపజేసే పని. అందుకే,‌ టాప్ మ్యూచువల్ ఫండ్స్ ‌ను ఎంచుకునేటప్పుడు గుర్తించుకోవలసిన అంశాలు మీకోసం:

  • మంచి ఫండ్ హౌస్‌ని ఎంచుకోండి: మీకు నచ్చిన ఫండ్‌ని వెతకడంతో పాటు, మార్కెట్‌లో మంచి పేరు ప్రఖ్యాతలున్న ఫండ్ హౌస్‌లను ఎంచుకోండి. ఈ ఫండ్ హౌస్‌లకు విస్తృత ఉనికి, నిరూపించబడిన ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఒక మంచి ఫండ్ హౌస్ మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సమర్థవంతంగా నిర్వహిస్తుంది, తద్వారా మీకు ఎక్కువకాలం పాటు స్థిరమైన రాబడులను అందిస్తుంది.
  • స్థిరత్వం కోసం చూడండి: పెట్టుబడి పెట్టే ముందు స్వల్పకాలిక రిటర్న్స్ కాకుండా 4-10 సంవత్సరాల వంటి దీర్ఘ కాల వ్యవధిలో ఫండ్ పనితీరులో స్థిరత్వం కోసం చూడాలి. అప్పుడు, బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించే స్కీములను ఎంచుకోవడానికి మరియు వారి పోటీదారులతో సులభంగా సరిపోల్చుకోవడానికి సులభంగా ఉంటుంది.
  • రిస్క్‌లు మరియు రిటర్న్స్: చాలా వరకు సెక్యూరిటీలలో పెట్టుబడులు కొంత స్థాయిలో రిస్క్‌ను కలిగి ఉంటాయి, ఒకవేళ తీసుకున్న రిస్క్‌కు తగిన రిటర్న్స్ లేకపోతే, అలాంటి పెట్టుబడులు చేయడం సరైన నిర్ణయం కాదు. ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఇతర వాటితో పోలిస్తే అదే స్థాయి రిస్క్‌తో ఇతరుల కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంది. ఈ అంశాలను పరిగణించడం వలన తగిన రిస్కుతో గరిష్ట స్థాయిలో రిటర్న్స్ పొందడానికి సహాయపడుతుంది. ఇలా చేయడానికి, మీరు వాటి రిస్క్ టోలరెన్స్‌ను విశ్లేషించడం ముఖ్యం.
  • పెట్టుబడికి సంబంధించిన లక్ష్యం: పెట్టుబడిదారు సాధారణంగా తన సేవింగ్స్, తన లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని మెరుగుపరచాలని భావిస్తారు. లక్ష్యం యొక్క అవధికి తగినట్లుగా పెట్టుబడి ఉండాలి, ఇది మ్యూచువల్ ఫండ్ రకాన్ని నిర్ణయిస్తుంది. ఒక వేళ మీరు తక్కువ అవధిని ఎంచుకుంటే, ‌డెట్ ఫండ్స్ ‌ఎల్లప్పుడూ ఒక మంచి ఎంపిక. మధ్యకాలిక వ్యవధిని పరిగణిస్తున్న పెట్టుబడిదారులకు, డెట్ మరియు ఈక్విటీ కలిగి ఉన్న బ్యాలెన్స్ ఫండ్‌లు చక్కని ఎంపిక. దీర్ఘ కాలిక పెట్టుబడిదారులు వీటిలో అదనపు ఎక్స్‌పోజర్‌ను ఎంచుకోవచ్చు:‌ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.
  • ఫండ్ డైవర్సిఫికేషన్: మ్యూచువల్ ఫండ్స్ అనేక రకాల కేటగిరీలు, రంగాలు, స్టాక్స్, బంగారం మొదలైన వాటిలో డైవర్సిఫికేషన్‌ను అందిస్తాయి అని భావించబడుతుంది. ఒక నిర్దిష్ట రంగం, స్టాక్ లేదా అసెట్ కేటగిరీ ఆధారంగా ఉన్న పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే, విస్తృత శ్రేణి కలిగిన పోర్ట్‌ఫోలియోలో రిస్క్ స్థాయి తక్కువగా ఉంటుంది.
  • మ్యూచువల్ ఫండ్ ఫీజులు, ఛార్జీలు మరియు నెట్ రిటర్న్: అందించిన సేవల కొరకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడులపై రుసుము వసూలు చేస్తాయి. ఫీజులు ఎగ్జిట్ లోడ్ మరియు ఎక్స్‌పెన్స్ రేషియోగా విభజించబడ్డాయి. మీ పెట్టుబడిపై నెట్ రిటర్న్‌ని నిర్ణయించడంలో ఈ ఫీజులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సాధారణంగా ముందుగా నిర్ణయించబడిన కాలపరిమితికి ముందుగానే రిడీమ్ చేయబడే పెట్టుబడులపై ఎగ్జిట్ లోడ్ వసూలు చేస్తాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు, పెట్టుబడిదారులు ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేయబడే కాల వ్యవధిని అర్థం చేసుకోవాలి. ఈ కాల వ్యవధి పెట్టుబడి కోసం ఉద్దేశించిన లక్ష్య వ్యవధి కంటే తక్కువగా ఉండాలి.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.



Get the app